Illu Illalu Pillalu April 28th Episode:కడుపు లేదు, కాకరకాయ లేదు- భాగ్యం మాటతో ఇడ్లీ బాబాయ్ వణుకు- వల్లికి చందు వార్నింగ్

Illu Illalu Pillalu April 28th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో కడుపుపై చేయి పెట్టుకుని వల్లి మురిసిపోతుంటుంది. కడుపులో ఏం లేదని చెప్పిన భాగ్యం మళ్లీ కవర్ చేస్తుంది. వల్లికి చందు వార్నింగ్ ఇస్తాడు. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదని తెలిసిన ఇడ్లీ బాబాయ్ భయంతో వణికిపోతాడు.

Published on: Apr 28, 2026, 07:50:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu April 28th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి రామరాజు ఇంట్లోకి వెళ్లేలా భాగ్యం ప్లాన్ చేస్తుంది. మరోవైపు సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్లో కొత్త అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో చూద్దాం.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నర్మద భయం

తన పెద్ద కోడలు శ్రీవల్లి నెల తప్పిందని రామరాజు గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఈ ఫంక్షన్ కు నర్మద తల్లిదండ్రులు కూడా వస్తారు. మామయ్యకు మా నాన్న అంటే అసలు పడట్లేదు. ఏమైనా గొడవ అవుతుందేమోనని భయంగా ఉందని ప్రేమతో నర్మద అంటుంది. మరోవైపు అద్దంలో కడుపును చూసుకుంటూ శ్రీవల్లి మురిసిపోతుంటుంది.

వల్లి ఆనందం

అప్పుడే భాగ్యం వస్తుంది. కడుపులో లేని బిడ్డపై అమ్మడు తెగ ప్రేమ పెంచేసుకుంటోంది. నిజం తెలిస్తే ఏమైపోతుందోనని భాగ్యం అనుకుంటుంది. ఇడ్లీ బాబాయ్ ఏమో పెదరాయుడిలా బిల్డప్ కొడతాడు. పాటలతో అదరగొడతాడు. ఆవిడ గారండీ మన అమ్మాయికి అమ్మాయి పుడితే నీలా, అబ్బాయి పుడితే నాలా ఉంటాడని ఇడ్లీ బాబాయ్ అంటాడు. నా బిడ్డకు మీ పోలికలు కానీ బుద్ధులు కానీ అసలు రానివ్వనని శ్రీవల్లి చెప్తుంది. మా అత్తయ్య, మామయ్యలు ఉండాలని అంటుంది.

కడుపు ఉంటే కదా

నా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు, ఆ బిడ్డ ఎలా ఉందోననే కంగారు.. ఎప్పుడెప్పుడు చూసుకోవాలనే ఆశ ఉంటాయి కదా అని వల్లి అంటుంది. పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు కడుపు ముందుకు రావాలి కదా అని వల్లి అడుగుతుంది. ఉంటే కదా రావడానికి అని భాగ్యం అనడంతో వల్లి షాక్ అవుతుంది. అంటే నిజంగా నా కడుపులో బిడ్డ లేదా? నేను తల్లిని కావడం లేదా? అని వల్లి ఫీల్ అవుతుంది. నెల తప్పిన విషయం ఈ రోజే తెలిసింది కదా, అప్పుడే పొట్ట బయటకు ఎలా వచ్చేస్తుందని భాగ్యం కవర్ చేస్తుంది.

చందు వార్నింగ్

అప్పుడే చందు, ధీరజ్ వస్తారు. బా, బా అంటూ వల్లి ప్రేమగా మాట్లాడుతుంది. నా తప్పు తెలుసుకొని పూర్తిగా మారిపోయా బా. నా కడుపులో బిడ్డ కోసమైనా క్షమించు బా అని వల్లి అడుగుతుంది. కడుపులో బిడ్డ ఉంది కాబట్టే మా ఇంట్లో ఉన్నావ్. మా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా మళ్లీ మోసం చేస్తే జన్మలో నీ ముఖం చూడనని చందు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.

ఆడుతున్న డ్రామా

మా అమ్మాయి కడుపులో బిడ్డ లేదు. మా అమ్మాయి నిజంగానే నెల తప్పలేదు. ఇదంతా మేం ఆడుతున్న డ్రామా అని ఇడ్లీ బాబాయ్ గట్టిగా అరుస్తాడు. ఇదేనా మీ మాటల్లో మీనింగ్ అని ఆవేశపడతాడు. మామయ్య జాగ్రత్త, నేను అలా అనలేదు కదా. ఎందుకు గొంతు చించుకుంటున్నావ్ అని ధీరజ్ అడుగుతాడు. నీకు అంత నమ్మకం లేకపోతే, ఇప్పుడే అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తా. 9 నెలల తర్వాత బిడ్డతో అడుగుపెడతానని ఇడ్లీ ఊగిపోతాడు.

వజ్రాయుధం

మా వదినను తీసుకుని జస్ట్ గుమ్మం దాటు చాలు అని ఇడ్లీతో ధీరజ్ అంటాడు. మా అమ్మడి కడుపులో ఈ ఇంటి వారసుడు ఉన్నాడు. భయపడే రోజులు పోయాయి చిన్న అల్లుడు అని ఇడ్లీ బాబాయ్ అరుస్తాడు. వేస్ట్ ఫెలోస్, వీళ్లతో నీకెందుకు రా అని ధీరజ్, వల్లిని తీసుకొని చందు వెళ్లిపోతాడు. మన అమ్మడి కడుపులో వజ్రాయుధం ఉందని భాగ్యంతో ఇడ్లీ అంటాడు.

నిజం చెప్పిన భాగ్యం

మన అమ్మడికి కడుపు లేదు, కాకరకాయ లేదు. కాపురం నిలబెట్టడం కోసం, ఇంట్లో తిరిగి అడుగుపెట్టడం కోసం డాక్టర్ తో అబద్ధం చెప్పించానని భాగ్యం చెప్పడంతో ఇడ్లీ బాబాయ్ మైండ్ బ్లాక్ అవుతుంది. మన బేబీకి నో బేబీ నా అంటూ మంచంపై పడిపోతాడు ఇడ్లీ.

శ్రీవల్లిని పల్లకిలో మోసుకొని తీసుకొస్తారు. అప్పుడే ప్రేమను పల్లకిలో ఉన్నట్లు ఊహించుకుని ధీరజ్ ఓ సాంగ్ వేసుకుంటాడు. కట్ చేస్తే రియాలిటిలోకి వస్తాడు. ఏమైందని ప్రేమ అడుగుతుంది. ఇడ్లీ ఏమో భయంతో వణికిపోతాడు. అమ్మడి కడుపంతా డ్రామా అని బయటపడ్డ సమయమే నా అంతిమ యాత్ర జరుగుతుందని ఇడ్లీ అంటాడు.

బుజ్జమ్మ మన పెద్దమ్మాయి అక్షింతలు వేసి కార్యక్రమం ప్రారంభించాలని రామరాజు అంటాడు. మరోవైపు కామాక్షి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More