Prakash Raj Spirit: స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. కన్ఫామ్ చేసిన సందీప్ వంగా బ్రదర్.. రీజన్ ఇదేనా? సైలెంట్‌గా
Prakash Raj Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారు. ఈ విషయాన్ని సందీప్ సోదరుడు, ప్రొడ్యూసర్ ప్రణయ్ కన్ఫామ్ చేశారు. దీనికి గల అసలు కారణాలు ఏంటీ? తెర వెనుక ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
Prakash Raj Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారు. ఈ విషయాన్ని సందీప్ సోదరుడు, ప్రొడ్యూసర్ ప్రయణ్ రెడ్డి వంగా కన్ఫామ్ చేశారు.

స్పిరిట్ నుంచి అవుట్
స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నారని కొంతకాలంగా ప్రచారం సాగింది. తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా దీనిపై క్లారిటీనిచ్చారు. అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. అయితే స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవడానికి గల అసలు కారణం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆ నిబంధనే కారణమా?
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రకాష్ రాజ్ కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక చిన్న విజ్ఞప్తి చేశారని తెలిసింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా విడుదలయ్యే వరకు రాజకీయపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని ప్రకాష్ రాజ్ ను సందీప్ కోరారంటా. ప్రకాష్ రాజ్ చేసే బోల్డ్ పొలిటికల్ కామెంట్లు సినిమా కలెక్షన్లపై, అలాగే వివాదాల రూపంలో ప్రాజెక్ట్ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సందీప్ ఈ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది.
సంబంధం లేదన్న ప్రకాష్ రాజ్
అయితే సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ ను ప్రకాష్ రాజ్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. "నా వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు, నటనతో కూడిన వృత్తిపరమైన జీవితానికి ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. తన భావప్రకటనా స్వేచ్ఛను పక్కనపెట్టడానికి ఆయన అంగీకరించలేదని సమాచారం.
ఈ విషయంలో ఇద్దరి మధ్య అవగాహన కుదరకపోవడంతో, ఇరువురూ పరస్పర అవగాహనతో విడిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఫలితంగా 'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవాల్సి వచ్చింది.
ఎవరిని తీసుకుంటారో?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూనే, మరోవైపు తీవ్ర చర్చలకు దారితీస్తుంటాయి. ఇలాంటి సమయంలో నటుల రాజకీయ వ్యాఖ్యల వల్ల సినిమాకు కొత్త సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ లేరని నిర్మాత అధికారికంగా ధృవీకరించడంతో, ఆయన స్థానంలో ఏ నటుడిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ వాయిస్ తో స్పిరిట్ ఆడియో స్టోరీ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


