Illu Illalu Pillalu November 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అంజ‌లి భ‌ర్త‌గా చందు- సీక్రెట్‌గా గుడికి-చూసి ధీరజ్ షాక్

Illu Illalu Pillalu November 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో నర్మద తనకు చెప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్లిందని వేదవతి కోప్పడుతుంది. అంజలి, చందు కలిసి సీక్రెట్ గా గుడికి వెళ్తారు. అదే గుడికి ధీరజ్, ప్రేమ కూడా వెళ్తారు. అక్కడ చందును చూసి ధీరజ్ షాక్ అవుతాడు. 

Published on: Nov 25, 2026, 07:59:27 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Illu Illalu Pillalu November 25 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నర్మదను టిఫిన్ కు పిలవమని సుక్కుకు వేదవతి చెప్తుంది. నర్మద లేదక్కా ఎప్పుడో వెళ్లిపోయింది కదా అని తిరుపతి చెప్తాడు. నేను కొట్టడానికి కారణం ఉందని అందరికీ తెలుసు కదా. మరి అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందా అని వేదవతి అంటుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

పంచాయతీ పెడతానన్న వేదవతి

కోడలు వెళ్లిపోతుందనే భయం ఉన్నదానివి చేయి చేసుకోవడం ఎందుకో? కోపంలో అలా జరిగిపోయిందని సారీ చెప్తే సరిపోయేది కదా అని రామరాజు చెప్తాడు. అవసరమైతే పంచాయతీ పెడతానని వేదవతి అంటుంది. ఎందుకు.. గొడవ ఇంకా పెద్దది చేస్తావా అని రామరాజు అడుగుతాడు.

నర్మద కు ఎగ్జామ్

ఇదంతా ఎందుకు బావ? నర్మద ఎగ్జామ్ రాయడానికి వెళ్లిందని అక్కకు అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది కదా అని తిరుపతి అంటాడు. నాకు చెప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్లిందా అని వేదవతి షాక్ అవుతుంది. సాంబార్ లో నుంచి కరివేపాకు తీసేసినట్లు మొగుణ్ని ఉద్యోగంలో నుంచి తీసేయించింది కదా. ఇప్పుడు ఆవిడ పరీక్షలో పాసై పెద్ద ఉద్యోగం సాధించాలనుకుంటుందని సాగర్ మండిపడతాడు.

వల్లి దగ్గరకు వెళ్దామని

ఆవిడ ఉద్యోగం వచ్చిందని ఇంటికి రాకముందే అంతకంటే పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటానని సాగర్ సవాలు విసురుతాడు. ఆ నర్మదకు ఎంత పొగరుంటే నాకు చెప్పకుండా వెళ్తుందని వేదవతి కోప్పడుతుంది. నువ్వు బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే ఎలా చెప్తుంది? నీకు చెప్పమని నాకు చెప్పిందని రామరాజు అంటాడు. వల్లి దగ్గరకు వెళ్దామని చెప్తాడు.

అంజలితో గుడికి చందు

ఇటు గుడికి అంజలితో కలిసి వస్తాడు చందు. నా మనసేం బాలేక గుడికి తీసుకెళ్లమంటే పక్క ఊరి గుడికి తీసుకొచ్చావేంటని అంజలి అడుగుతుంది. మన ఊరి గుడి అయితే జనాలు మనల్ని గుర్తుపడతారు. అనవసరంగా నీ గురించి, నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. నిన్ను మాట అంటే తట్టుకోలేనని చందు చెప్తాడు.

చందుకు కోపం

ఎవరైనా ఈ గుడిలో తెలిసినవాళ్లు అడిగితే ఏం చెప్తావ్? ఫ్రెండ్ అని చెప్తావా? మాజీ ప్రియురాలు అంటావా? లేకపోతే తెలియదంటావా అని చందును అంజలి అడుగుతుంది. మర్చిపోవడం ఓ వరమంటారు కదా అంజలి. కానీ నీ విషయంలో ఆ దేవుడు నాకు ఆ వరం ఇవ్వలేదు. నిన్ను ఎప్పుడు చూసినా జ్ణాపకాలే గుర్తుకొస్తాయని చందు చెప్తాడు.

గుడిలో అర్చన చేయిస్తారు. తాము భార్యాభర్తలం కాదు. అతని భార్య వల్లి అని అంజలి చెప్పబోతుంటే చందు సీరియస్ అవుతాడు. తన పేరును గుర్తు చేయొద్దంటాడు. అప్పుడే అదే గుడికి ధీరజ్, ప్రేమ వస్తారు. ఇది చాలా పవర్ ఫుల్. ఇక్కడ కోరుకుంటే అన్ని కోరికలు తీరుతాయని ధీరజ్ అంటాడు. ప్రేమ, ధీరజ్ కాసేపు పోట్లాడుకుంటారు.

ప్రేమ నాటకం

ప్రేమ కాలు బెణికినట్లు నాటకమాడుతుంది. తనపై ధీరజ్ కు ప్రేమ లేనట్లు ప్రేమ మాట్లాడుతుంది. తనను ఎత్తుకొని దేవుడి దగ్గరకు తీసుకెళ్లమంటుంది. నువ్వేమన్నా చంటి పిల్లవి అనుకుంటున్నావా చంకలో ఎత్తుకొని తీసుకెళ్లడానికి. అది కూడా గుడిలోనా? ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుందని ధీరజ్ అంటాడు. నువ్వు నా మొగుడివి. ఎవరేం అనుకోరు. ఎత్తుకోమని ప్రేమ పట్టుబడుతుంది. దీంతో ధీరజ్ ప్రేమను ఎత్తుకొని మెట్లు ఎక్కుతాడు.

మీరు భార్యాభర్తలేనా?

ధీరజ్, ప్రేమను చూసి మీరు భార్యాభర్తలేనా అని పూజారి అడుగుతాడు. వీడు నాకు తాళి కట్టిన మొగుడేనని ప్రేమ తాళి చూపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు. ఇంతకుముందే ఓ జంట అన్యోన్యంగా ఉండటం చూసి భార్యాభర్తలని అనుకున్నా. కానీ వాళ్లు కాదంటా అని చందు, అంజలి గురించి పంతులు చెప్తాడు. ఇంతకీ ఆ జంట ఎక్కడుందో అని ప్రేమ దిక్కులు చూస్తుంది.

అంజలి రిక్వెస్ట్

ఇక గుడిలో ఓ వైపు చందు, అంజలి కూర్చుంటారు. ఎందుకు కోపంగా ఉన్నావని చందును అంజలి అడుగుతుంది. వల్లి గురించి మాట్లాడితే కోపమొస్తుంది. అది నన్ను, నా ఫ్యామిలీని మోసం చేసింది. నా భార్య అంటే కోపమొస్తుందని చందు అంటాడు. ఇంకోసారి వల్లి నీ భార్య అని అనను. ప్లీజ్ నా కోసం ప్రసాదం తిను అని అంజలి రిక్వెస్ట్ చేస్తుంది.

చందు ప్రసాదం తింటుంటాడు. నీ నవ్వంటే నాకు ఇష్టం చందు అని అంజలి అనగానే చందు నవ్వేస్తాడు. చందు, అంజలి క్లోజ్ గా ఉండటం చూస్తుంటే ఏదో ట్విస్ట్ ఇచ్చేలాగే కనిపిస్తారు. అప్పుడే ప్రేమ, ధీరజ్ కూడా వచ్చి కాస్త దూరంగా వచ్చి కూర్చొని ప్రసాదం తింటుంటారు.

అంజలి హస్బెండ్ గా

ధీరజ్ కు ప్రేమగా ప్రేమ ప్రసాదం తినిపిస్తుంది. పెద్ద ముద్దలు పెట్టమని ధీరజ్ అడుగుతాడు. ఇటు ఇద్దరు ఆడవాళ్లు వచ్చి చందును ఫోన్లో ఫొటో తీయమంటారు. సరేనని చందు తీస్తాడు. అప్పుడు అంజలి కూడా చందుతో ఓ ఫొటో తీయమని వాళ్లను అడుగుతుంది. హస్బెండ్ వే కదా అమ్మాయిని దగ్గరకు తీసుకో అని ఆ ఆడవాళ్లు చెప్తారు.

అంజలి భుజంపై చేయి వేసి చందు ఫొటో దిగుతాడు. మీ జంట చూడముచ్చటగా ఉందని వాళ్లు పొగుడుతారు. అప్పుడే చందు, ధీరజ్ ఒకరికొకరు చూసుకుని షాక్ అవుతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.