Illu Illalu Pillalu Serial: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ వారానికో కొత్త స్టోరీ లైన్ తో, అదిరిపోయే ట్విస్ట్ లతో సాగిపోతోంది. ఇప్పుడేమో సీరియల్ లో రామరాజు కుటుంబానికి పెద్ద సమస్య వచ్చింది. అర్జెంట్ గా రూ.50 లక్షలు అవసరం వచ్చింది. మరి ఈ డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
పంతానికి పోయిన ప్రేమ

ట్రావెల్స్ ఆఫీస్ వేలం పాటలో ప్రేమ పంతానికి పోయిన సంగతి తెలిసిందే. తన అత్త భద్రావతి ముందు భర్త ధీరజ్ ఓడిపోవద్దని ఎక్కువ రేట్ అయినా సరేనని రూ.30 లక్షలకు వేలం పాట పాడింది. ఇప్పుడా డబ్బు ఎలా అరెంజ్ చేయాలా? అని ధీరజ్ తల పట్టుకుంటున్నాడు.
సేట్ డిమాండ్
మరోవైపు నగలు పెట్టి డబ్బులు తీసుకున్న సాగర్ కు కూడా షాక్ తగిలింది. ఆ సేట్ మరోసారి ఇంటికి వచ్చాడు. వడ్డీ కట్టడం కాదు అసలు కట్టాలంటూ అరిచాడు. దీంతో సాగర్ పొగరుగా మాట్లాడాడు. నాలుగు రోజుల్లో రూ.20 లక్షలు ముఖం మీద పడేస్తాననన్నాడు.
ఆస్తి అమ్మాలని
ఇప్పుడు ధీరజ్ కు రూ.30 లక్షలు, సాగర్ కు రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షలు కావాలి. ఈ నేపథ్యంలో ఊరి బయట ఉన్న స్థలాన్ని అమ్మాలని రామరాజు అనుకుంటున్నాడు. కానీ అందుకు కొడుకులు ఒప్పుకొంటారా? అన్నది సందేహంగా మారింది. తండ్రి మాట కాదనరు అని రామరాజు చెప్తున్నాడు.
లంచానికి అలవాటు
డబ్బులు పెట్టి గవర్నమెంట్ జాబ్ కొనుక్కున్న సాగర్ ఇప్పటికే లంచానికి అలవాటు పడ్డాడు. ఓ సారి నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ డబ్బు అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సాగర్ దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. ఇంకా రూ.15 లక్షలు కావాలి.
ఊబిలో కూరుకుపోతాడా?
{{/usCountry}}డబ్బులు పెట్టి గవర్నమెంట్ జాబ్ కొనుక్కున్న సాగర్ ఇప్పటికే లంచానికి అలవాటు పడ్డాడు. ఓ సారి నర్మదకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా ఆఫీస్ మెయింటెనెన్స్ డబ్బు అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు సాగర్ దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. ఇంకా రూ.15 లక్షలు కావాలి.
ఊబిలో కూరుకుపోతాడా?
{{/usCountry}}సాగర్ కు ఇప్పుడు రూ.15 లక్షలు అర్జెంట్ గా కావాలి. ఈ నేపథ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మేకర్స్ మరోసారి సాగర్ లంచావతారం చుట్టూ కథను తిప్పుతారని అనిపిస్తోంది. ఇప్పుడో భారీ డీల్ రూపంలో పెద్ద మొత్తం లంచం ఆఫర్ చేస్తే సాగర్ లొంగిపోయే అవకాశముంది.
ఇప్పటికే ఎలాంటి తప్పు చేయొద్దని నర్మద వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ సాగర్ తన తండ్రి సాయం లేకుండా సేట్ కు డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాబట్టి లంచం తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్లలో సాగర్ లంచం చుట్టూ కథను నడిపి, మేకర్స్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని టాక్.