Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ థియేటర్లలో అదరగొడుతోంది. ఇవాళ (ఆగస్టు 21) రిలీజైన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో రవితేజ హిట్ కొట్టాడని అంతా అంటున్నారు. మరోవైపు థియేటర్లలో ఇరుముడి స్క్రీనింగ్ సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ గా మారాయి.
ఇరుముడి సక్సెస్

వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు తీసిన రవితేజ ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రూట్ మార్చి ‘ఇరుముడి’ అని ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తో థియేటర్లలోకి వచ్చాడు. ఆ ప్రయోగం ఫలించింది. ఇరుముడి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ స్క్రీనింగ్ అవుతున్న థియేటర్లలో ఆడియన్స్ భక్తితో ఊగిపోతున్నారు.
స్క్రీన్ కు హారతి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న సీన్ హాట్ టాపిక్ గా మారింది. స్క్రీన్ పై ఇరుముడి సినిమాలోని అయ్యప్ప సాంగ్ వస్తుంటే ఓ ప్రేక్షకుడు హారతి ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను రవితేజ ఫ్యాన్స్, నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
భజనలు, డ్యాన్స్ లు
ఇరుముడి సినిమాలో హీరో అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే ‘కట్టు కట్టు కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ పాటలు రాగానే ఆడియన్స్ కూడా గొంతు కలుపుతున్నారు. కొంతమంది ఏమో స్క్రీన్ ముందుకు వెళ్లి భజన చేస్తున్నారు. డ్యాన్స్ లు చేస్తున్నారు. విదేశాల్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}ఇరుముడి సినిమాలో హీరో అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే ‘కట్టు కట్టు కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ పాటలు రాగానే ఆడియన్స్ కూడా గొంతు కలుపుతున్నారు. కొంతమంది ఏమో స్క్రీన్ ముందుకు వెళ్లి భజన చేస్తున్నారు. డ్యాన్స్ లు చేస్తున్నారు. విదేశాల్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి.
{{/usCountry}}రవితేజ పిల్లలు
మరోవైపు మాస్ మహారాజా రవితేజ పిల్లలు ఫ్యాన్స్ తో కలిసి ఇరుముడి సినిమా చూశారు. హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో వీళ్లు ఫస్ట్ షో చూశారు. రవితేజ కొడుకు, కూతురు థియేటర్ కు వచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇరుముడి గురించి
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన మూవీ ఇరుముడి. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. ప్రతి అమ్మాయిలోనూ తన సొంత కూతురిని చూసుకునే తండ్రి కథతో ఈ మూవీ తెరకెక్కింది.
ఇరుముడి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. చిత్రానికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.