ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 24 ఎపిసోడ్: వల్లి కడుపులో బిడ్డ లేదన్న మెషీన్- తాయెత్తు ప్లాన్-హాస్పిటల్ కు లాక్కెళ్లిన నర్మద

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ లో కథ మలుపు తీసుకుంటుంది. వల్లి డ్రామాను బయటపెట్టేందుకు లై డిటెక్టర్ టెస్టు, తాయెత్తు ప్లాన్ చేస్తారు నర్మద, ప్రేమ, ధీరజ్. వల్లిని నర్మద హాస్పిటల్ కు లాక్కెళ్తుంది. మరి వల్లి డ్రామా బయటపడిందా? అన్నది చూద్దాం.

Published on: Jun 24, 2026, 08:06:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ లో.. లై డిటెక్టర్ తో వల్లి ప్రెగ్నెన్సీ డ్రామాపై అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ సంగతి తేల్చాలని ప్రేమ, నర్మద, ధీరజ్ కలిసి తాయెత్తు ప్లాన్ వేస్తారు. చివరకు వల్లిని నర్మద హాస్పిటల్ కు లాక్కెళ్తుంది. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

కడుపులో బిడ్డ ఉందా?

లై డిటెక్టర్ టెస్టుతో శ్రీవల్లి బండారం బయటపడుతుంది. అసలు వల్లి ఒక్కసారి కూడా హాస్పిటల్ కూడా వెళ్లలేదని తెలుస్తుంది. అసలు నీ కడుపులో బిడ్డ ఉందా? లేదా? అని నర్మద అడుగుతుంది. ఉంది అని వల్లి అనగానే మెషీన్ రాంగ్ అని అరుస్తుంది. బిడ్డ లేదు అనగానే ఆల్ రైట్ అని మెషీన్ చెప్తుంది.

ఏంటి రాంగ్? రూ.2 వందలు పెట్టి కొన్న మెషీన్ నిజాలు చెప్తే హాస్పిటల్లో స్కానింగ్ లు ఎందుకు? కోర్టులో జడ్జీలు ఎందుకు? అత్తయ్య మీరు నా కడుపును అనుమానించారని వల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ గందరగోళం ఏంటీ అని వేదవతి అడిగితే.. కాసేపు ఆగండి అత్తయ్య అన్ని తెలుస్తాయని నర్మద చెప్తుంది.

తాయెత్తు ప్లాన్

నా శత్రువులకు నా మీద మళ్లీ లవ్ మొదలైందే. వాళ్లు నా చుట్టూ తిరిగేస్తారని సుక్కుతో వల్లి చెప్తుంది. అప్పుడే పైన పటారం, లోన లొటారం అని పాడుకుంటూ ధీరజ్, ప్రేమ, నర్మద వస్తారు. మన ఊరికి ఓం భూం భుష్ బాబా వచ్చాడు. ఈ తాయెత్తు కట్టుకుంటే ఎలాంటి పీడ ఉండదు. నీకు, నీ కడుపులో బిడ్డకు ఎలాంటి నర దిష్టి తగలకూడదని తాయెత్తు తెచ్చామని ప్రేమ చెప్తుంది.

రక్తం కక్కుకుని

వల్లి ఏమో తాయెత్తు వద్దంటుంది. అప్పుడే చందు వచ్చి వల్లిపై సీరియస్ అవుతాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వల్లి తాయెత్తు కట్టించుకుంటుంది. ఈ తాయెత్తు కట్టుకున్న దగ్గర నుంచి రేపు ఉదయం లోపు ఏదైనా జరగొచ్చు. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు రక్తం కక్కుకుని చచ్చిపోతారు. నైట్ నిద్రపోయినా, తాయెత్తు తీసినా నిద్రలోనే పోతారని నర్మద, ప్రేమ, ధీరజ్ చెప్పేసరికి వల్లి మైండ్ బ్లాక్ అవుతుంది.

రాత్రి కాగానే వల్లిని సుక్కు పడుకోమంటుంది. ఏంటే, తెల్లారేసరికి నా శవం చూడాలనుకుంటున్నావా? నిద్రపోతే చచ్చిపోతానే. తాయెత్తు కట్టినప్పుడు వాళ్లు చెప్పిన డైలాగ్ లు మర్చిపోయావా? అని వల్లి అంటుంది. వాళ్లు నిన్ను భయపెట్టేందుకు అలా చెప్పారని సుక్కు అనడంతో వల్లి కాస్త రిలాక్స్ అవుతుంది.

నర్మద, ప్రేమకు అనుమానం

బయటకు వెళ్లి వాటర్ తాగిన వల్లి వాంతులు చేసుకుంటే రక్తం వస్తుంది. భయపడి సుక్కు అని వల్లి అరుస్తుంది. రక్తం కక్కుకుని చావడానికి ట్రయల్ స్టార్ట్ అయిందన్న మాట. నిద్రపోతే పోయేది నేనే కదా. కలిసి జాగారం చేద్దామని సుక్కును తీసుకెళ్తుంది. ఇదంతా చూసిన నర్మద, ప్రేమకు అనుమానం వస్తుంది. వల్లిని రేపు హాస్పిటల్ తీసుకెళ్తానని నర్మద అంటుంది.

మరోవైపు వల్లి పడుకోదు. సుక్కును పడుకోనివ్వదు. ఇద్దరూ కునికిపాట్లు పడతారు. తెల్లారగానే నర్మద వచ్చి వల్లక్కాయ్ అనగానే.. నేనేమీ అబద్ధాలు చెప్పలేదు, నేను నిద్రపోలేదు. నా కడుపు అబద్ధం కాదు అని వల్లి అరుస్తుంది. రాత్రి వాళ్లు చెప్పినదాని ప్రకారం నేను చచ్చిపోవాలి కదా అని వల్లి అంటుంది.

నోరు జారిన వల్లి

అబద్ధం చెప్పా, మోసం చేశానని వల్లి మళ్లీ నోరు జారుతుంది. తెల్లవారుజామున లైట్ గా ఓ కునుకు వేశా. కానీ నిద్రపోలేదని చెప్పా కదా అని వల్లి కవర్ చేస్తుంది. అప్పుడే నీకు జ్వరం వచ్చిందని, హాస్పిటల్ కు వెళ్దామని వల్లిని నర్మద లాక్కెళ్తుంది. బయట వేదవతి ఆపుతుంది. ప్రెగ్నెంట్ లేడీకి ఫీవర్ రాకూడదు, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే కడుపులో బిడ్డకు ఏమైనా కావొచ్చని నర్మద చెప్పేసరికి వేదవతి ఓకే అంటుంది.

లాక్కెళ్లిన నర్మద

అంతగా కావాలంటే మా అమ్మ వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్తుందని వల్లి అంటుంది. మీ అమ్మకు నర్మద వదిన కంటే ఎక్కువ తెలుసా అని ధీరజ్ ప్రశ్నిస్తాడు. వేదవతి ఏమో వాళ్ల అమ్మ వచ్చి తీసుకెళ్తుందిలే వద్దని అంటుంది. కానీ నర్మద వినదు. వల్లిని లాక్కెళ్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More