...
...
Next Story

Irumudi Controversy: వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం!

Irumudi Controversy: మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఈ సమయంలో ఇరుముడి సినిమా వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published on: Aug 25, 2026, 11:13:43 IST
Advertisement

Irumudi Controversy: 'ఇరుముడి' చిత్రం ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, మరోవైపు ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మేకర్స్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

ఇరుముడి చుట్టూ వివాదం

వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం! (x/MythriOfficial)
వివాదంలో బ్లాక్ బస్టర్ ఇరుముడి.. సక్సెస్ సెలబ్రేషన్స్ వేళ మూవీ టీమ్ కు షాక్.. టీచర్ల అల్టిమేటం! (x/MythriOfficial)

రవితేజ సినిమా ‘ఇరుముడి’ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. ఈ వివాదంపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (APTF) రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాలో ఒక ఉపాధ్యాయురాలి పాత్రను చిత్రీకరించిన తీరు ఉపాధ్యాయ సమాజం గౌరవాన్ని, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

నిజమైన పాఠశాల పేరు

కేవలం ఉపాధ్యాయ పాత్రనే కాకుండా, సినిమాలో అసలైన ప్రభుత్వ పాఠశాల గుర్తింపులను నేరుగా వాడటంపై ఉపాధ్యాయ సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని "సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల" నేమ్‌బోర్డును సినిమాలో స్పష్టంగా చూపించారని ఎత్తిచూపారు. అంతేకాకుండా, ఆ సన్నివేశాల్లో నటించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల అధికారిక యూనిఫామ్‌నే ధరించి ఉన్నారని తెలిపారు.

నెగెటివ్ ఇంపాక్ట్

ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ పాఠశాల పేరును, ప్రభుత్వ విద్యార్థుల దుస్తులను వాడుతూ అనైతిక అంశాలను చూపించడం వల్ల జనాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడే ప్రమాదం ఉందని ఎపిటిఎఫ్ నాయకులు మండిపడ్డారు. సినిమాలు సమాజంపై, ప్రజల ఆలోచనా విధానంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, కాబట్టి విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల అంశాలను చూపించేటప్పుడు సినీ దర్శకులు, నిర్మాతలు మరింత సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు చేరువైంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.80కి పైగా కోట్లు కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. రవితేజ కెరీర్ లో 1 మిలియన్ డాలర్ల రికార్డు ఇదే ఫస్ట్ టైమ్.

ఈ తరుణంలో ఇరుముడిపై వివాదం చెలరేగడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన ఈ తీవ్రమైన ఆరోపణలు, డిమాండ్లపై దర్శకుడు శివ నిర్వాణ లేదా నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe