Jagapathi Babu: ఇల్లు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రెండు వేర్వేరుగా ఉంచడమే నాకిష్టం.. జగపతి బాబు కామెంట్స్

Jagapathi Babu About Home: నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం, పాన్ ఇండియా సినిమా మార్పులు, తన వ్యక్తిగత జీవనశైలిపై సీనియర్ నటుడు జగపతి బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను మెథడ్ యాక్టర్ కాదని, పాత్ర నుంచి మరో పాత్రలోకి మారేందుకు ప్రత్యేక కరసత్తులు చేయనని జగపతి బాబు వెల్లడించారు.

Published on: Nov 23, 2026, 19:40:24 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jagapathi Babu About Home: భారతీయ చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం.. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి, సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు సీనియర్ నటుడు జగపతి బాబు.

ఇల్లు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రెండు వేర్వేరుగా ఉంచడమే నాకిష్టం.. జగపతి బాబు కామెంట్స్
ఇల్లు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆ రెండు వేర్వేరుగా ఉంచడమే నాకిష్టం.. జగపతి బాబు కామెంట్స్

వెండితెరపై గంభీరంగా కనిపించే ఆయన, కెమెరా ఆఫ్ అవ్వగానే చాలా సాదాసీదా జీవితాన్ని ఇష్టపడతారు. బిర్లా ఓపస్ పెయింట్స్ (Birla Opus Paints) కొత్తగా తీసుకొచ్చిన 'ఆల్ డ్రై' (All Dry) వాటర్ ప్రూఫింగ్ రేంజ్‌తో జతకట్టిన సందర్భంగా జగపతి బాబు ప్రత్యేకంగా ముచ్చటించారు. తన నటనా శైలి, మారుతున్న సినిమా తీరుతెన్నులు, తన ఇంటి డిజైన్ ఆలోచనలపై మనసు విప్పి మాట్లాడారు.

సెట్స్‌లోనే పాత్ర.. ఇంటికొస్తే సాధారణ వ్యక్తిని

"నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారడానికి ప్రత్యేకమైన కసరత్తులు ఏవీ చేయను. సన్నివేశంలోని ఎనర్జీని అర్థం చేసుకుని, దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా నటిస్తాను. షూటింగ్ షాట్‌కు కొద్దిసేపటి ముందు మాత్రమే ఆ పాత్ర మూడ్‌లోకి వెళ్తాను. ఇంటికి తిరిగి వచ్చాక కేవలం ఒక సాధారణ భర్తగా, తండ్రిగానే ఉంటాను. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా ఉంచడమే నాకు ఇష్టం" అని జగపతి బాబు తన నటనా విధానాన్ని వివరించారు.

బిజీ షూటింగ్ షెడ్యూల్స్ నుంచి విరామం దొరికినప్పుడు తనకంటూ కొంత సమయం కేటాయించుకుంటానని ఆయన తెలిపారు. "నాకు తీరిక దొరికిన రోజున యోగా, ధ్యానం చేస్తూ ప్రశాంతంగా గడుపుతాను. మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో తోడ్పడతాయి. నా పెంపుడు జంతువులతో సమయం గడపడం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. వాటి ప్రేమ, సాంగత్యం జీవితంలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను" అని తన దినచర్యను పంచుకున్నారు.

భాషా సరిహద్దులు చెరిగిపోయాయి

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్న జగపతి బాబు, భారతీయ సినిమాలో వస్తున్న మార్పులపై సంతోషం వ్యక్తం చేశారు.

"ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో చూసిన అద్భుతమైన మార్పు ఏంటంటే.. ఇప్పుడు సినిమాకు భాషా సరిహద్దులు లేవు. ప్రాంతీయ చిత్ర పరిశ్రమల మధ్య అడ్డుగోడలు తొలగిపోతున్నాయి. మంచి కథలు, ప్రతిభ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. దీనివల్ల నటీనటులకు విభిన్న భాషల్లో, కొత్త దర్శకులతో పనిచేసే అవకాశాలు పెరిగాయి" అని సీనియర్ హీరో జగపతి బాబు పేర్కొన్నారు.

మూస పాత్రల నుంచి బయటకు వచ్చి ప్రయోగాలు చేయడం వల్ల తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకునే అవకాశం దక్కిందని జగపతి బాబు చెప్పారు. "ప్రతి ప్రాంతానికి సొంత కథన శైలి ఉంటుంది. ఇతర భాషల చిత్రాల్లో నటించడం ఒక నటుడిగా నన్ను మరింత మెరుగుపరుస్తోంది. భాషతో సంబంధం లేకుండా బలమైన కథ, నటన ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రకృతికి దగ్గరగా నా ఇల్లు

హైదరాబాద్‌లోని తన నివాసం గురించి ప్రస్తావిస్తూ, ఇల్లు అనేది అందులో నివసించే వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలని జగపతి బాబు అన్నారు. "ఇల్లు ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ అడుగుపెట్టగానే ఆప్యాయత, ప్రశాంతత, ప్రకృతితో మమేకమైన అనుభూతి కలగాలి. పచ్చదనం నిండిన వాతావరణం ఇంటికి అసలైన అందాన్ని ఇస్తుంది. అలసట తీర్చుకుని, మనతో మనం గడిపేందుకు అనువుగా, ఉల్లాసంగా ఉండే ఇల్లే నాకు ఇష్టం" అని జగపతి బాబు తన అభిరుచిని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.