రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి అప్పలసూరి అనే పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ చూడగానే ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇందులో ఉన్నది జగపతి బాబు అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.
పెద్దిలో అప్పలసూరిగా జగపతి బాబు

పైనున్న ఫొటో చూశారు కదా? అది జగపతి బాబు అంటే నమ్మగలరా? పెద్ది సినిమాలో అప్పలసూరి అనే పాత్ర కోసం ఈ స్టార్ నటుడు పూర్తిగా మారిపోయాడు. ఈ మధ్య తనకు అనువైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు.. పెద్దిలో మాత్రం ఇలా పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.
“పెద్దిలో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో పెద్ది అధికారిక ఎక్స్ అకౌంట్ ట్వీట్ చేసింది.
అటు రామ్ చరణ్ కూడా ఈ పోస్టర్ ను తన అకౌంట్లో షేర్ చేశాడు. “స్క్రీన్ కు అతడు తీసుకొచ్చే ఇంటెన్సిటీ మరెవరి వల్లా సాధ్యం కాదు. జగపతి బాబు గారిని పెద్దిలో అప్పలసూరిగా చూడటం చాలా సంతోషంగా ఉంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు.
పెద్ది మూవీ గురించి..
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మూవీ పెద్ది. నేషనల్ అవార్డు విన్నర్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన చికిరి చికిరి పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.
మ్యూజిక్ తోపాటు చరణ్ స్టెప్పులు బాగా ఆకర్షించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. టీమ్ మాత్రం పదే పదే రిలీజ్ డేట్ అంటూ స్పష్టత ఇస్తూనే ఉంది. తాజాగా జగపతి బాబు లుక్ రిలీజ్ చేస్తూ కూడా మరోసారి డేట్ కన్ఫమ్ చేసింది.
{{/usCountry}}మ్యూజిక్ తోపాటు చరణ్ స్టెప్పులు బాగా ఆకర్షించాడు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. టీమ్ మాత్రం పదే పదే రిలీజ్ డేట్ అంటూ స్పష్టత ఇస్తూనే ఉంది. తాజాగా జగపతి బాబు లుక్ రిలీజ్ చేస్తూ కూడా మరోసారి డేట్ కన్ఫమ్ చేసింది.
{{/usCountry}}