Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తిరుపతి, సుకన్యల పెళ్లి చేసిన ధీరజ్ పై రామరాజు ఫైర్ అవుతాడు. ముందు ధీరజ్ ను సంసారం చక్కదిద్దుకోమని చెప్తాడు. వేదవతి కూడా అదే విషయం చెప్తుంది. ప్రేమను ఇరికించావని అంటుంది.
ప్రేమకు చెంపదెబ్బ

మరోవైపు భద్రావతి ఇంట్లో ప్రేమను దోషిలా నిలబెడతారు. ప్రేమను భద్రావతి చెంపపై కొడుతుంది. ఈ లోకంలో ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాదేమో. చిన్న కూతురు కళ్ల ముందే ఉన్నా పుట్టింటికి వచ్చి పోయే అవకాశం లేదని బాధపడ్డా. ఇప్పుడు చిన్న కొడుకును గెంటేశారని శారదాంబ ఫీల్ అవుతుంది.
నిజం ఒప్పుకొన్న ప్రేమ
అప్పుడే భద్రావతి కోపంతో ఊగిపోతుంది. ప్రేమ మా నాశనాన్ని కోరుకుంటున్నావా? నీ తీరు అలాగే ఉందని భద్రావతి అంటుంది. ధీరజ్ అంతు చూసేవాడిని కానీ నీ కూతురే దగ్గరుండి పెళ్లి చేసిందనేసరికి తల దించుకోవాల్సి వచ్చిందని సేనాపతి అగ్నికి ఆజ్యం పోస్తాడు. ఆ రోజు ధీరజ్ తో కలిసి వెళ్లి సంబంధం చెడగొట్టింది నువ్వేనా అని భద్రావతి అడిగేసరికి ప్రేమ నిజం ఒప్పుకుంటుంది.
రెచ్చగొట్టిన భద్రావతి
మేమంటే ఎందుకు అంత కోపం? మేం ఏ పాపం చేశామని అని భద్రావతి సీరియస్ అవుతుంది. మాతో చెప్పలేదు కానీ వాడితో వెళ్లి పెళ్లి చేశావ్. వాడి దగ్గరికే వెళ్లిపో అని భద్రావతి చెప్తుంది. కళ్యాణ్ తో లేచిపోయావని నవ్వుల పాలు చేయలేదా అని మరోసారి గతాన్ని గుర్తు చేసి ప్రేమను భద్రావతి రెచ్చగొడుతుంది.
ప్రేమ సంచలన నిర్ణయం
ధీరజ్ మా పరువు తీస్తూనే ఉంటాడు. ఆ రోజు వాడు ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తే మేం గుండెల్లో పెట్టుకున్నాం. మరోసారి వాడు పరువు తీస్తే మేం బతకలేం. పదరా సేనా చచ్చిపోదామని భద్రావతి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ధీరజ్ మరోసారి మన కుటుంబం పరువు తీసేలా ప్రవర్తిస్తే నేను ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లనని ప్రేమ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. అత్తకు మాటిస్తుంది.
చితక్కొట్టిన చింతామణి
{{/usCountry}}ధీరజ్ మా పరువు తీస్తూనే ఉంటాడు. ఆ రోజు వాడు ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తే మేం గుండెల్లో పెట్టుకున్నాం. మరోసారి వాడు పరువు తీస్తే మేం బతకలేం. పదరా సేనా చచ్చిపోదామని భద్రావతి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ధీరజ్ మరోసారి మన కుటుంబం పరువు తీసేలా ప్రవర్తిస్తే నేను ఈ జన్మలో వాడి జీవితంలోకి వెళ్లనని ప్రేమ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. అత్తకు మాటిస్తుంది.
చితక్కొట్టిన చింతామణి
{{/usCountry}}సీన్ భాగ్యం ఇంటికి మారుతుంది. అప్పటికే భాగ్యం, ఇడ్లీ బాబాయిని చింతామణి చెడుగుడు ఆడేస్తుంది. నా కూతురి ఎంగేజ్మెంట్ ను ఆపుతారా? పెళ్లి కొడుకును తీసుకెళ్లి మీ మేనకోడలితో పెళ్లి చేస్తారా? అని చింతామణి ఫైర్ అవుతుంది. భార్య వెనుకాలకు వెళ్లి ఇడ్లీ బాబాయి దాక్కుంటాడు. ఇడ్లీ బాబాయిని బెల్ట్ తో చింతామణి కొడుతుంది.
షాకింగ్ ఎంట్రీ
పెళ్లి కూతురు మీ అమ్మాయి అనే విషయం మాకు తెలీదు. తిరుపతి, సుకన్య ప్రేమించుకున్న విషయం కూడా మాకు తెలియదు అని భాగ్యం అబద్ధాలు చెప్తుంది. పెళ్లి విషయంలో మాకు సంబంధం ఉంటే వాళ్లు మా పక్కనే ఉండేవాళ్లు కదా అని ఇడ్లీ బాబాయి, భాగ్యం చెప్తుండగానే.. వచ్చేశామంటూ తిరుపతి, సుక్కు షాకింగ్ ఎంట్రీ ఇస్తారు.
యవ్వారం తేడా కొట్టేసిందని భాగ్యం, ఇడ్లీ బాబాయి అనుకుంటారు. ఇద్దరి చెంపలను చింతామణి పగలగొట్టి వెళ్లిపోతుంది. సుక్కు, తిరుపతికి హారతినిచ్చి భాగ్యం లోపలికి రమ్మంటుంది. భాగ్యాన్ని చింతామణి కొట్టినందుకు ఇడ్లీ బాబాయి తెగ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ధీరజ్, ప్రేమ మీటింగ్
మరోవైపు ధీరజ్, ప్రేమ, నర్మద, సాగర్, అమూల్య, విశ్వ కలిసి మీటింగ్ పెడతారు. ఇంకెంత సేపు సైలెంట్ గా ఉండాలని సాగర్ కోప్పడతాడు. అబ్బా అని ప్రేమ అనగానే.. అబ్బనీ తియ్యని దెబ్బ అని నర్మద, సాగర్ డ్యాన్స్ చేస్తారు. వాళ్లను ఆపిన విశ్వ ఐడియా ఇస్తానంటే వద్దంటారు.
ప్రేమ వార్నింగ్
వీడితో వెళ్తే నా చెంప పగిలింది. వీడికి మనుషులంటే లెక్కలేదని ప్రేమ అంటుంది. ధీరజ్ పంచ్ లు వేస్తుంటే నర్మద నవ్వుతుంది. మధ్యలో నర్మదను ఇరికిస్తాడు ధీరజ్. నా పరువును బజారున పెట్టడం తప్పు కాదా? ఇంకోసారి నా గురించి కానీ, నా వాళ్ల గురించి కానీ ఇంకో మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకు తెలియదని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ హ్యాండ్ వాష్
ప్రేమ, సంబంధం గురించి నర్మద గొప్పగా చెప్తుంది. మామయ్య ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్ను ఇంటికి రమ్మన్నారు. మీ కోపాన్ని పక్కనపెట్టి కలిసిపోండి. ఓ సారి చేయి కలపండని ప్రేమకు నర్మదతో పాటు అందరూ చెప్తారు. ధీరజ్ చేయి అందిస్తే ప్రేమ షేక్ హ్యాండ్ ఇస్తుంది. వెంటనే శానిటైజర్ తో ధీరజ్ ఆ హ్యాండ్ ను వాష్ చేసుకుంటాడు.
వీడికి ఎంత పొగరో చూశావా అక్క? శానిటైజర్ తో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడని ప్రేమ అంటుంది. ధీరజ్, ప్రేమ ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.