...
...
Next Story

ఓటీటీలో ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ షురూ.. దెయ్యాల బంగ్లాలో పోలీస్ స్టేషన్

ఇటీవలి కాలంలో మలయాళ సినిమాలు హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా వెబ్ సిరీస్ తోనూ రికార్డు నమోదు చేసేందుకు ఆ ఇండస్ట్రీ ప్రయత్నించింది. మొట్టమొదటి మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలోకి రిలీజైంది.

Published on: Nov 14, 2025, 13:50:12 IST
Advertisement

ఓటీటీలోకి ఇవాళ ఓ మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్ గా చెబుతున్న ‘ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా’ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 14)న ఈ సిరీస్ రిలీజైంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.

ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా ఓటీటీ

ఓటీటీలో హారర్ కామెడీ సిరీస్ (x)
ఓటీటీలో హారర్ కామెడీ సిరీస్ (x)

మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా లోకా మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. మలయాళం సిరీస్ లు కూడా ఓటీటీలో అదరగొడుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు హారర్ కామెడీ జోనర్లో ఫస్ట్ మలయాళం సిరీస్ ‘ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా’ అని చెబుతున్నారు. దీంతో ఈ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫస్ట్ మలయాళ సిరీస్

మలయాళం నుంచి చాలా సిరీస్ లో ఓటీటీలోకి వచ్చాయి. అయితే హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో మాత్రం ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా ఫస్ట్ సిరీస్ అని అంటున్నారు. ఈ సిరీస్ కు సైజు ఎస్ఎస్ డైరెక్టర్. ఇందులో శబరీష్ వర్మ, ఆధ్య ప్రసాద్, సెంథిల్, రాజమణి, షాజు శ్రీధర్, జయన్, వీణ నాయర్, శ్రీజిత్ రవి, బాలాజి శర్మ, మనోహరి జాయ్ తదితరులు నటించారు.

ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా కథ

వింత సంఘటనలపై రీసెర్చ్ చేసే పారానార్మల్ రీసెర్చర్ మైథిలి (ఆధ్య ప్రసాద్)తో టీమ్ ను సెట్ చేస్తాడు. తన పోలీస్ గ్యాంగ్, మైథిలితో కలిసి ఆ ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లాలోకి వెళ్తాడు శబరీస్. అక్కడ అంతా అబ్ నార్మల్ గా ఉంటుంది. ఓ వైపు భయంతో మంచి కామెడీ పండుతుంది. మరోవైపు దెయ్యం వేట కొనసాగుతుంది. అప్పుడే ఆ ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా రహస్యాలు బయటపడతాయి. మరి ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం ఎవరు? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks