Irumudi Criticism: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న వేళ, ఈ సినిమాలోని కీలకమైన పాయింట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ రాసుకున్న కథనంలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ ఒక నెటిజన్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
"ధైర్యంగా ఉంటే చంపేస్తారా?".. నెటిజన్ మైండ్ బ్లాకింగ్ ప్రశ్న

ఒకవైపు పిల్లలు ఎలాంటి విషయం జరిగినా తండ్రికి ధైర్యంగా చెప్పాలని, భయం లేకుండా బతకాలని ఇరుముడి సినిమా ప్రారంభంలో చెప్పిన డైరెక్టర్.. ఆ తర్వాత నిజం చెప్పాలనుకున్న కూతురి పాత్రను ఎందుకు చంపేశారని కార్డియలాజిస్ట్ అయిన ఉప్పలపాటి రామ్‌వర్మ అనే వ్యక్తి నిలదీశారు. సమాజంలో ధైర్యంగా ఉండే అమ్మాయిలకు ప్రేరణగా నిలవాల్సిన పాత్రను అర్ధాంతరంగా అంతం చేయడం వల్ల ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశ్నించడం గమనార్హం.
సినిమాలు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, నిజాలు మాట్లాడితే ప్రాణాలు పోతాయనే భయం పిల్లల్లో కలిగించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ధైర్యంగా ఉన్న అమ్మాయి బతికి ఉంటే ఎంతోమందికి ప్రేరణగా నిలిచేది కదా అని సదరు నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కారు.
భయం vs ధైర్యం.. శివ నిర్వాణ విజన్‌పై అనుమానాలు
ఇక మరోవైపు సాయికుమార్ క్యారెక్టర్ ద్వారా "అమ్మాయిలు భయంతో పెరగడమే శ్రీరామరక్ష" అని చెప్పించడాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు. నిజం చెబితే ప్రాణాలు పోతాయనే భయంతో ఇంకొక అమ్మాయి నిజాన్ని దాచిపెట్టి, ఎమ్మెల్యే చేతిలో జీవితాన్ని నాశనం చేసుకుంటుందని.. అసలు ఈ రెండు పాత్రల ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో అర్థం కావడం లేదని విశ్లేషించారు.
ఒకవైపు ధైర్యంగా ఉన్న అమ్మాయి పాత్రను చంపేసి, మరోవైపు భయంతో ఉన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి.. అసలు ఎలాంటి మెసేజ్ ఇవ్వడానికి డైరెక్టర్ ఈ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
'నిన్ను కోరి', 'మజిలీ' డైరెక్టర్ నుంచి ఇలాంటి లోపమా?
{{/usCountry}}ఒకవైపు ధైర్యంగా ఉన్న అమ్మాయి పాత్రను చంపేసి, మరోవైపు భయంతో ఉన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి.. అసలు ఎలాంటి మెసేజ్ ఇవ్వడానికి డైరెక్టర్ ఈ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
'నిన్ను కోరి', 'మజిలీ' డైరెక్టర్ నుంచి ఇలాంటి లోపమా?
{{/usCountry}}'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి ఇంటెన్స్ ఎమోషనల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ నుంచి ఇలాంటి స్క్రీన్‌ప్లే లోపాలను ఊహించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. సాధారణంగా శివ నిర్వాణ సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్, పాత్రల మధ్య బంధం చాలా బలంగా ఉంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం ప్రధానమైన కథాంశంలోనే ఈ అయోమయం ఏర్పడిందని ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
సినిమాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే చూడాలని కొందరు అంటున్నా, సమాజంపై ప్రభావం చూపే కీలకమైన పాయింట్లు ఉన్నప్పుడు కథాంశంలో అది ఉండాలని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
బాక్సాఫీస్ సక్సెస్.. అయినా లోపాలతో విమర్శలు
బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న 'ఇరుముడి' సినిమా కమర్షియల్‌గా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ, ఈ సామాజిక అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ మార్క్ ఎనర్జీ, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినప్పటికీ, మెసేజ్ విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ లేదా మూవీ టీమ్ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.