Isakapatnam Trailer: అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త పాన్-ఇండియా రేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' (Isakapatnam) అఫీషియల్ ట్రైలర్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను షేక్ చేస్తోంది. ఒక పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్.. గ్యాంగ్ వార్స్, రౌడీయిజం, ఫ్యామిలీ గొడవల చుట్టూ ఇంటెన్స్ గా తిరుగుతుంది.

ట్రైలర్ మొదటి సీన్ నుంచే పవర్‌ఫుల్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో డైరెక్టర్ ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పించారు. కుర్చీ కోసం తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ ఫైట్ చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తండ్రి కుర్చీని దక్కించుకోవడానికి అతన్ని చంపించడానికి కూడా వెనుకాడని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ను ఈ ట్రైలర్లో చూపించారు.
తండ్రి సామ్రాజ్యానికే సవాల్ విసిరిన కూతురు..
టాలీవుడ్ డిజిటల్ స్పేస్‌లో నెంబర్ వన్ బ్యానర్ అయిన టమాడా మీడియా ప్రొడక్షన్స్ ఈ ఇసకపట్నం వెబ్ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో నిర్మించింది. రాహుల్ టమాడా, సాయిదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించిన ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ప్రైమ్ డే (Prime Day) స్పెషల్ లైనప్‌లో భాగంగా గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
విలక్షణ నటుడు సముద్రఖని ఈ వెబ్ సిరీస్‌లో నాయుడు అనే పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు. ఆ ఊరిని, అక్కడి పాలిటిక్స్‌ను, పోర్ట్ బిజినెస్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని శాసించే ఒక అజేయమైన లీడర్‌గా ఆయన లుక్ అద్భుతంగా ఉంది. తనను ఎవరూ ఓడించలేరని అహంకారంతో ఉండే నాయుడుకు.. ఊహించని విధంగా అతని సొంత కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్) రూపంలోనే అతిపెద్ద అడ్డంకి ఎదురవుతుంది. తండ్రి నీడలో బతకడానికి ఇష్టపడని ఒక స్వతంత్ర మహిళగా ఐశ్వర్య రాజేష్ వన్ మ్యాన్ షో చూపించింది.
తండ్రీకూతుళ్ల ఈ ఇగో వార్ కాస్తా ఒక తీవ్రమైన యుద్ధంగా మారినప్పుడు.. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, పాత శత్రువులు మళ్లీ యాక్టివ్ అవ్వడం ట్రైలర్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అతన్ని చంపడానికి ఇదే సరైన సమయం అంటూ ట్రైలర్లో ఐశ్వర్య చెప్పే డైలాగ్ ఆసక్తి రేపింది. సునీల్ ఒక డిఫరెంట్ నెగెటివ్ రోల్లో మెరవగా.. నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి బెనర్జీ, రవివర్మ లాంటి భారీ తారాగణం ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్లాస్ పాయింట్ కానుంది.
జులై 2 నుంచి స్ట్రీమింగ్
{{/usCountry}}తండ్రీకూతుళ్ల ఈ ఇగో వార్ కాస్తా ఒక తీవ్రమైన యుద్ధంగా మారినప్పుడు.. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, పాత శత్రువులు మళ్లీ యాక్టివ్ అవ్వడం ట్రైలర్లో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అతన్ని చంపడానికి ఇదే సరైన సమయం అంటూ ట్రైలర్లో ఐశ్వర్య చెప్పే డైలాగ్ ఆసక్తి రేపింది. సునీల్ ఒక డిఫరెంట్ నెగెటివ్ రోల్లో మెరవగా.. నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి బెనర్జీ, రవివర్మ లాంటి భారీ తారాగణం ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్లాస్ పాయింట్ కానుంది.
జులై 2 నుంచి స్ట్రీమింగ్
{{/usCountry}}'క్షణం', 'గూఢచారి' సినిమాలకు ఎడిటర్‌గా చేసి.. నిఖిల్ 'స్పై' సినిమాతో డైరెక్టర్‌గా మారిన టాలెంటెడ్ మేకర్ గ్యారీ బీహెచ్ (Garry BH) ఈ ఇసకపట్నం వెబ్ సిరీస్‌ను పూర్తి రా అండ్ రియలిస్టిక్ టోన్‌లో తెరకెక్కించారు. ప్రశాంత్ రగతి అందించిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు, తాజుద్దీన్ సయ్యద్ రాసిన పదునైన మాస్ డైలాగ్స్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూడ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి.
ఈ మోస్ట్ అవేటెడ్ తెలుగు ఒరిజినల్ సిరీస్ జులై 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 దేశాల్లోని ప్రైమ్ వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఆడియో డబ్బింగ్ పూర్తవగా.. ఇంగ్లీష్‌తో కలిపి మొత్తం 15 అంతర్జాతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఓటీటీ మార్కెట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్న ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామా డిజిటల్ ఆడియన్స్‌కు ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ కాబోతోంది.