...
...
Next Story

Illu Illalu Pillalu October 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ పాపం పండింది-ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న రామరాజు

Illu Illalu Pillalu October 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 9 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. బల్లక్కాయ్ పాపం పండింది. ఆమె తల్లిదండ్రులను రామరాజు పిలిపిస్తాడు. వల్లిని ఇంటికి తీసుకెళ్లమంటాడు. ఇక బల్లక్కాయ్ ఏమో తెగ ఎమోషనల్ అవుతూ రామరాజు కాళ్లపై పడుతుంది.

Published on: Oct 9, 2026, 07:48:18 IST
Advertisement

Illu Illalu Pillalu October 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శ్రీవల్లి పన్నిన కుట్రలు, చేసిన దారుణాలు తెలిసే సరికి రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వల్లి దగ్గరకు వస్తుంటే రామరాజు వద్దంటాడు. ఆ రోజు అమూల్య విషయలో ఈయనకు గుండెపోటు రావడానికి కారణం నువ్వే, ఇప్పుడు ఏమైనా అయితే బతకనివ్వను అని వేదవతి ఫైర్ అవుతుంది.

రామరాజు కోపం

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వల్లి అమ్మానాన్నను పిలిపించండని రామరాజు చెప్తాడు. వల్లి చెప్పే మాటలను రామరాజు అసలు వినడు. నమ్మి ఎంతో మోసపోయానని రామరాజు కోప్పడతాడు. వల్లి అమ్మానాన్నకు సుక్కును ఫోన్ చేయమని ప్రేమ చెప్తుంది. ఇక్కడ జరిగింది ఏదీ చెప్పొద్దని అంటుంది. సుక్కు ఫోన్ చేస్తుంది.

ఫీల్ అయిన చందు

రేయ్ పెద్దోడా, ఇన్ని రోజులు మనసులో ఇంత బాధను మోశావా? నీ తమ్ముళ్లతో పంచుకోవాలని అనిపించలేదా? అని చందును సాగర్ అడుగుతాడు. నా జీవితం చాలా బాగుందని మీరు హ్యాపీగా ఉన్నారు. నా బాధను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలనిపించలేదు. అందుకే ఆ బాధను నేనే మోశానని చందు ఫీల్ అవుతాడు.

భాగ్యం, ఇడ్లీ బాబాయి ఎంట్రీ

ఇంత దారుణంగా మోసం చేస్తారా? ఆడపడుచు కట్నం కింద రోల్డ్ గోల్డ్ ఇస్తారా? అని అప్పుడే వచ్చిన కామాక్షి.. బల్లక్కాయ్ ను అంటుంది. ఇక భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పరుగెత్తుకుంటూ వస్తారు. ఏదైనా విశేషమా? నెల తప్పావా అని వల్లిని భాగ్యం అడుగుతుంది. మీ అమ్మాయి వల్లి ఏం చదువుకుందని భాగ్యం, ఇడ్లీ బాబాయిని రామరాజు అడుగుతాడు.

చెంప చెళ్లుమనిపించిన రామరాజు

మీ బండారం మొత్తం తెలిసిపోయింది. గోల్డ్ రోల్డ్ నగల నుంచి మోపిదేవి వెళ్లిన వరకు మీరు చేసిన మోసాలు, కుట్రలు అన్నీ తెలిసిపోయాయని వేదవతి అనేసరికి భాగ్యం, ఇడ్లీ బాబాయి ఫ్యూజులు ఔట్ అవుతాయి. వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు కదా. అందుకే మా అమ్మాయి పెళ్లి కోసం ఓ నాలుగు చిన్న అబద్ధాలు ఆడామని భాగ్యం తెగ డ్రామా ప్లే చేస్తుంది.

ఎవరూ తప్పు చేయలేదా?

వెంటనే ఇడ్లీ బాబాయిని రామరాజు ఇంకోటి పీకుతాడు. ఇద్దరు మంచివాళ్లకు పెళ్లి చేయడం కోసం ఒకట్రెండు అబద్ధాలు చెప్పినా తప్పు లేదన్నారు. అంతే కానీ మోసం చేయమన్లేదని రామరాజు సీరియస్ అవుతాడు. ఇంకా వాళ్లతో మాటలేంటి నాన్న, మెడపట్టి బయటకు గెంటేయమని కామాక్షి చెప్తుంది. ఏంటమ్మా మెడ పట్టి బయటకు గెంటేది? తప్పులేవో మా అమ్మాయే చేసినట్లు, ఈ ఇంట్లో ఇంకెవరూ తప్పులు చేయనట్లు మాట్లాడుతున్నారని భాగ్యం అంటుంది.

భాగ్యం రివర్స్ ఎటాక్

తప్పు చేసిన వాళ్లు బయటకు వెళ్లడమనేది రూల్ అయితే మీ రెండో కొడుకు, చిన్న కొడుకు, చిన్నమ్మాయి ఎవరూ ఇంట్లో ఉండకూడదు. అందరినీ గెంటేయాలి. నీ రెండో కొడుకు ఈవిడ (నర్మద) గారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మీ చిన్న తమ్ముడు దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు. అమూల్య కూడా విశ్వక్ తో లేచిపోయింది. మా అమ్మాయి కాపురం కోసం అబద్ధాలు చెప్పామని భాగ్యం రివర్స్ ఎటాక్ చేస్తుంది.

రామరాజు వార్నింగ్

మీరు కొంపలు కూల్చే కుట్రలు చేశారని భాగ్యం చెంపలను వాయిస్తుంది వేదవతి. మీరు ఇంకొక్క క్షణం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. బయటకు నడవండని వేదవతి సీరియస్ గా చెప్తుంది. ఏం జరిగిందో మాట్లాడదామని పిలిపించా. కానీ మీ అహంకారం చూసిన తర్వాత మీరు ప్లాన్ ప్రకారమే మీ కూతురిని ఇంట్లోకి పంపించారని అర్థమవుతోంది. మీ కూతురు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లండని రామరాజు అల్టిమేట్ వార్నింగ్ ఇస్తాడు.

మామయ్య నేను మోసం చేయలేదు. నా కాపురం బాగుంటుందని మా అమ్మానాన్న మాటలు విన్నానని వల్లి ఏడుస్తుంది. నువ్వు కావాలని చేయలేదా? అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటావ్? భద్రావతితో ఎందుకు చేతులు కలుపుతావ్? ధీరజ్, ప్రేమను ఎందుకు విడగొడతావని రామరాజు సూటిగా అడుగుతాడు.

వల్లి కన్నీళ్లు

మా వాళ్ల మాటలను గుడ్డిగా నమ్మానని వల్లి అంటుంది. చచ్చిపో అంటే చచ్చిపోవు కదా మరి ఈ విషయంలో ఏమైంది? ఎంత నమ్మాను నిన్ను. దారుణంగా మోసం చేశావ్. నీ కోసం నర్మద, ప్రేమలను బాధపెట్టా. నీకే ఎక్కువ విలువిచ్చానని రామరాజు కోప్పడతాడు. దయచేసి ఓ తండ్రిలా ఈ బిడ్డ బాధను అర్థం చేసుకోండని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మామయ్య కాళ్లపై

నీ దొంగ కన్నీళ్లు చూసి మా నాన్న కరిగిపోయినా నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఇంట్లో ఉంటే నేను వెళ్లిపోతా. నీ దొంగ ఏడుపులు ఆపి మర్యాదగా బయటకు నడవమని చందు నెట్టేస్తాడు. నాకు బుద్ధి వచ్చింది మామయ్య, ఒక్కసారికి క్షమించమని వల్లి ప్రాధేయపడుతుంది. నమ్మకద్రోహాన్ని క్షమించలేనని రామరాజు అంటాడు.

చివరకు రామరాజు కాళ్లపై బల్లక్కాయ్ పడుతుంది. మొదటి తప్పు కింద క్షమించి, ఇంట్లో ఉండనివ్వండని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రామరాజు వినడు. దీంతో వేదవతిని రిక్వెస్ట్ చేస్తుంది వల్లి. నిన్ను ఇంకోసారి క్షమించను. నోర్మూసుకొని బయటకు నడువు అని వేదవతి గద్దిస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks