Illu Illalu Pillalu: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ డైలీ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) రోజురోజుకూ సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ బంధాలు, ఎత్తులు పైఎత్తుల నడుమ సాగుతున్న ఈ సీరియల్‌లో ప్రస్తుతం ప్రేమ ప్రవర్తన సీరియల్ వీక్షకులకు పెద్ద షాక్‌గా మారింది.
కఠినంగా ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో మొన్నటివరకూ ధీరజ్ పై అమితమైన ప్రేమను చూపించింది ప్రేమ. కానీ ఇప్పుడు అత్యంత కఠినంగా మారిపోయింది. ధీరజ్ పట్ల అత్యంత పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. శ్రీవల్లి, భద్రావతిలు పన్నిన కుట్రల వల్ల ప్రేమ మనసు మారి.. ధీరజ్‌ను దూరం పెడుతుండటం కథలో అసలైన నిప్పు రాజేసింది.
కుంకుమ వద్దంటూ
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ మామూలు గా మారలేదు. గుడిలో జరిగిన ప్రత్యేక కుంకుమార్చన పూజ సందర్భంలో ప్రేమ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్త పేరిట అర్చన చేయించాలని పూజారి ఎంత చెప్పినా, ధీరజ్ పేరును ఉచ్ఛరించడానికి ప్రేమ ఏమాత్రం ఒప్పుకోలేదు.
భర్త పేరు చెప్పకపోతే అరిష్టమని భద్రావతి రెచ్చగొట్టినప్పటికీ, ప్రేమ మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఇక సౌభాగ్యానికి ప్రతీకగా ధీరజ్ తన చేతితో ప్రేమ నుదుటన కుంకుమ తిలకం దిద్దుతానంటే.. ప్రేమ వద్దంటే వద్దని నిష్కర్షగా తిరస్కరించింది.
అందరూ షాక్
ధీరజ్‌తో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా, అసలు అతను తనకు తెలియదన్నట్లుగా ప్రేమ ప్రవర్తిస్తున్న తీరు చూసి రామరాజు కుటుంబాల సభ్యులు, పూజారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు నిజం తెలుసుకోకుండా, కేవలం అపార్థంతో ఈ స్థాయిలో ప్రవర్తించడం సరికాదని ప్రేమతో అంటున్నారు.
ముక్కలైన ధీరజ్ గుండె
{{/usCountry}}ధీరజ్‌తో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా, అసలు అతను తనకు తెలియదన్నట్లుగా ప్రేమ ప్రవర్తిస్తున్న తీరు చూసి రామరాజు కుటుంబాల సభ్యులు, పూజారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు నిజం తెలుసుకోకుండా, కేవలం అపార్థంతో ఈ స్థాయిలో ప్రవర్తించడం సరికాదని ప్రేమతో అంటున్నారు.
ముక్కలైన ధీరజ్ గుండె
{{/usCountry}}మరోవైపు ప్రేమను ప్రాణంగా ప్రేమించే ధీరజ్‌కు ఈ పరిణామాలు గుండెకోతను మిగిల్చాయి. తనను ప్రాణంగా భావించిన భార్యే తన పట్ల ఇంతటి ద్వేషం చూపిస్తుంటే ధీరజ్ తట్టుకోలేక విలవిలలాడుతున్నాడు.
ఇల్లు ఇల్లాలు సీరియల్ తాజా ప్రోమోలో ఒక వ్యక్తిని కాపాడబోయి ధీరజ్ తలకు గాయమవుతుంది. రక్తం కూడా కారుతుంది. ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంటారు. కానీ ప్రేమ మాత్రం దూరం నుంచి చూస్తూ, అక్కడే ఆగిపోతుంది.
నెటిజన్ల రియాక్షన్
సీరియల్ లో ధీరజ్ పడుతున్న వేదన, అతని నిస్సహాయతను చూసి సోషల్ మీడియాలో సీరియల్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. "అంతగా ప్రేమించే ధీరజ్ మనసును ప్రేమ ఇలా ముక్కలు చేయడం అన్యాయం" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రావతి, శ్రీవల్లి కుట్రలు ఎప్పుడు బయటపడతాయో, ధీరజ్ బాధ ఎప్పుడు తీరుతుందో అని బుల్లితెర వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.