Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో ఫుల్ గా తాగిన రామరాజు తన చిన్నకొడుకు బాధను చూసి కుమిలిపోతాడు. ప్రేమను తీసుకెళ్లడానికి ధీరజ్ వెళ్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అమ్మ మోసం చేయలేదు

తిరుపతితో కలిసి మందు తాగుతూ రామరాజు ఫీల్ అవుతాడు. బుజ్జమ్మా పెద్ద నిజం దాచి నన్ను మోసం చేసిందిరా అని ఎమోషనల్ అవుతాడు. నా బుజ్జమ్మాతో పాటు అందరూ నన్ను మోసం చేశారని తెలిస్తే గుండె పగిలి చస్తానురా. ఇప్పటికే గుండె అంతా పట్టేసినట్లు ఉందిరా అని రామరాజు అంటాడు. అప్పుడే వచ్చిన ధీరజ్.. అమ్మ నిన్ను మోసం చేయలేదు నాన్న అని చెప్తాడు.
కరిగిన రామరాజు
అమ్మ దగ్గర నేను మాట తీసుకున్న కాబట్టి మీకు ఆ విషయం చెప్పలేదు. అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదని తండ్రితో ధీరజ్ అంటాడు. కన్న కొడుక్కి ఇచ్చిన మాట కోసం కట్టుకున్న భర్తను మోసం చేయొచ్చా అని రామరాజు అడుగుతాడు. నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెల్లె ఏడుస్తుంది, చందు అన్నయ్య బాధపడుతున్నాడని ధీరజ్ చెప్పేసరికి రామరాజు కరిగిపోతాడు.
ఇంత జరిగినా నేను ప్రాణాలతో ఉన్నది పిల్లల కోసమేరా అని ఎమోషనల్ డైలాగ్ పేలుస్తాడు రామరాజు. తండ్రిని కార్లో ఇంటికి తీసుకొస్తాడు ధీరజ్.
భద్రావతి మొసలి కన్నీరు
ఇటు అత్తారింటి వైపు చూస్తూ ప్రేమ ఏడుస్తూనే ఉంటుంది. నీ చిన్నత్తలాగే నేను కూడా నీకు మనసు లేని బండరాయిలా, అర్థం చేసుకోలేని రాక్షసిలా కనిపించాను కదూ. నీ మనసులో అంత బాధ ఉండే నాకెందుకు చెప్పలేదు. నువ్వు ధీరజ్ తో వెళ్లిపోయావని మేం బాధపడుతూనే ఉన్నాం. నీ జీవితంలో కళ్యాణ్ అనే చేదు గతం ఉందని మాకు ఎందుకు చెప్పలేదని ప్రేమ దగ్గర భద్రావతి మొసలి కన్నీరు కారుస్తుంది.
నీకు అమ్మానాన్న అన్నీ అయి నేనే పెంచా కదా. మరి వాడు ఎవడో మోసం చేశాడని నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు. అప్పుడే చెప్పి ఉంటే నిన్ను ఇంటికి తీసుకొచ్చేవాళ్లం కదా. అప్పుడు ధీరజ్ నీ మెడలో తాళి కట్టి ఉండేవాడు కాదు కదా. నిన్ను అవమానించేవాడు కాదు కదా.నేను ప్రేమగా పెంచిన వాళ్లందరూ వదిలేసి వెళ్లిపోతున్నారని భద్రావతి ఏడుస్తుంది.
వేదవతి ఎమోషనల్
{{/usCountry}}నీకు అమ్మానాన్న అన్నీ అయి నేనే పెంచా కదా. మరి వాడు ఎవడో మోసం చేశాడని నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు. అప్పుడే చెప్పి ఉంటే నిన్ను ఇంటికి తీసుకొచ్చేవాళ్లం కదా. అప్పుడు ధీరజ్ నీ మెడలో తాళి కట్టి ఉండేవాడు కాదు కదా. నిన్ను అవమానించేవాడు కాదు కదా.నేను ప్రేమగా పెంచిన వాళ్లందరూ వదిలేసి వెళ్లిపోతున్నారని భద్రావతి ఏడుస్తుంది.
వేదవతి ఎమోషనల్
{{/usCountry}}మరోవైపు రామరాజు కోసం అందరూ బయట కూర్చొని ఎదురు చూస్తుంటారు. రామరాజును తీసుకొని ధీరజ్ రావడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మందు ఎక్కువై రామరాజు తూలుతూ ఉంటాడు. మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చా? నేను ఏడుస్తానని తెలియదా? అని రామరాజును హత్తుకుని ఏడ్చేస్తుంది వేదవతి.
కానీ భార్యను దూరం నెట్టేస్తాడు రామరాజు. రేయ్ పెద్దోడా నాతో మాట్లాడొద్దని అమ్మకు చెప్పు అని రామరాజు అంటాడు. చిన్నోడి గురించి ఎందుకు చెప్పలేదో అమ్మ ఇప్పటికే చెప్పింది. అమ్మతో మాట్లాడమని చందు, అమూల్య తన తండ్రిని అడుగుతారు. మీ కోపాన్ని తట్టుకుంటా కానీ మీ మౌనాన్ని మాత్రం భరించలేనని వేదవతి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
కొడుకు జీవితాన్ని పణంగా
ఇప్పుడు ఇద్దరి భవిష్యత్ లు శూన్యంగా మారిపోయాయి. నువ్వే ఇలా మార్చేశావ్. వీళ్ల పెళ్లి నిజం బయటపడ్డప్పుడు ఇలా కాకుండా ఎలా జరుగుతుంది? నువ్వు నా నమ్మకాన్ని మోసం చేయడమే కాదు నా కొడుకు జీవితాన్ని పణంగా పెట్టావ్ అని రామరాజు సీరియస్ అవుతాడు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు బాధ పడకండని తండ్రితో చెప్తాడు ధీరజ్.
భార్యను తీసుకురమ్మని
మీరందరూ మీ అమ్మ మీద ఉన్న కోపాన్నే చూస్తున్నారు కానీ నా కొడుకు బాధను చూసి నేను ఇంకా బాధపడుతున్నా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రేమ నీ భార్య. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరు జీవితాంతం కలిసి బతకాల్సిందే. నీ భార్యను ఇంట్లోకి తీసుకొచ్చే దారి ఏంటో నువ్వే చూసుకో అని ధీరజ్ కు చెప్తాడు రామరాజు.
ప్రేమ దగ్గరకు ధీరజ్
పొద్దున ధీరజ్ గీత దాటి భద్రావతి ఇంటికి వెళ్తాడు. ప్రేమ దగ్గర నిలబడతాడు. ధీరజ్ ను చూసి ప్రేమ సంబరపడిపోతుంది. కానీ హగ్ చేసుకోలేక ఆగిపోతుంది. కాళ్లను కంట్రోల్ చేసినంత ఈజీ కాదే, మనసును కంట్రోల్ చేయడం. నీ మనసులోని ప్రేమ కళ్లల్లో కనిపిస్తోంది. ఇంట్లోకి వెళ్దాం పదా అని ప్రేమ చేయి పట్టుకుంటాడు ధీరజ్. చిన్న విషయానికే అలిగి వచ్చేస్తావా అని అడుగుతాడు.
అంత మంది ముందు నువ్వు మాట్లాడిన మాటలు చిన్న విషయమా? అందరి ముందు చచ్చిపోయేలా చేయడం చిన్న విషయమా? అని ప్రేమ అడుగుతుంది. మీ నాన్న మా అమ్మను అందరి ముందు అలా అనడంతో కోప్పడ్డానని ధీరజ్ చెప్తాడు. నీకు కోపం రాగానే కళ్యాణ్ విషయం తీశావంటే నీ మనసులో ఏదో ఉందనే కదా అని ప్రేమ అడుగుతుంది.
సారీ చెప్పిన ధీరజ్
సంవత్సర ప్రయాణం మనది. నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావ్. నేనేంటో తెలియదా నీకు? నీ మనసులో బాధను దూరం చేసి హ్యాపీగా ఉంచేలా చేస్తున్నా కదా. ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం దేవుళ్ల వల్లే కాలేదు. మరి నేనెంత? కోపంలో జారిన మాటలు చూస్తున్నావ్ కానీ నా ప్రేమను చూడటం లేదు. క్షమించడం, అర్థం చేసుకోవడం లేకపోతే ప్రేమ అనే ఎమోషన్ కు అర్థం ఏముంటుందని ధీరజ్ అంటాడు.
నేను మాట జారాను, తప్పే. సారీ చెప్తున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వమని ధీరజ్ అడిగేసరికి ప్రేమ కరిగిపోతుంది. ధీరజ్ ను హగ్ చేసుకుంటుంది. ప్రేమ చేయి పట్టుకొని ధీరజ్ తీసుకెళ్తాడు. నా ఇంటికి రావడానికి, నా మేనకోడలిని తీసుకెళ్లడానికి ఎంత ధైర్యం నీకు అని భద్రావతి ప్రేమను ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.