Deepika Padukone: ఎక్స్‌క్లూజివ్‌.. దీపికా పదుకొణె- సందీప్ వంగా వివాదం.. స్పిరిట్ కథ కూడా చెప్పలేదు.. సంచలన నిజాలు!

Deepika Padukone: పాన్ ఇండియా సినిమా 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొణె వైదొలగడంపై వివాదం మళ్లీ మొదలైంది. సందీప్ రెడ్డి వంగా వైఖరి, కథ చెప్పకపోవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎక్స్‌క్లూజివ్‌ విషయాలు మీ కోసం. 

Published on: Aug 22, 2026, 15:08:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకోవడంపై గత ఏడాది ఆరంభమైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో దీపికాపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

ఎక్స్‌క్లూజివ్‌.. దీపికా పదుకొణే- సందీప్ వంగా వివాదం.. స్పిరిట్ కథ కూడా చెప్పలేదు.. సంచలన నిజాలు!
ఎక్స్‌క్లూజివ్‌.. దీపికా పదుకొణే- సందీప్ వంగా వివాదం.. స్పిరిట్ కథ కూడా చెప్పలేదు.. సంచలన నిజాలు!

అయితే, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు బయటకు రాని అసలు నిజాలను, దీపికా పదుకొణె సన్నిహిత వర్గాలు తాజాగా హిందూస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి. ఆ విషయాలు మీకోసం.

కథ చెప్పకపోవడం

దీపికా పదుకొణే వర్గాల సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ లో చేయాలనే ఆలోచన ఆమెకు లేదంటా. "దీపికా తన జీవితంలో సందీప్ రెడ్డి వంగాను ఒకే ఒక్కసారి కలిశారు. ఆ మీటింగ్ కు కూడా సందీప్ గంట ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ దీపికా ఎంతో ప్రొఫెషనల్‌గా మాట్లాడారు. ఆ భేటీలో దర్శకుడు కేవలం ఒకే ఒక్క లైన్ కథ మాత్రమే చెప్పారు. పూర్తి కథనం (నరేషన్) వినకుండా దీపికా ఏ సినిమాకు సంతకం చేయరు. కాబట్టి 'స్పిరిట్' ప్రాజెక్ట్‌ను ఆమె ఎప్పుడూ ఓకే చేయలేదు" అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లోనూ, బయటా చూపించే స్త్రీద్వేషపూరిత (మిసోజనిస్ట్) వైఖరి వల్ల ఆయనతో పనిచేయడానికి దీపికాకు అస్సలు ఆసక్తి లేదని ఆ వర్గాలు వెల్లడించాయి.

ప్రణయ్ వంగా ఏమన్నారంటే?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. దీపికా సినిమాలో 10 శాతం లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేర్) కోరారని, అలాగే పారితోషికం, వర్కింగ్ అవర్స్ విషయంలో పట్టుబట్టారని ఆరోపించారు. "ఆమె ఏమైనా అడగొచ్చు, కానీ నిర్మాణ బడ్జెట్ అంచనాలు కూడా మాకు కుదరాలి కదా. అందుకే వేరే ఆప్షన్స్ చూశాం" అని ప్రణయ్ పేర్కొన్నారు.

దీపికా లైక్

సందీప్ వంగా అన్న ప్రణయ్ రెడ్డి లేటెస్ట్ కామెంట్లతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. సినీ పరిశ్రమలో మగ హీరోలకు ఇచ్చే ప్రాఫిట్ షేరింగ్, డిమాండ్లను మహిళా నటులు కోరితే ఎందుకు తప్పుగా చూస్తారంటూ సందీప్, ప్రణయ్‌లను విమర్శిస్తూ వచ్చిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌ను దీపికా 'లైక్' చేయడం గమనార్హం.

పాత వివాదాలు

గతంలో తల్లి అయిన కొత్తలో రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపికా కండిషన్ పెట్టారని, అందుకే ఆమెను ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ తప్పించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అదే సమయంలో 'స్పిరిట్'లో డేరింగ్ సీన్స్ చేయడానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను తీసేశారనే ప్రచారం జరగ్గా, సందీప్ వంగా తీవ్రంగా స్పందించారు. "కథ విన్నాక ప్రతి ఒక్కరూ దాన్ని బయటపెట్టకుండా ఉండడాలి. కానీ చిన్న నటిని తక్కువ చేసి చూపుతూ నా కథను బయటపెట్టడమేనా నీ ఫెమినిజం?" అంటూ మే 2025లో సందీప్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

స్పిరిట్ ఇలా

ప్రస్తుతం 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్, త్రిప్తిల ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మార్చి 5, 2027న థియేటర్లలోకి రానుంది.

మరోవైపు దీపికా పదుకోణే వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షారూఖ్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న 'కింగ్' సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుండగా, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న 'రాకా' చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More