Irumudi Box Office: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్ దగ్గర మళ్లీ తన పూనకాల రేంజ్ కలెక్షన్లతో దుమ్మురేపుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అరుదైన మైలురాయిని చేరుకుంది.
రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్.. బయ్యర్లకు ఊహించని లాభాలు

థియేటర్లలోకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిన ఈ సినిమా, ఇప్పుడు బయ్యర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఈ ఘనతతో రవితేజ కెరీర్‌లో రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన మూడో సినిమాగా 'ఇరుముడి' చరిత్ర సృష్టించింది. గతంలో ఆయన నటించిన 'ధమాకా', మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు ఈ మార్కును దాటగా, ఇప్పుడు 'ఇరుముడి'తో మాస్ మహారాజా గ్రాండ్ హ్యాట్రిక్ కొట్టారు.
అసలైన నంబర్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పక్కా ప్రమోషన్స్
ఈ సినిమా విజయంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రమోషన్స్, క్వాలిటీ మేకింగ్ ముఖ్య పాత్ర పోషించాయి. ఎలాంటి ఫేక్ నంబర్స్ లేకుండా, పక్కా ఒరిజినల్ కలెక్షన్ల లెక్కలను మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.
"అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల అపారమైన అభిమానంతో 'ఇరుముడి' 100 కోట్ల గ్రాస్ సాధించింది" అని నిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
వర్కింగ్ డేస్‌లోనూ 90 శాతం హోల్డ్.. మైండ్ బ్లోయింగ్ టాక్
{{/usCountry}}"అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల అపారమైన అభిమానంతో 'ఇరుముడి' 100 కోట్ల గ్రాస్ సాధించింది" అని నిర్మాతలు సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
వర్కింగ్ డేస్‌లోనూ 90 శాతం హోల్డ్.. మైండ్ బ్లోయింగ్ టాక్
{{/usCountry}}మొదటి రోజు వచ్చిన భారీ కలెక్షన్లతో పోలిస్తే, వర్కింగ్ డేస్‌లో కూడా 90 శాతం కలెక్షన్ల హోల్డ్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఏకగ్రీవ పాజిటివ్ టాక్ వల్ల బి, సి సెంటర్లలో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.
రవితేజ మార్క్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, గుండెలను పిండేసే సెంటిమెంట్ సీన్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి డిఫరెంట్ ఎమోషనల్ కథతో వచ్చి సెంచరీ కొట్టడం ఆయన కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన రికార్డుగా నిలిచిపోనుంది.
యశ్ 'టాక్సిక్' నుంచి కాంపిటీషన్.. లైఫ్‌టైమ్ రన్ ఎంత ఉండొచ్చు?
బుధవారం (ఆగస్ట్ 26) కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ పాన్ ఇండియా కాంపిటీషన్‌ను తట్టుకుని 'ఇరుముడి' ఫుల్ రన్‌లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
'టాక్సిక్' టాక్ ఎలా ఉంటుందనే దానిపైనే 'ఇరుముడి' లైఫ్‌టైమ్ వసూళ్లు ఆధారపడి ఉంటాయి. ఏది ఏమైనా, ప్రసుతం ఉన్న జోరు చూస్తుంటే మాస్ మహారాజా బాక్సాఫీస్ వేట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.