Irumudi Ram charan: ‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో- రూమర్స్ వెనుక అసలు నిజం ఇదే- రవితేజ ఇరుముడిపై క్లారిటీ!

Irumudi Ram charan: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఇరుముడి’. త్వరలోనే థియేటర్లకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ లో రామ్ చరణ్ కనిపించనున్నారనే టాక్ వైరల్ గా మారింది. మరి అసలు నిజమేంటో ఇక్కడ చూసేయండి. 

Published on: Aug 18, 2026, 11:21:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi Ram charan: హిట్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్ హీరో ఇప్పుడు ‘ఇరుముడి’ అంటూ థియేటర్లకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ దూకుడు చూపిస్తోంది.

‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో- రూమర్స్ వెనుక అసలు నిజం ఇదే- రవితేజ ఇరుముడిపై క్లారిటీ!
‘మల్లెపూల పల్లకి’ పాటలో రామ్ చరణ్ క్యామియో- రూమర్స్ వెనుక అసలు నిజం ఇదే- రవితేజ ఇరుముడిపై క్లారిటీ!

మల్లెపూల పల్లకి సాంగ్

రీసెంట్ గా ఇరుముడి సినిమా నుంచి ‘మల్లెపూల పల్లకి’ అనే పాపులర్ అయ్యప్ప భక్తి పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ట్రెండింగ్ లో దూసుకొచ్చింది. అయితే ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రత్యేక క్యామియో ఉందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

రామ్ చరణ్ ఉన్నారా?

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందించిన ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విడుదలైన నిమిషాల్లోనే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ పాట ప్రమోషనల్ కంటెంట్‌లో ఉన్న ప్రత్యేకమైన ఎలిమెంట్స్ చూసి నెటిజన్లు రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నారంటూ స్పెక్యులేషన్స్ ప్రారంభించారు.

అయితే ఈ పాటలో రామ్ చరణ్ లేరని తేలిపోయింది. కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని మూవీ టీమ్ పేర్కొంది.

అందుకే రూమర్లు

గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలాగే రవితేజతో చరణ్‌కు ఉన్న ఆత్మీయ అనుబంధం (‘నాయక్’ వాయిస్ ఓవర్) ఉంది. అంతేకాకుండా రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. ఈ కారణాలతో చెర్రీ క్యామియో నిజమేనని అభిమానులు నమ్మారు.

ఆగస్టు 21 రిలీజ్

ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ‘ఇరుముడి’ ఆగస్టు 21న బాక్స్ ఆఫీస్ రేసులోకి దిగుతోంది. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. బేబీ నక్షత్ర కీ రోల్ ప్లే చేసింది. ఏస్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఉండటంతో థియేట్రికల్ అండ్ డిజిటల్ రైట్స్ ఆశించిన స్థాయిలో క్లోజ్ అయ్యాయి.

'మల్లెపూల పల్లకి' పాట సాధించిన సక్సెస్ సినిమా బిజినెస్‌కి, ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌కి ప్రధాన ప్లస్ పాయింట్‌గా మారనుంది.

అవే ప్లస్

రవితేజ ‘ఇరుముడి’ పాటలో రామ్ చరణ్ లేకపోవడం ఫ్యాన్స్‌కు డిజప్పాయింట్‌మెంట్ అని చెప్పొచ్చు. అయినా, ఫేక్ హైప్‌తో ప్రేక్షకులను భ్రమకు గురిచేయకుండా వాస్తవాన్ని ఉంచడం వల్ల సినిమా ఒరిజినల్ కంటెంట్‌పై థియేటర్లలో రెస్పాన్స్ బాగుంటుంది. జివి ప్రకాష్ సంగీతం, రవితేజ మాస్ ఇమేజ్ ఈ సినిమాకు అసలైన బాక్స్ ఆఫీస్ డ్రైవింగ్ ఫోర్స్ కానున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More