...
...
Next Story

Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లి కోసం న‌ర్మ‌ద స‌ర్‌ప్రైజ్ ప్లాన్‌-అంజ‌లితో చందు పండగ

Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 23 ఎపిసోడ్ లో వల్లి ప్రెగ్నెన్సీ వార్త తెలిసి నర్మద సంబరపడుతుంది. ధీరజ్ తో కలిసి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. మరోవైపు అంజలితో కలిసి చందు దీపావళి పండగ చేసుకుంటాడు. వల్లిని తీసుకొచ్చిన నర్మదను చూసి అందరూ షాక్ అవుతారు.

Published on: Nov 23, 2026, 07:43:34 IST
Advertisement

Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి కోసం భాగ్యం ఇంటికి నర్మద వస్తుంది. నర్మదను చూడగానే సంతోషంతో హగ్ చేసుకొని వల్లి ఏడ్చేస్తుంది. ఈ విషయం ఫస్ట్ నీతోనే చెప్పాలనుకున్నానని నర్మద చేతిని తన కడుపుపై పెట్టుకుంటుంది వల్లి.

నర్మద ఆనందం

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

వల్లి తల్లి అయిందని నర్మదకు తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఇంత శుభవార్త ఇంత లేటుగా చెప్తారా? ఈ విషయం ఇంటికి వచ్చి అందరికీ చెప్పాల్సింది కదా అని నర్మద ఆనందంగా చెప్తుంది. ఈ విషయం ఆ ఇంట్లో చెప్తే ఎలా రియాక్టవుతారో తెలియదు కదా అని ఆగానని వల్లి అంటుంది. ఈ రోజు దీపావళి. ఈ శుభవార్త చెప్పేందుకు వెళ్దామని నర్మద అంటుంది.

వల్లి సంబరం

కానీ వల్లి మాత్రం కదలదు. బిడ్డను అడ్డం పెట్టుకొని ఆ ఇంటికి వస్తున్నానని అంటారు. అందరూ క్షమించాకే ఆ ఇంట్లోకి వస్తానని వల్లి అంటుంది. నువ్వు మారావనే నమ్మకం నాకుంది. నేను నమ్మానంటే అందరినీ నమ్మించగలను. ఈ రోజే మనం ఇంటికి వెళ్తున్నాం. అక్కడే పండగ చేసుకుందామని నర్మద చెప్పగానే వల్లి సంబరపడుతుంది.

ప్రేమ హడావుడి

ఇటు ఆఫీసులో ప్రేమ అన్నీ సర్దేస్తుంటుంది. ఈ రోజు పండగ కదా. రెండు కార్లు కిరాయికి వెళ్లిపోయాయి. మన కార్లో మనం ఇంటికి వెళ్లి టపాసులు పేల్చుదామని ధీరజ్ కు ప్రేమ చెప్తుంది. పండగ రోజు బిజినెస్ ఎక్కువగా చేయాలి. మన కారు కూడా రెంట్ కు ఇద్దామని ధీరజ్ అంటాడు. మన కారు రెంట్ కు ఇస్తే ఇంటికి మనం ఎలా వెళ్దామని ప్రేమ అడుగుతుంది. ఎత్తుకొని తీసుకెళ్తానని ధీరజ్ చెప్తాడు.

సర్ ప్రైజ్ ప్లాన్

మరోవైపు ఇంటి ముందు దీపాలు పెడుతున్న అంజలి దగ్గరకు చందు వెళ్తాడు. ఎందుకు వచ్చావని చందును అంజలి అడుగుతుంది. పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి స్వీట్లు, క్రాకర్స్ తెచ్చానని చందు చెప్తాడు. నీతోని పండగ చేసుకుంటే అందరూ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుందని చందు అంటాడు. ఆ స్వీట్స్ చూసి అంజలి హ్యాపీ గా ఫీల్ అవుతుంది. తనకు ఇష్టమైన స్వీట్లు ఇంకా గుర్తున్నాయా? అని అడుగుతుంది.

నీ ఇష్టాలు ఎలా మర్చిపోగలను అని చందు చెప్తాడు. ఆ తర్వాత అంజలి, చందు కలిసి టపాసులు పేలుస్తారు. భయంతో చందు వెనుకా అంజలి దాక్కుంటుంది. అప్పుడు చందుకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. దీంతో అంజలికి చందు దగ్గరవుతున్నాడని అనిపిస్తుంది.

ప్రేమ అందం

ఇటు దీపాలు పెడుతున్న తన భార్య ప్రేమను అలా కన్ను ఆర్పకుండా ధీరజ్ చూస్తూనే ఉంటాడు. రోజురోజుకు నువ్వు కూడా అందంగా తయారవుతున్నావ్ ఏంటని ధీరజ్ అడుగుతాడు. నువ్వు కూడా అంటున్నావ్ ఏంటీ? నీకు నేను మాత్రమే అందంగా కనిపించాలని ప్రేమ చెప్తుంది. ఏంటే ఇంత బాగున్నావ్? వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి కళ్లు చూపించుకోవాలని ధీరజ్ సెటైర్ వేస్తాడు.

వల్లి ఎంట్రీతో

తిరుపతి తీసుకొచ్చిన టపాకాయలు చూసి సుక్కు సంబరపడుతుంది. నీకు భయమే సుక్కూ అని తిరుపతి చెప్తాడు. తాను నోటితో టపాకాయలు కాల్చేస్తానని తిరు తెగ బిల్డప్ ఇస్తాడు. మరోవైపు అమూల్యకు విశ్వ వీడియో కాల్ చేస్తాడు. అమూల్య అందాన్ని తెగ పొగిడేస్తాడు. అమూల్య నువ్వు పదే పదే గుర్తుకొస్తున్నావ్. నీతో గొడవ పడాలని ఉందని విశ్వ చెప్తాడు. మా నాన్నను అడిగి చెప్తానని అమూల్య అనగానే విశ్వ భయపడతాడు. కాల్ కట్ చేసి అమూల్య సిగ్గు పడుతుంది.

రామరాజు ఫ్యామిలీ కలిసి క్రాకర్స్ వెలిగిస్తారు. ఆ క్రాకర్ వెలుగుల్లో వల్లిని, తీసుకొచ్చిన నర్మదను చూసి ధీరజ్ మినహా అందరూ షాక్ అవుతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks