Illu Illalu Pillalu May 6 Episode: షాకింగ్ ట్విస్ట్- ఇదంతా డ్రామానే- కడుపు లేదని చెప్పిన డాక్టర్- వల్లి గుండె ముక్కలు
Illu Illalu Pillalu May 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 6 ఎపిసోడ్ లో తల్లి పంపించిన పీతల కూరను వల్లి లాగించేస్తుంది. దీంతో నర్మదకు డౌట్ వస్తుంది. స్కానింగ్ తో ప్రూవ్ చేసుకుంటానని వల్లి హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. అక్కడ కడుపు లేదని డాక్టర్ చెప్పడంతో వల్లి గుండె ముక్కలవుతుంది.
Illu Illalu Pillalu May 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న సాగర్ ను రూ.5 లక్షలు కట్టాలనే కారణంతో సాగర్ ఆపుతాడు. సాగర్, నర్మద మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 6 ఎపిసోడ్ లో చూద్దాం.

ధీరజ్ ప్లాన్
నీ కంట కన్నీరు రానిస్తానా చెప్పు అని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఈ రోజు అయితే రూ.5 లక్షలు అడ్డుపెట్టి సాగర్ బావను ఆపావు. ఒకవేళ బావ డబ్బులు తెస్తే ఎలా అని ప్రేమ అడుగుతుంది. ఆ కపుల్ ను ఇంటి నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితే రానివ్వనని ధీరజ్ చెప్తాడు.
కడుపు లేదని
పొద్దున లేవగానే పీతల కూర అంటూ లాగించేందుకు శ్రీవల్లి రెడీ అయిపోతుంది. మరోవైపు భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ మాట్లాడతాడు. అమ్మడు అడిగిందని పీతలు, కోడి గుడ్డు కూర పంపించావ్. కానీ కడుపుతో ఉన్నవాళ్లు పీతలు తినొద్దు కదా. ఆ డౌట్ వేదవతి చెల్లాయ్ కు వచ్చిందంటే మన అమ్మడి కడుపు తుస్సుబుస్సు అని తెలిసిపోతుంది కదా అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. మన అమ్మడు పీతల కూర తినే విషయాన్ని ఆ ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడని భాగ్యం అంటుంది.
లాగించేస్తున్న వల్లి
ఇక బెడ్ మీద కూర్చుని శ్రీవల్లి పీతల కూరతో అన్నం లాగించేస్తుంది. అప్పుడే చందు పుల్లటి మామిడికాయలు తీసుకొని వస్తాడు. వల్లికి ఇవ్వమని నర్మదకు బ్యాగ్ ఇస్తాడు. అమూల్య విషయంలో జరిగింది తలుచుకుంటే తన ముఖం చూడాలనిపించడం లేదని చందు చెప్తాడు. ఆ బ్యాగ్ తీసుకుని బల్లక్కాయ్ అంటూ ప్రేమ, నర్మద లోపలికి వెళ్తారు.
వేదవతి సీరియస్
ఏం తింటున్నావని నర్మద అడుగుతుంది. నాకిష్టమని మా అమ్మ పీతల కూర పంపించిందని వల్లి చెప్తుంది. కడుపుతో ఉన్నవాళ్లు పీతల కూర తినకూడదని తెలీదా నీకు? అని అత్తయ్య అని పిలుస్తుంది నర్మద. నువ్వు పీతల కూర తినకూడదే. అంటే అన్నానంటారు కానీ మీ అమ్మ ఇద్దరు పిల్లల తల్లి. కడుపుతో ఉన్నవాళ్లు ఇలాంటివి తినకూడదనే బుద్ధి జ్ణానం లేదా అని వేదవతి సీరియస్ అవుతుంది.
నర్మదకు డౌట్
చందు బావ నీకోసం తీసుకొచ్చాడని బ్యాగ్ ను వల్లికి ఇస్తారు. మామిడికాయలా అని వల్లి డిసప్పాయింట్ అవుతుంది. కడుపుతో ఉన్నవాళ్లకు పులుపు వస్తువు తినాలనిపిస్తుందని, తినమని నర్మద, వేదవతి అంటారు. వగరుగా ఉందని, తిననని వల్లి చెప్తుంది. అత్తయ్యను బయటకు తీసుకెళ్తుంది నర్మద. అసలు వల్లి అక్క కడుపుతోనే లేదని డౌట్ గా ఉందని నర్మద అంటుంది.
కడుపు నాటకం
కడుపుతో ఉన్నవాళ్లు ఏం తినాలో, ఏం తినద్దో వల్లి వాళ్ల అమ్మకైనా తెలుసు కదా. తెలిసి కూడా పీతల కూర ఎలా పంపిస్తుంది? కడుపుతో ఉన్నవాళ్లు పుల్లటి వస్తువులు తినాలనుకుంటారు. కానీ అక్క ఎలా విసిరికొట్టిందో చూశారు కదా. ఇవన్నీ చూస్తుంటే డౌట్ వస్తుంది. వాళ్లమ్మ జిత్తులమారి. ఏదైనా చేయగలదని నర్మద, ప్రేమ అంటారు. ఈ మాటలన్నీ విన్న వల్లి, నా కడుపు నాటకం అంటారా? అని మండిపడుతుంది.
హాస్పిటల్ కు వల్లి
నా కడుపు పండేసరికి వీళ్లకు కుళ్లు అని వల్లి అంటుంది. మాకు అసూయ ఉండదు. అలా అనడానికి బుద్ధి ఉండక్కర్లేదా అని ప్రేమ చెప్తుంది. ఈ రోజే మీ నోరు మూయిస్తా. డాక్టర్ దగ్గరకు వెళ్దాం. ఈ రోజే స్కానింగ్ చేయిస్తానని నర్మద, ప్రేమను తీసుకొని వల్లి హాస్పిటల్ కు వెళ్తుంది. డాక్టర్ తో వల్లి మాట్లాడుతుంది. స్కానింగ్ తీసి వీళ్ల ముఖాన కొట్టమని వల్లి అడుగుతుంది.
డాక్టర్ చెప్పిన నిజం
మీ ఇష్టం వచ్చినట్లు స్కానింగ్ తీయమంటే కుదరదని డాక్టర్ తప్పించుకోవాలని చూస్తుంది. కానీ వల్లి, నర్మద పట్టుబడతారు. దీంతో స్కానింగ్ చేసేందుకు ఒప్పుకొన్న డాక్టర్.. నర్మద, ప్రేమను బయటకు వెళ్లమంటుంది. వెంటనే వల్లిని చెంపపై డాక్టర్ కొడుతుంది. మీకు, మీ అమ్మకు తమాషాగా ఉందా? నీ కాపురం నిలబెట్టమని మీ అమ్మ నా కాళ్లపై పడితే నువ్వు నెల తప్పావని అబద్ధం చెప్పా. లేని కడుపును ఎలా స్కానింగ్ చేయాలని డాక్టర్ చెప్పేసరికి వల్లి గుండె ముక్కలవుతుంది.
వల్లి ఏడుపు
నా కడుపులో బిడ్డ ఉందనుకుని, నిజంగా తల్లిని కాబోతున్నానని చాలా సంతోషపడ్డా డాక్టర్. నేను తట్టుకోలేకపోతున్నానని వల్లి ఏడ్చేస్తుంది. మీ అమ్మ నీకు ఈ విషయం ముందే చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని డాక్టర్ ఓదార్చుతుంది. తోడికోడళ్లకు నా ముఖం ఎలా చూపించాలని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాళ్లకు అర్థమయ్యేలా చెప్తానని డాక్టర్ అంటుంది.
నేను తల్లిని కాబోతున్నాననే నన్ను అత్తారింటికి రానిచ్చారు. ఇప్పుడు నిజం తెలిస్తే కాపురం కూలిపోతుంది. మీరే నా ప్రాణాలను, కాపురాన్ని నిలబెట్టాలని డాక్టర్ కాళ్లపై వల్లి పడుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


