Bigg Boss 10: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' (Bigg Boss 10 Telugu) కంటెస్టెంట్ల పేర్లపై ప్రచారం జోరందుకుంది. తాజాగా 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా తెలుగు ఇళ్లలో సుపరిచితుడైన కమెడియన్ నరేష్ (జబర్దస్త్ నరేష్) హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లు టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ 10లోకి నరేష్

రియాలిటీ షోలలో గొడవలు, డ్రామా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన వినోదాన్ని అందించే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికే జబర్దస్త్ నరేష్‌ను మేకర్స్ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.
టీఆర్పీ ప్లాన్
టీవీలో సీరియల్ అయినా రియాలిటీ షో అయినా టీఆర్పీ రేటింగ్స్ రాబట్టడంపైనే ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో కూడా అదే బాటలో సాగుతోంది. తన ఎత్తును, రూపాన్ని నెగెటివ్‌గా తీసుకోకుండా తనపై తానే జోకులు వేసుకునే నరేష్ శైలి బిగ్ బాస్ ఆడియన్స్‌కు తక్షణమే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అతణ్ని బరిలో దించుతున్నారని టాక్.
ఫ్యామిలీ ఆడియన్స్
ఏళ్ల తరబడి జబర్దస్త్ చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంత ఫ్యామిలీ ఆడియన్స్‌కు నరేష్ చేరువయ్యాడు. ఇది నరేష్‌కు ఓటింగ్ పరంగా అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. దీంతో నరేష్ పక్కాగా హౌస్ లో అడుగుపెడితే ఇక రచ్చ రచ్చే అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
కష్టాలను దాటి వచ్చిన కామెడీ స్టార్
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నరేష్ జీవితం ఆరంభంలో అనేక ఒడుదొడుకులతో సాగింది. చిన్నతనం నుంచే శారీరక ఎదుగుదల లోపం (Short Stature) వల్ల సమాజంలో వెక్కిరింపులు, అవమానాలు ఎదురయ్యాయి. కానీ నరేష్ ఎప్పుడూ ఆగిపోలేదు.
జబర్దస్త్ జర్నీ
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నరేష్ జీవితం ఆరంభంలో అనేక ఒడుదొడుకులతో సాగింది. చిన్నతనం నుంచే శారీరక ఎదుగుదల లోపం (Short Stature) వల్ల సమాజంలో వెక్కిరింపులు, అవమానాలు ఎదురయ్యాయి. కానీ నరేష్ ఎప్పుడూ ఆగిపోలేదు.
జబర్దస్త్ జర్నీ
{{/usCountry}}ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో నరేష్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అతని యాక్టింగ్, పంచ్ లు బాగా పేలాయి. కొన్ని పాత్రలు సూపర్ హిట్ అయ్యాయి. అతను వేసే కౌంటర్లు, పంచ్‌లు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కూడా చేశాడు. ఎత్తు తక్కువ ఉన్నప్పటికీ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో స్క్రీన్‌పై తన ఉనికిని చాటుకుని బుల్లితెరపై చెరగని ముద్ర వేస్తున్నాడు.
ఈ సవాళ్లు
నరేష్ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడం కన్ఫామ్ అయినట్లే అని అంటున్నారు. అదే నిజమైతే బిగ్ బాస్ లో అతని కోసం సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ అనేది కేవలం 5 నిమిషాల స్కిట్ కాదని, 24/7 పర్సనాలిటీ టెస్ట్ అనే విషయం తెలిసిందే.
బిగ్ బాస్ హౌస్‌లో ఉండే కఠినమైన ఫిజికల్ టాస్క్‌లను నరేష్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరమైన అంశం. ఫిజికల్ గేమ్‌లలో అతనికి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయా లేక తన తెలివితో టాస్క్‌లను పూర్తి చేస్తాడా అనేది చూడాలి.