Irumudi: ఏం క్రేజ్.. ఏం జనాలు.. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్.. ఇప్పుడు రవితేజ సినిమా ఇరుముడి గురించి జనాలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. అవును.. ఇరుముడి మూవీ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇది. ఈ చిత్రం రిలీజై 9 రోజులు గడుస్తున్నా టికెట్ సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.
ఇరుముడి క్రేజ్

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చి తొమ్మిది రోజులు గడుస్తున్నా, మొదటి రోజు ఎంతటి క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయి ఉత్సాహం కనిపిస్తోంది. ఆడియన్స్ ఈ సినిమాకు జై కొడుతున్నారు.
ఇక మళ్లీ వీకెండ్ కావడంతో ఇరుముడి థియేటర్ల దగ్గర క్రేజ్ మరో లెవల్ కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా థియేటర్ల వద్ద రవితేజ అభిమానుల కోలాహలం నెలకొంది.
రికార్డు స్థాయి టికెట్లు
ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక 'బుక్ మై షో' (Book MyS how) లో ఈ ఇరుముడి సినిమా టికెట్ల కొనుగోలు జాతరలా సాగుతోంది. 9వ రోజున కూడా ఈ చిత్రానికి సంబంధించి గంటకు సగటున 24.52 వేల (24.52K) టికెట్లు విక్రయమవుతున్నాయి. ఈ విషయాన్ని ఇరుముడి నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
అదిరేలా
సాధారణంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల బుకింగ్స్ తగ్గుముఖం పడుతుంటాయి. కానీ, 'ఇరుముడి' విషయంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రోజు రోజుకూ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ఆన్లైన్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
హౌస్‌ఫుల్ బోర్డులు
{{/usCountry}}సాధారణంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాల బుకింగ్స్ తగ్గుముఖం పడుతుంటాయి. కానీ, 'ఇరుముడి' విషయంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రోజు రోజుకూ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ఆన్లైన్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
హౌస్‌ఫుల్ బోర్డులు
{{/usCountry}}బి, సీ సెంటర్లతో పాటు ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో కూడా ఇరుముడి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కాంప్లెక్స్ లుగా మారుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు పుష్కలంగా ఉండటమే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడానికి ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే 9వ రోజున కూడా మొదటి రోజు నాటి ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' మాస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది.
జనాల ధర్నా
ఇరుముడి గురించి చెప్పుకోవాల్సిన మరో విషయం ఉంది. ఈ సినిమాను జనాలు ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే.. సినిమా కోసం థియేటర్ల దగ్గర ధర్నాలు కూడా చేశారు. అంతలా ఈ ఇరుముడి సినిమా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అందుకే సెకండ్ వీకెండ్ కూడా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.