Kavya Maran: సన్‌రైజర్స్ టీమ్‌లో పాకిస్థానీ స్పిన్నర్- కావ్య మారన్‌పై ఇండియన్లు ఫైర్- సిగ్గులేదు, దేశద్రోహి అంటూ
Kavya Maran: సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై ఇండియన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సిగ్గు లేదు, దేశ ద్రోహి అంటూ ఫైర్ అవుతున్నారు. ది హండ్రెడ్ లీగ్ లో పోటీపడే కావ్య టీమ్ సన్‌రైజర్స్ లీడ్స్ వేలంలో పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడమే ఇందుకు కారణం.
సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై ఇండియన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దేశద్రోహి, సిగ్గు లేదు అంటూ తీవ్రమైన మాటలతో రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తామంటున్నారు. దీనంతటికి కారణం.. ది హండ్రెడ్ లీగ్ లోని కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ లీడ్స్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడమే.

అబ్రార్ అహ్మద్
ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్ లో కావ్య మారన్ కు సన్‌రైజర్స్ లీడ్స్ అనే టీమ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్య టీమ్ కొనుగోలు చేసింది. వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఓనర్ కావ్య మారన్, హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్ స్పిన్నర్ ను ఓ ఇండియన్ తన టీమ్ లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సిగ్గు లేదు
‘‘ఈ పాకిస్థానీ మన ఇండియన్ టీమ్ ను, ఇండియన్లను అవమానించాడు. కానీ సిగ్గు లేకుండా డీఎంకే కుటుంబానికి చెందిన కావ్య మారన్ అతణ్ని తీసుకుంది. ఇది సిగ్గు చేటు. మీ మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తాం’’ అని ఓ నెటిజన్ ఎక్స్ లో తన కోపాన్ని వెళ్లగక్కాడు. గతంలో ఆసియా కప్ సందర్భంగా భారత ఆర్మీని, ఆటగాళ్లను ఎగతాళి చేస్తూ అహ్మద్ ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
దేశభక్తే ముందు
‘‘డీఎంకే, సన్ గ్రూప్, కావ్య మారన్ కలిసి మన దేశ గౌరవాన్ని అమ్మేశారు. మన భారత అమర జవాన్లను అవమానించిన పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను వీళ్లు తమ టీమ్ లోకి తీసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు? అన్నిటికంటే దేశభక్తే ముందు. సన్ నెట్ వర్క్, సన్ రైజర్స్, మారన్ ను బాయ్ కాట్ చేయాలి’’ అని మరో యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
ఎక్స్ అకౌంట్ సస్పెండ్
పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకోవడంపై ఇండియన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కావడం వైరల్ గా మారింది. చాలా మంది రిపోర్ట్ కొట్టడం ఓ కారణంగా తెలుస్తోంది.
ఐపీఎల్ లో
ది హండ్రెడ్ లీగ్ లో సన్‌రైజర్స్ లీడ్స్ కోసం అబ్రార్ అహ్మద్ ను కావ్య మారన్ తీసుకోవడంతో ఐపీఎల్ 2026లో ఆమె టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ లను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.
అందుకే అబ్రార్
అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడంపై డానియల్ వెటోరీ క్లారిటీనిచ్చాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీమ్ నుంచి వెళ్లిపోవడంతో మరో స్పిన్నర్ కావాలని అబ్రార్ అహ్మద్ ను తీసుకున్నామని చెప్పాడు. పాక్ ఆటగాళ్లను టీమ్ లోకి తీసుకోవద్దనే చర్చ ఏం జరగలేదని అన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












