Senior Actress: ఆరేళ్ల చిన్నోడితో సెలబ్రిటీ యోగా ట్రైనర్ పెళ్లి- వజ్రపు ఉంగరంతో సీనియర్ నటి చిన్నకొడుకు లవ్ ప్రపోజ్!
Archana Puran Singh Son Ayushmaan Sethi Engagement: ప్రముఖ నటి, వ్యాఖ్యాత అర్చన పూరణ్ సింగ్ చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేతి తన గర్ల్‌ఫ్రెండ్ సమీక్షా శెట్టికి ఇటలీలో రోమాంటిక్‌గా ప్రపోజ్ చేశారు. తనకంటే ఆరేళ్లు పెద్దదైన సమీక్ష వేలికి ఉంగరం తొడిగి ముద్దులతో ముంచెత్తిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Archana Puran Singh Son Ayushmaan Sethi Engagement: బాలీవుడ్ సీనియర్ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చన పూరణ్ సింగ్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇప్పటికే ఆమె పెద్ద కుమారుడు ఆర్యమన్ సేతి ప్రముఖ నటి యోగితా బిహానీతో నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేతి కూడా తన మనసైన అమ్మాయిని వెతుక్కున్నారు.

ప్రియురాలికి ప్రపోజ్
తన లాంగ్ టైమ్ గర్ల్‌ఫ్రెండ్, సెలబ్రిటీ యోగా ట్రైనర్ సమీక్షా శెట్టికి ఇటలీలోని సీజనల్‌గా వచ్చే ప్రకృతి అందాల నడుమ అత్యంత రోమాంటిక్‌గా ప్రపోజ్ చేశారు ఆయుష్మాన్ సేతి. సముద్ర తీర ప్రాంతాల్లో షూటింగ్స్, పర్యటనలకు వెళ్లే సినీ ప్రముఖుల జాబితాలో ఇటలీకి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి అందమైన వాతావరణంలోనే ఆయుష్మాన్ తన ప్రేయసికి అద్భుతమైన జ్ఞాపకాన్ని అందించారు.
ఇటలీ అందాల సాక్షిగా మోకాళ్లపై నిలబడి ప్రపోజల్
ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కాప్రి (Capri) దీవిలో ఈ అందమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక విలాసవంతమైన షిప్‌పైన ఆయుష్మాన్ మోకాళ్లపై కూర్చుని సమీక్ష వేలికి మెరిసే వజ్రపు ఉంగరాన్ని తొడిగారు. ఆ వెంటనే ఆమెను ఆత్మీయంగా కౌగిలించుకుని గాల్లో ముద్దులతో ముంచెత్తారు.
ఈ అపూర్వ క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. "ఈ ప్రపంచంలో ఎన్ని జన్మలెత్తినా, ఎంతమంది ఉన్నా మళ్లీ మళ్లీ నిన్నే నా భాగస్వామిగా ఎంచుకుంటాను" అని ఆ ఫోటోల కింద క్యాప్షన్ రాసుకొచ్చారు ఆయుష్మాన్ సేతి.
ప్రేమికుడి కంటే ఆరేళ్లు పెద్దదైన సమీక్షా శెట్టి ఎవరు?
బాలీవుడ్‌లో అనేకమంది ప్రముఖులకు హెల్త్ అండ్ మైండ్ కోచ్‌గా, యోగా శిక్షకురాలిగా సమీక్షా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వయసులో ఆయుష్మాన్ కంటే ఆమె ఆరేళ్లు పెద్ద కావడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం.
వయసు వ్యత్యాసంతో సంబంధం లేకుండా వీరిద్దరూ గత కొన్నాళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నారు. ఆయుష్మాన్ నిర్వహించే యూట్యూబ్ వ్లాగ్స్‌లో తరచూ సమీక్ష కనిపిస్తూ నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు.
సినీ నేపథ్యం.. ఆర్టిస్టుగా ఆయుష్మాన్ ప్రయాణం
తల్లిదండ్రులు అర్చన పూరణ్ సింగ్, పర్మీత్ సేతి సినీ రంగానికి చెందినవారు కావడంతో ఆయుష్మాన్ కూడా అదే దారి ఎంచుకున్నారు. నటుడిగా, రచయితగా, ప్రొడ్యూసర్‌గా తనదైన ముద్ర వేసిన ఆయుష్మాన్, డిజిటల్ మీడియాలో వ్లాగర్‌గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం అర్చన పూరణ్ సింగ్ 'పతి పత్ని ఔర్ పంగా 2' రియాలిటీ షోతో పాటు కపిల్ శర్మ కామెడీ షోలలో అలరిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు కొడుకులూ నచ్చిన భాగస్వాములను ఎంచుకోవడంతో అర్చన పూరణ్ సింగ్ కుటుంబంలో తీవ్ర సంతోషం వ్యక్తమవుతోంది.
అర్చన ఇంట్లో రెండు శుభవార్తలు
గతేడాది జులైలోనే పెద్ద కొడుకు ఆర్యమన్ తన ప్రియురాలు యోగితా బిహానీకి ప్రపోజ్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. అర్చన కూడా తన కుటుంబానికి చెందిన పూర్వీకుల పవిత్రమైన ఉంగరాన్ని కాబోయే పెద్ద కోడలికి బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారు.
ఇప్పుడు చిన్న కొడుకు కూడా సమీక్షతో ఎంగేజ్‌మెంట్ ముగించడంతో సేతి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. త్వరలోనే వీరిద్దరి వివాహ వేడుక తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


