Peddi: టాలీవుడ్ లెజెండరీ నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరికీ అందనంత వేగంతో దూసుకుపోతున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషిస్తున్న వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఆయన నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమాలో ఆయన 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
జగ్గూ భాయ్ జీవించేశాడు
పాత్ర కోసం జగపతి బాబు పడే తపన అంతా ఇంతా కాదు. దర్శకుడు అడిగిందే తడవుగా తన గెటప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మార్చేసుకుంటారు జగ్గూభాయ్. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో కూడా అదే జరగబోతోంది. జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
"మా జగ్గూభాయ్ అప్పలసూరిగా ఎలా మారిపోయారో మీరే చూడండి.. ఇదంతా అచ్చం ఒక మ్యాజిక్ లాగా జరిగింది. ఆయన పెద్ది సినిమా కోసం తన డబ్బింగ్ పూర్తి చేశారు" అని చిత్ర యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
జగపతి బాబు గంభీరమైన గొంతుకు టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బేస్ వాయిస్‌తో అప్పలసూరి డైలాగులు చెబితే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ డబ్బింగ్ ఆయన చెప్పే విధానం చూస్తే.. ఈ పాత్రలో ఎంతలా జీవించేశాడో అర్థమవుతుంది.
గతంలో చరణ్ కూడా పెద్ది డబ్బింగ్ పూర్తి చేశారు. అప్పుడు కూడా బుచ్చిబాబు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెద్ది మూవీ విశేషాలు
{{/usCountry}}గతంలో చరణ్ కూడా పెద్ది డబ్బింగ్ పూర్తి చేశారు. అప్పుడు కూడా బుచ్చిబాబు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెద్ది మూవీ విశేషాలు
{{/usCountry}}రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'పెద్ది' సినిమాను జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ప్రస్తుతానికి సోషల్ మీడియాలో #GetReadyForPeddi, #Appalasoori అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జగపతి బాబు తన మార్క్ యాక్టింగ్, వాయిస్‌తో అప్పలసూరి పాత్రకు ప్రాణం పోశారని, జూన్ 4న సిల్వర్ స్క్రీన్ మీద ఆ మ్యాజిక్‌ను చూడటం పక్కా అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
'పెద్ది' సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు ఏమిటి?
ఈ చిత్రంలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు.
'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
తాజాగా పెద్ది చిత్రబృందం ఇచ్చిన అప్‌డేట్ ఏమిటి?
జగపతి బాబు తన పాత్ర అప్పలసూరికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారని, ఆయన మేకోవర్ ఒక మ్యాజిక్‌లా ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.