...
...
Next Story

Illu Illalu Pillalu September 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్ల‌క్కాయ్‌ను కాపాడిన అద్దం- పెళ్లికి సుక్కు ఉరి ప్లాన్‌

Illu Illalu Pillalu September 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 8 ఎపిసోడ్ ట్విస్ట్ లతో సాగుతుంది. తిరు, సుక్కు లవ్ గురించి తెలియదని వల్లి అబద్ధం చెప్తుంది. సుక్కు ఉరి డ్రామా ఆడి తిరును పెళ్లికి ఒప్పిస్తుంది. బల్లక్కాయ్ బండారం బయటపడే సమయానికి అద్దం కాపాడుతుంది.

Published on: Sep 8, 2026, 08:01:29 IST
Advertisement

Illu Illalu Pillalu September 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుకన్యను తిరుపతి ప్రేమించడం వెనుకాల శ్రీవల్లి ఉందని భద్రావతి డౌట్ పడుతుంది. అందుకే పిలిపించి మరీ చెంప పగలగొడుతుంది. సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.

మంట పెట్టిన బల్లక్కాయ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నేను మీ వెనుకాల గోతులు తవ్వుతానా? తిరుపతి బాబాయి సుకన్య వెనుకాల పడటానికి కారణం నేను కాదు. అది మీ బ్లడ్ లోనే ఉంది. మీ చెల్లి ఏమో తిండికి తికానా లేని రామరాజును పెళ్లి చేసుకుంది. మీ ప్రేమ ఏమో ఏమి లేని ధీరజ్ తో ఉండాలనుకుంటోంది. మీ తమ్ముడు కూడా అదే చేస్తున్నాడని మంట పెడుతుంది బల్లక్కాయ్.

మీరు చెప్పే దాకా సుకన్య, తిరుపతిల ప్రేమ విషయం తనకు తెలియదని భద్రావతికి పచ్చి అబద్ధం చెప్తుంది శ్రీవల్లి. తిరుపతి బాబాయికి మీకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేయండని వల్లి చెప్తుంది. నీ జోక్యం లేదంటే సరే, ఒకవేళ ఉందని తెలిస్తే అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది భద్రావతి.

తిరుపతి పిచ్చోడు

మరోవైపు సుకన్య, భాగ్యం మాట్లాడుకుంటారు. తిరుపతి పిచ్చోడు. నువ్వు హీరోయిన్ అంటే ఎలా నమ్మాడని భాగ్యం అంటుంది. పెళ్లి అయిన తర్వాత మా వాటా తీసుకొని సింగపూర్ లేదా మలేషియా వెళ్లి సెటిలైపోతామని సుక్కు చెప్తుంది. మరి మా పరిస్థితి ఏంటీ? అని భాగ్యం అడుగుతుంది. నాతో పాటే మిమ్మల్ని తీసుకెళ్తానని సుక్కు చెప్తుంది.

వల్లి ఆవేశం

వీళ్ల పెళ్లి ప్రయత్నాలు ఆపేయాల్సిందేనని వల్లి అంటుంది. ప్రేమను ఎందుకు వదులుకుంటా. ఆ భద్రావతి మనకు అడ్డురాకుండా చేయాలి అంతే కదా అని ఏడ్చినట్లు యాక్ట్ చేస్తూ ‘తిరు నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు’ అని తిరుపతికి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. తన ప్లాన్ ను చెప్తుంది. అది విని అందరూ చప్పట్లు కొడతారు.

ఫ్యామిలీ డ్రామా

తిరుపతి స్పీడ్ గా వచ్చేస్తాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్, వల్లి బయట తెగ యాక్టింగ్ చేసేస్తారు. సుక్కు ఏమో ఉరితాడు పక్కన లోపల పల్లీలు తింటూ నటించేస్తుంది. నా తిరుపతి లేని జీవితం ఇంగువ లేని పులిహోర లాంటిది. తిరుపతి లేని జీవితం ఊహించుకునేదానికంటే ఒక్కసారి ప్రాణాలు తీసుకోవడం బెటర్ అని సుక్కు అంటుంది. అసలు ఏమైంది సుక్కు అని తిరుపతి టెన్షన్ పడతాడు.

సుక్కునే చేసుకుంటా

మీ భద్రావతి అక్క మాకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకెప్పుడూ సుక్కు నిన్ను కలవకూడదని కండీషన్ పెట్టింది. నిన్ను దూరం చేస్తారని సుక్కు భయపడుతుందని తిరుపతికి బల్లక్కాయ్ చెప్తుంది. ఎలా చెప్తే మా వాళ్లు మన పెళ్లికి ఒప్పుకుంటారో నాకు తెలుసని తిరుపతి అంటాడు. వాళ్లు ఒప్పుకోకపోతే తిరుపతి పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్తాడని ఇడ్లీ బాబాయ్, భాగ్యం, వల్లి కలిసి ఒప్పిస్తారు. సుక్కు బయటకు వచ్చి తిరును హగ్ చేసుకుంటుంది.

వేదవతి రివర్స్ డ్రామా

సీన్ కట్ చేస్తే అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ వల్లి తెగ మురిసిపోతుంది. అప్పుడే వేదవతి వచ్చి బల్లక్కాయ్ చెంపలు పగలగొడుతుంది. నువ్వు తప్పు చేసి ఉంటే నాకు చెప్పాల్సింది కదా. నేను కాపాడేదాన్ని కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఆ నర్మద నిన్ను ఇంట్లో నుంచి గెంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందని వేదవతి రివర్స్ డ్రామా ఆడుతుంది.

అద్దంలో చూసి

ఈ ఇంట్లో నీకు అండగా ఉండేదాన్ని నేను ఒక్కదాన్నే. నువ్వు తెలిసో తెలియక ఏదో తప్పు చేసి ఉంటే చెప్పమని వల్లిని వేదవతి అడుగుతుంది. దీంతో మీకు తెలియకుండా నేనో తప్పు చేశానని అత్త కాళ్ల మీద పడుతుంది బల్లక్కాయ్. అప్పుడే అద్దంలో నర్మదను చూసి వల్లి జస్ట్ మిస్ అనుకొని మాట మారుస్తుంది. రైస్ మిల్ లో పోయిన డబ్బుల గురించి చందు బావ ముందే చెప్పాడు కానీ మీ దగ్గర నిజం దాచానని వల్లి చెప్తుంది.

వల్లి తన డ్రామాతో అత్తను నమ్మించేస్తుంది. నర్మదను పిలిచి ఇదేం తప్పు చేయలేదని వేదవతి చెప్తుంది. వేదవతి లోపలికి వెళ్లగానే బల్లక్కాయ్ తన టోన్ మారుస్తుంది. ఏదో పొడిచేస్తానన్నావ్ సెల్లాయ్, నీ ప్లాన్ ఇదా? అని నర్మదను అడుగుతుంది. ఈ సారి నిన్ను అద్దం కాపాడిందన్నమాట. నువ్వు ఏంటో అందరికి తెలిసేలా చేస్తానని నర్మద ఛాలెంజ్ చేస్తుంది.

అలాగే ట్రై చేసుకో అని వల్లి లోపలికి వెళ్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe