...
...
Next Story

300 కోట్ల మలయాళ బ్లాక్ బస్టర్.. ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ లోకా వచ్చేది ఈ ఓటీటీలోకే.. కన్ఫామ్ చేసిన ప్లాట్ ఫామ్

బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ‘లోకా చాప్టర్ 1-చంద్ర’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని ఆ ఓటీటీ వేదిక ప్రకటించింది.

Published on: Oct 15, 2025, 05:52:05 IST
Advertisement

మలయాళ బ్లాక్ బస్టర్ 'లోకా' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు దాటింది. ఈ సందర్భంగా ఈ చిత్ర కథానాయిక కల్యాణి ప్రియదర్శన్ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ లో మూవీ చూడాలనుకునే ఫ్యాన్స్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది.

లోకా చాప్టర్ 1 ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ (x/JioHotstarMal)
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ (x/JioHotstarMal)

కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఇండియా ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ ‘లోకా చాప్టర్ 1-చంద్ర’. ఈ మలయాళ సూపర్ హీరో థ్రిల్లర్ మూవీ కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తోంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి రాబోతుంది.లోకా చాప్టర్ 1- చంద్ర కమింగ్ సూన్ అంటూ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ పోస్టర్ పంచుకుంది.

ఓటీటీలోకి ఎప్పుడు?

లోకా చాప్టర్ 1 మూవీ జియోహాట్‌స్టార్‌లోకి వస్తుందనేది కన్ఫామైంది. కానీ డిజిటల్ ప్రీమియర్ డేట్ ను మాత్రం ఈ ఓటీటీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన లోకా దీపావళికి ముందు రోజు అంటే అక్టోబర్ 20న ఓటీటీలో విడుదల కాబోతుందని సమాచారం. ఈ సినిమాను వేఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.

జియోహాట్‌స్టార్‌ పోస్ట్

స్ట్రీమింగ్ యాప్ జియోహాట్‌స్టార్‌ సోషల్ మీడియాలో లోకా త్వరలో ప్లాట్ ఫామ్ లోకి వస్తుందని పంచుకుంది. అయితే విడుదల తేదీని వెల్లడించలేదు. "ఒక కొత్త విశ్వం ప్రారంభం. లోకా చాప్టర్ 1: చంద్ర - త్వరలో జియో హాట్ స్టార్ లో రాబోతోంది"అని ఆ ఓటీటీ పోస్టర్ పోస్టు చేసింది. ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

లోకా చాప్టర్ 1 గురించి

దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన లోకా చాప్టర్ 1- చంద్ర మూవీకి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరో పాత్రలో నటించింది. నాస్లెన్, చందు సలీంకుమార్, అరుణ్ కురియన్, శాండీ ముఖ్య పాత్రలు పోషించారు. 'లోకా చాప్టర్ 1' ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks