Irumudi: టీ తాగారా, టిఫిన్ చేశారా? ఇరుముడి చూశారా.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. మూడో వారంలోనూ తగ్గేదేలే.. ప్రాఫిట్ ఎంతంటే?
Irumudi: ఒక సినిమాను జనాలు ఓన్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇరుముడి మూవీతో మరోసారి స్పష్టమైంది. ఆడియన్స్ ఇప్పటికీ ఇరుముడి మూవీ గురించే డిస్కస్ చేస్తున్నారు. ఓ ముగ్గురు ఒక్కచోట కలిస్తే ఈ సినిమా చూశారా? లేదా? అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇరుముడి ప్రాఫిట్స్ మామూలుగా లేవు.
Irumudi: టీ తాగారా? టిఫిన్ చేశారా? అంటూ పక్కవాళ్లను, చుట్టాలను పలకరిస్తుంటాం. ఇప్పుడు ఇందులోకి ఓ కొత్త ప్రశ్న కూడా చేరింది. అదే.. ఇరుముడి చూశారా? అవును.. ఇప్పుడు కామన్ పీపుల్ కు ఇది కామన్ ప్రశ్నగా మారింది. ఇద్దరు వ్యక్తులు కలిసినా, ఫ్యామిలీ ఒక్క చోట చేరినా ఇప్పుడు ఇరుముడి గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూశారా? లేదా? అని అడుగుతున్నారు.

ఇరుముడి ఇంపాక్ట్
తెలుగు ఆడియన్స్ మీద ఇరుముడి మూవీ చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. సినిమా అంటే కేవలం రెండున్నర గంటల ఎంటర్ టైన్మెంట్ అని, థియేటర్ బయటకు రాగానే చాలా మంది దాన్ని మర్చిపోతారు. కానీ ఇరుముడి అలాంటి మూవీ కాదు. జనాలు ఈ సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. తమ లైఫ్ లో దీన్ని భాగం చేసుకున్నారు. అందుకే రోజువారీ మాటల్లోనూ ఇరుముడి ప్రస్తావన తీసుకొస్తున్నారు.
మూవీ చర్చలు
ఫ్యామిలీ ఫంక్షన్ అయినా. ఫ్రెండ్స్ కలిసినా.. ఇరుముడి గురించి కచ్చితంగా మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. మూవీ చూశారా? అని అడుగుతున్నారు. స్టోరీ గురించి, సినిమాలో రవితేజ, బేబీ నక్షత్ర యాక్టింగ్ గురించి, సాయికుమార్ ఇచ్చే మైండ్ బ్లాక్ ట్విస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇల్లీగల్ అయినప్పటికీ కొన్ని చోట్ల అయితే పైరసీ కాపీలను స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ చూస్తున్నారు.
బలగం తర్వాత
రీసెంట్ టైమ్స్ లో తెలుగు జనాలను బాగా కదిలించిన మూవీ బలగం. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తీసిన ఈ మూవీ ఆడియన్స్ మనసులను తాకింది. ఊర్లకు ఊర్లు బిగ్ స్క్రీన్ లు సెట్ చేసుకుని ఈ సినిమాను చూశాయి. ఆ చిత్రంలోని ఎమోషన్ కు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరుముడి కూడా ఆ లెవల్ లో జనాల్లోకి వెళ్లిపోయింది.
సెలబ్రిటీలు కూడా
ఇరుముడి మూవీపై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య వరకూ అందరూ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. రీసెంట్ గా ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వైష్ణవి చైతన్య ఈ మూవీ గురించి ప్రస్తావించింది. తన అమ్మమ్మతో కలిసి సినిమా చూశానని, ఆవిడ ఏడ్చేశారని చెప్పింది.
లాభాల పంట
మరోవైపు ఇరుముడి సినిమా ప్రొడ్యూసర్లకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు రూ.250 కోట్ల కలెక్షన్లకు దగ్గర్లో ఉంది. ఆగస్టు 21న రిలీజైన ఈ మూవీ జోరు మూడో వారంలోనూ తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ కొనసాగిస్తోంది. రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక ఇంకా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


