Illu Illalu Pillalu: నాన్న కోపానికి ఎప్పుడో బలైపోయేవాడినన్న సాగర్.. అమ్మ కోసం కొడుకులు, కోడళ్ల ఫైట్.. వేదవతికి ఎవరిష్టం?

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొడుకులు, కోడళ్లు కలిసి వేదవతి ప్రేమ కోసం ఫైట్ చేస్తున్నారు. వేదవతికి నేను ఎక్కువ అంటే లేదు నేనే ఎక్కువ ఇష్టమని అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అసలు కారణం ఏంటో? ఇక్కడ చూసేయండి.

Published on: May 10, 2026, 16:03:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కొడుకులు, కోడళ్లు ఫైట్ చేసుకుంటున్నారు. మా అమ్మే నన్నే ఎక్కువ ప్రేమిస్తుందంటూ కొడుకులు, మా అత్తయ్యకు నేనే ఎక్కువ ఇష్టమంటూ కోడళ్లు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. మదర్స్ డే 2026 సందర్భంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ ఇలా స్పెషల్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ (instagram-STAR MAA)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ (instagram-STAR MAA)

చందు ఫస్ట్

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వేదవతి పెద్ద కొడుకు చందు. ‘‘మా అమ్మకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. నన్ను కడుపులో మోసి కన్నట్లుగానే, నా విషయాలను కడుపులో దాచుకుంటుంది. అమ్మకు నేనే ఎక్కువ ఇష్టం’’ అని చందు చెప్తాడు. సీన్ లోకి ఎంటరైన సాగర్ తన అన్నయ్య చందుకు ట్విస్ట్ ఇస్తాడు.

నాన్న కోపం

‘‘అమ్మకు నేనే ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్న కోపానికి నేనెప్పుడో బలయ్యేవాణ్ని. కానీ అమ్మ ప్రేమ నన్ను కాపాడుతూ వస్తోంది’’ అని సాగర్ చెప్తాడు. మరోవైపు చిన్న కొడుకు ధీరజ్ ఏమో స్టైల్ గా కౌంటర్ ఇస్తాడు. ‘‘చిన్న కొడుకంటేనే అమ్మకు ఇష్టం. మేనకోడలు ప్రేమను తీసుకొచ్చాను కదా. అందుకే ఆ ఇద్దరి కంటే నేనే ఎక్కువ ఇష్టం’’ అని ధీరజ్ అంటాడు.

కోడళ్లు కూడా

మరోవైపు కోడళ్లు కూడా అత్తయ్యకు తామే ఎక్కువ ఇష్టమంటూ మాటల యుద్ధం చేస్తారు. ‘‘ఇంటి పెద్ద కోడలిని. పెత్తనం కూడా మనదే. అలాగే అత్తయ్యకు నేనంటేనే ఇష్టం. హ్యాపీ మదర్స్ డే’’ అని పెద్ద కోడలు శ్రీవల్లి చెప్తుంది. వెంటనే రంగంలోకి నడిపి కోడలు నర్మద దిగుతుంది. ‘‘అత్తయ్యకు నేనేంటనే చాలా ప్రేమ’’ అని నర్మద చెప్తుంది. ఇక చిన్న కోడలు ప్రేమ ఏమో చలాకీగా కౌంటర్ వేస్తుంది.

ఎవరంటే?

అసలు విషయానికి వస్తే వేదవతి చెప్పే సమాధానం ఇంట్రెస్టింగ్ గా మారింది. ‘‘చెట్టుకు కాసే కాయల్లో ఏ కాయ ఇష్టమంటే చెట్టు ఏం చెప్తుంది. నేను కూడా అంతే. నా బిడ్డల్లో అందరూ ఇష్టమే’’ అని వేదవతి చెప్తుంది.

‘‘మా ఇంటిని అమ్మాలా కాపాడే వేదవతి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తరపున అందరికీ హ్యాపీ మదర్స్ డే’’ అని రామరాజు చెప్తాడు. మొత్తానికి ఇల్లు ఇల్లాలు సీరియల్ తరపున ఆడియన్స్ కు హ్యాపీ బర్త్ డే చెప్పడం కోసం సీరియల్ టీమ్ ఇలా ప్లాన్ చేసింది. ఈ వీడియోను ఇన్ స్టాలో స్టార్ మా పోస్టు చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More