Itlu Arjuna: మ్యూజిక్ లవర్స్ కు ఒక క్రేజీ అప్‌డేట్. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరిద్దరూ ఈ కొలాబొరేషన్‌ను సరదాగా “బక్కోడు X బండోడు” అని పిలుచుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వస్తున్న ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna) మూవీ కోసం ఈ ఇద్దరు దిగ్గజాలు జతకట్టారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. సింగర్ అనిరుధ్

మంగళవారం (మే 26) ఉదయం నుంచి సోషల్ మీడియాలో సస్పెన్స్ క్రియేట్ చేసిన అనిరుధ్, తమన్.. చివరకు తమ సరికొత్త కాంబినేషన్ వివరాలను ఒక క్యూట్ ప్రోమో ద్వారా బయటపెట్టారు.
ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హై రే’ (Hai Re)కు తన గాత్రాన్ని అందించారు. ఈ ప్రోమోలో ఇద్దరు సంగీత దర్శకుల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రోమోలోని ఆసక్తికర సంభాషణ
ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమో మొదట్లో తమన్, అనిరుధ్ ఇంట్రడక్షన్ ఫన్నీగా సాగింది. పాట ఎవరి దగ్గరికి వెళ్తున్నారు సర్ అని అనిరుధ్ ని అడిగితే.. బండోడి దగ్గరికి అని అతడు చెబుతాడు. పాడటానికి ఎవరొస్తున్నారన్నా అని తమన్ ను అడిగితే అతడు మన బక్కోడు అని అంటాడు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఇందులో చూడొచ్చు.
ఆ తర్వాత అనిరుధ్.. "ఇదేం మాస్ సాంగ్ బాస్?" అని తమన్‌ను అడగ్గా.. "ఇది మాస్ సాంగ్ కాదు బ్రదర్, ఒక ప్యూర్ లవ్ సాంగ్" అంటూ తమన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ బ్యూటిఫుల్ మెలోడీ లవ్ సాంగ్ పూర్తి ట్రాక్‌ను మే 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కథలో సంగీతానిదే కీలక పాత్ర
ఈ మూవీతో అనీష్ అనే కొత్త నటుడు టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతుండగా, మహేష్ ఉప్పాల దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. 'ఇట్లు అర్జున' చిత్రంలో కథానాయకుడు వినికిడి లోపం, మూగ సమస్యలతో బాధపడే పాత్రలో కనిపిస్తాడు.
{{/usCountry}}ఈ మూవీతో అనీష్ అనే కొత్త నటుడు టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతుండగా, మహేష్ ఉప్పాల దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు. 'ఇట్లు అర్జున' చిత్రంలో కథానాయకుడు వినికిడి లోపం, మూగ సమస్యలతో బాధపడే పాత్రలో కనిపిస్తాడు.
{{/usCountry}}హీరో మాట్లాడలేడు, వినలేడు కాబట్టి, ఈ కథలో భావోద్వేగాలను పండించడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు అత్యంత కీలకమైన పాత్ర పోషించనున్నాయని మేకర్స్ తెలిపారు. 'రౌడీ బాయ్స్' ఫేమ్ అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం విడుదలైన ఈ చిన్న ప్రోమో సాంగ్స్ లవర్స్‌లో పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ఇట్లు అర్జున' సినిమా ప్రత్యేకత ఏంటి?
ఈ సినిమాలో కథానాయకుడు వినికిడి లోపం, మూగ సమస్యలు ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. అందువల్ల సినిమా కథాంశంలో సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమైన పాత్ర పోషించనున్నాయి.
2. "బక్కోడు X బండోడు" అంటే ఎవరు?
సంగీత దర్శకులు అనిరుధ్ రవిచందర్ (బక్కోడు), ఎస్.ఎస్. తమన్ (బండోడు)లను ఉద్దేశించి వారి శారీరక రూపాన్ని బట్టి సరదాగా పెట్టుకున్న పేరు ఇది.
3. 'హై రే' (Hai Re) పూర్తి పాట ఎప్పుడు విడుదలవుతుంది?
తమన్ మ్యూజిక్ అందించగా.. అనిరుధ్ పాడిన ఈ లవ్ మెలోడీ సాంగ్ మే 28న విడుదల కానుంది.