OTT Romantic Crime: ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్- సైకలాజికల్ గేమ్‌గా మారే ప్రేమాయణం- ఫ్రీగా స్ట్రీమింగ్

OTT Romantic Crime Thriller Ishqa Ishqa Trailer Released: ప్రేమ, పిచ్చి, అజమాయిషీల మధ్య సాగే మానసిక ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్కా ఇష్కా ట్రైలర్‌ను తాజాగా ఇవాళ విడుదల చేశారు. హెల్లీ షా, సత్యజీత్ దూబే, అనుష్క కౌశిక్ నటించిన ఇష్కా ఇష్కా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Oct 5, 2026, 21:52:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Romantic Crime Thriller Ishqa Ishqa Trailer Released: ప్రేమ ఒక అందమైన అనుభూతి. అయితే ఆ ప్రేమే హద్దులు దాటి అజమాయిషీగా, ఒక రకమైన పిచ్చిగా (Obsession) మారితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో చూపించే సరికొత్త ఓటీటీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇష్కా ఇష్కా'.

ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్- సైకలాజికల్ గేమ్‌గా మారే ప్రేమాయణం- ఫ్రీగా స్ట్రీమింగ్
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్- సైకలాజికల్ గేమ్‌గా మారే ప్రేమాయణం- ఫ్రీగా స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఇష్కా ఇష్కా

తాజాగా ఇవాళ (అక్టోబర్ 5) ఇష్కా ఇష్కా ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాజేష్ బచ్చానీ కథ అందించిన ఈ ఓటీటీ సిరీస్‌ను అమిత్ కుమార్ ఝా తెరకెక్కించారు. హెల్లీ షా, సత్యజీత్ దూబే, అనుష్క కౌశిక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూవీయింగ్ ఇమేజెస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మించింది.

రెండు విభిన్నమైన ప్రేమల నడుమ రచయిత నలిగిపోతే..

ఒకవైపు ప్రశాంతతను పంచే ప్రేమ, మరోవైపు జీవితంలో అలజడి రేపే తీవ్రమైన ఆరాధన.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే కబీర్ అనే రచయిత కథే ఈ ఓటీటీ సిరీస్. ఇష్కా ఇష్కా ట్రైలర్ ఆధారంగా చూస్తే ఆరోహి (హెల్లీ షా), కబీర్ (సత్యజీత్ దూబే), సుహాసిని (అనుష్క కౌశిక్)ల చుట్టూ కథ తిరుగుతుంది.

ఆరోహి దృష్టిలో ప్రేమంటే భాగస్వామిని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకోవడమే. అక్కడ దూరానికి గానీ, సందేహాలకు గానీ తావుండదు. అదే సమయంలో కబీర్ జీవితంలోకి సుహాసిని వస్తుంది. ఆమె నుంచి అతడికి మానసిక ప్రశాంతత, నమ్మకం, స్పష్టత లభిస్తాయి.

అయితే ఊహించని విధంగా ఆరోహి మళ్లీ అతడి జీవితంలోకి అడుగుపెట్టడంతో కబీర్ ప్రశాంతత గాల్లో కలిసిపోతుంది. స్వేచ్ఛకు, బంధనానికి మధ్య, జీవితాన్ని నిలబెట్టే ప్రేమకు, జీవితాన్ని నాశనం చేసే పిచ్చికి మధ్య కబీర్ ఎలా నలిగిపోయాడు అనేది సైకలాజికల్ గేమ్‌గా మారుతుంది. ప్రేమ ఎప్పుడు ఒక జబ్బుగా మారుతుందో ప్రశ్నించేలా ఈ కథనం సాగుతుంది.

పాత్రలపై నటీనటులు, మేకర్స్ స్పందన

ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. "ప్రేమ అనే అనుభూతి అజమాయిషీగా, వదులుకోలేని భయంగా మారినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇందులో చూపించాం" అని ప్రైమ్ వీడియో ఇండియా ఏవోడీ కంటెంట్ హెడ్ అమోగ్ దూసద్ పేర్కొన్నారు.

తన పాత్ర గురించి నటి హెల్లీ షా మాట్లాడుతూ, "ఆరోహి కబీర్‌ను అమితంగా ప్రేమిస్తుంది. కానీ ఆమె దృష్టిలో ప్రేమ, అజమాయిషీ ఒకటే. తీవ్రమైన భావోద్వేగాలు ఉన్న ఈ పాత్రలో నటించడం ఎంతో సవాలుగా అనిపించింది" అని అన్నారు.

అలాగే సత్యజీత్ దూబే స్పందిస్తూ, "ఈ తీవ్రమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి కబీర్ చేసే ప్రయత్నమే ఈ సిరీస్ సారం" అని చెప్పారు. సుహాసిని పాత్ర పోషించిన అనుష్క కౌశిక్ మాట్లాడుతూ, "ప్రేమలో నమ్మకం, స్వేచ్ఛ ఉండాలని నమ్మే అమ్మాయిగా కనిపించబోతున్నాను" అని తెలిపారు.

స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

డిజిటల్ వినోద ప్రపంచంలో ఈ తరహా కథనాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఎంఎక్స్ ప్లేయర్ ఆండ్రాయిడ్ యాప్‌లో 'ఇష్కా ఇష్కా' ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఇష్కా ఇష్కా సిరీస్‌ను ఆస్వాదించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More