...
...
Next Story

Irumudi Record: ఇరుముడి రికార్డుల దండయాత్ర.. 24 గంటల్లో ఆల్ టైమ్ టికెట్ సేల్స్.. జనాలు ఎగబడి చూడటానికి 5 కారణాలివే!

Irumudi Record: రవితేజ హీరోగా నటించిన ఇరుముడి మూవీ రికార్డుల దండయాత్ర కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. తాజాగా 24 గంటల టికెట్ సేల్ లో మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. మరి జనాలు ఇంతలా ఎగబడి ఈ మూవీ చూడటానికి 5 కారణాలు ఏంటో చూసేయండి.

Published on: Aug 30, 2026, 14:21:44 IST
Advertisement

Irumudi Record: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. థియేటర్లలో టఫ్ పోటీ ఉన్నా కూడా ఎక్కడా తగ్గకుండా టికెట్ల వేటలో దూసుకెళ్తోంది. రోజురోజుకూ ప్రేక్షకుల ఆదరణ ఊహించని రీతిలో పెరుగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను ఈ చిత్రం చేరుకుంటోంది. టికెట్ సేల్స్, కలెక్షన్లలో అదరగొడుతూ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది.

ఆల్ టైమ్ రికార్డు

ఇరుముడి రికార్డుల దండయాత్ర.. 24 గంటల్లో ఆల్ టైమ్ టికెట్ సేల్స్.. జనాలు ఎగబడి చూడటానికి 5 కారణాలివే! (x/MythriOfficial)
ఇరుముడి రికార్డుల దండయాత్ర.. 24 గంటల్లో ఆల్ టైమ్ టికెట్ సేల్స్.. జనాలు ఎగబడి చూడటానికి 5 కారణాలివే! (x/MythriOfficial)

తాజాగా ఇరుముడి సినిమా బాక్సాఫీస్ టికెట్ విండోల వద్ద ఒక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వేదికలైన 'బుక్‌ మై షో' (BookMyShow), 'డిస్ట్రిక్ట్' (District) లలో గత 24 గంటల వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఇండియన్ మూవీగా 'ఇరుముడి' సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు విక్రయించిన కచ్చితమైన టికెట్ల సంఖ్యను ప్రకటించనప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను ఈ రికార్డు స్పష్టం చేస్తోంది.

ఆదివారం (ఆగస్టు 30) నాటి ఆన్‌లైన్ బుకింగ్ ట్రెండ్స్ కూడా ఇరుముడి సినిమా బాక్సాఫీస్ స్టామినాను ప్రతిబింబిస్తున్నాయి. బుక్‌మైషోలో గంటకు సగటున 22 వేలకు పైగా (22K+) టికెట్లు సేల్ అవుతుండటంతో ఆదివారం మరో భారీ కలెక్షన్ల రోజుగా మారబోతోంది. ఈ బాక్సాఫీస్ జోరు చూస్తుంటే రవితేజ సినిమా.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటడానికి సిద్ధంగా ఉందనిపిస్తోంది.

సక్సెస్ కారణాలు

ఇరుముడి సినిమాను జనాలు ఇంతలా ఆదరించడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా రవితేజ, ఆయన కూతురిగా నటించిన బేబీ నక్షత్ర యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ జీవించేశారు. ఇక అమ్మాయిలను ధైర్యంగా పెంచాలని, ఎవరైనా జోలికి వస్తే తాట తీయాలనే మెసేజ్ కూడా బాగుంది.

ఇక మూవీలోని సస్పెన్స్, ట్విస్ట్ లు కూడా అదిరిపోయాయి. నాగులును ఎవరు చంపారనేది, మణికంఠ హత్య, ఎమ్మెల్యే నిజ స్వరూపం లాంటివి ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తున్నాయి. ఇక అయ్యప్ప పాటలు మరోసారి జనాలను థియేటర్లకు రప్పించేలా ఉన్నాయి. ఫైనల్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూసి, ఎమోషనల్ అయ్యే మూవీ కావడంతో ఇరుముడికి కుటుంబాలు క్యూ కడుతున్నాయి.

ఇరుముడి సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి శివ నిర్వాణ డైరెక్టర్. జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe