...
...
Next Story

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు- బల్ల‌క్కాయ్‌ను భ‌లే వాడుకుంటున్న న‌ర్మ‌ద‌- ధీర‌జ్, ప్రేమ పెళ్లి జ‌రుగుతుందా?

Illu Illalu Pillalu: బుల్లితెరపై రేటింగ్ లో దూసుకెళ్తున్న టాప్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ ప్రైమ్ టైమ్ సీరియల్ లో ప్రస్తుతం సస్పెన్స్ ఊపేస్తోంది. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ధీరజ్, ప్రేమ జరుగుతుందో లేదో అనేది క్యూరియాసిటీ పెంచుతోంది.

Published on: Sep 26, 2026, 18:12:37 IST
Advertisement

Illu Illalu Pillalu: సీరియల్ అంటే కేవలం ఏడుపులు, కన్నీళ్లే కాదు ట్విస్ట్ లు, సస్పెన్స్, థ్రిల్ కూడా అని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చాటుతోంది. ప్రస్తుతం ఈ టాప్ సీరియల్ లో కథ థ్రిల్లర్ సినిమాలా సాగుతోంది. ధీరజ్, ప్రేమ పెళ్లి అవుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఆడియన్స్ ను ఊపేస్తోంది.

నర్మద ప్లాన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు- బల్ల‌క్కాయ్‌ను భ‌లే వాడుకుంటున్న న‌ర్మ‌ద‌- ధీర‌జ్, ప్రేమ పెళ్లి జ‌రుగుతుందా? (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు- బల్ల‌క్కాయ్‌ను భ‌లే వాడుకుంటున్న న‌ర్మ‌ద‌- ధీర‌జ్, ప్రేమ పెళ్లి జ‌రుగుతుందా? (jiohotstar)

పెళ్లి చేసుకుందాం రమ్మని ధీరజ్ ప్రేమగా అడిగితే ప్రేమ ఒప్పుకోలేదు. భద్రావతి మాయలో పడ్డ ప్రేమ.. అత్తకు మాట ఇచ్చానని సెంటిమెంట్ డైలాగ్ లు కొడుతుంది. ఎవరేం చెప్పినా ప్రేమ కన్విన్స్ కావడం లేదు. ఇక భద్రావతి ఏమో ఆ చింతామణి ఇంట్లో ప్రేమను దాచింది. దీంతో ప్రేమను తీసుకొచ్చేందుకు నర్మద ప్లాన్ వేసింది.

బల్లక్కాయ్ తో కిడ్నాప్

మంచిగా చెప్తే ప్రేమ వినడం లేదు. అందుకే ప్రేమను కిడ్నాప్ చేయాలని నర్మద ఫిక్స్ అయింది. ఆ పని కోసం బల్లక్కాయ్ అండ్ బ్యాచ్ ను రంగంలోకి దించింది. మోపిదేవికి వెళ్లిన విషయం అందరికీ చెప్పేస్తానని శ్రీవల్లి, ఆమె తల్లిదండ్రులు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ను నర్మద బ్లాక్ మెయిల్ చేస్తోంది. వాళ్లతోనే ప్రేమ కిడ్నాప్ కు ప్లాన్ వేసింది.

రంగంలోకి శ్రీవల్లి

నర్మద చేతిలో తమ పిలక ఉండటంతో శ్రీవల్లి అండ్ కో రంగంలోకి దిగారు. చింతామణి ఇంటి నుంచి ప్రేమను కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ టైట్ సెక్యూరిటీ ఉన్న చింతామణి ఇంట్లోకి వాళ్లు వెళ్లగలరా? ప్రేమను కిడ్నాప్ చేయగలరా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

పెళ్లి జరుగుతుందా?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాలంటే ప్రేమ, ధీరజ్ కు పెళ్లి జరగాల్సిందే. అలా అయితేనే బల్లక్కాయ్, భద్రావతి కుట్రలకు రామరాజు కుటుంబం సరైన సమాధానం చెప్పిందని ఆడియన్స్ లో ఓ సాటిశ్ఫాక్షన్ వస్తుందని చెప్పొచ్చు.

ఒకవేళ ధీరజ్, ప్రేమ పెళ్లి ఇప్పుడు జరగకపోతే మాత్రం ఇంకా ఎంత కాలం సాగదీస్తారనే చిరాకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ, ధీరజ్ పెళ్లి జరిగేందుకే ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks