Lalithamma Death: సినీ పరిశ్రమలో విషాదం- సీనియర్ నటి, లేడి విలన్ లలితమ్మ కన్నమూత- 3 రంగాల్లో ప్రత్యేక స్థానం!
Actress Lalithamma Passed Away: రంగస్థలం, బుల్లితెర, వెండితెర వంటి 3 రంగాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి, లేడి విలన్ లలితమ్మ (65) బెంగళూరులో కన్నుమూశారు. దాదాపు 35 ఏళ్ల పాటు నాటకరంగంలో రాణించిన ఆమె, దర్శన్ చిత్రం 'సుంతర గాళి'లో 'సారాయి శారద' పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
Actress Lalithamma Passed Away: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమ విలక్షణ నటనతో దశాబ్దాల పాటు రంగాస్థలం, బుల్లితెర, వెండితెరపై అలరించిన సీనియర్ నటి లలితమ్మ (65) బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోజన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం (అక్టోబర్ 5) ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

కథకు ప్రాణం పోసేది విలన్స్
దక్షిణ భారత చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ పాత్ర ఎంతో కీలకమైనది. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కథకు ప్రాణం పోసేది మాత్రం విలన్ రోల్ పోషించే నటులే. లలితమ్మ మృతి వార్త వినగానే శాండల్‌వుడ్ చిత్రసీమతో పాటు బుల్లితెర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆశ్రమంలో చికిత్స పొందుతూ ప్రశాంతంగా..
లలితమ్మ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం ఆమె తీవ్ర పక్షవాతానికి (స్ట్రోక్) గురయ్యారు. దీంతో బెంగళూరులోని 'అమ్మన మడిలు ట్రస్ట్' ఆశ్రమంలో చేర్పించి వైద్య సహాయం అందించారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించడంతో ఆమె ప్రశాంతంగా కన్నుమూశారని ఆశ్రమ వర్గాలు వెల్లడించారు.
నాటకరంగం నుంచి వెండితెర వరకు సుదీర్ఘ ప్రయాణం
లలితమ్మ నటనా ప్రయాణం నాటక రంగంతోనే మొదలైంది. దాదాపు 35 ఏళ్ల పాటు రంగాస్థలంపై అనేక నాటకాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నటిగా అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే ఆమెను బుల్లితెర, వెండితెరలపై సహజ నటిగా నిలబెట్టింది. కన్నడలో ప్రజాదరణ పొందిన 'రంగోలి', 'మాంగళ్య', 'మహామాయి' వంటి ధారావాహికల్లో తల్లిగా, అత్తగా నటించి ప్రతి కన్నడ ఇంటిల్లిపాదికీ దగ్గరయ్యారు.
'సారాయి శారద'గా చెరగని ముద్ర
వెండితెరపై లలితమ్మ అనగానే అందరికీ గుర్తుకువచ్చే పాత్ర 'సారాయి శారద'. చాలెంజింగ్ స్టార్ దర్శన్ కథానాయకుడిగా వచ్చిన 'సుంతర గాళి' సినిమాలో ఆమె పోషించిన ఈ లేడీ విలన్ పాత్ర ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది.
లలితమ్మ విలక్షణ పాత్రలు
ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ 'జాకీ', 'జంగ్లీ', 'లైఫూ ఇష్టేనే', 'వజ్రకాయ', 'పుత్ర' వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో విలక్షణ పాత్రలతో తన ప్రతిభను చాటుకున్నారు లలితమ్మ. ప్రధాన పాత్రలకు బలాన్నిస్తూ, కథలో భావోద్వేగాలను పండించే క్యారెక్టర్ ఆర్టిస్టుగా లలితమ్మ అందించిన సేవలు చిరస్మరణీయం.
3 రంగాల్లో ప్రత్యేక స్థానం
నాటకరంగం, టీవీ, సినిమాలు.. ఇలా మూడు రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న లలితమ్మ భౌతికంగా దూరమైనా, ఆమె పోషించిన చిరస్మరణీయ పాత్రల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1: కన్నడ నటి లలితమ్మ వయసు ఎంత, ఆమె ఎలా మరణించారు?
A1: లలితమ్మ వయసు 65 సంవత్సరాలు. రెండున్నర నెలల క్రితం పక్షవాతం (స్ట్రోక్) రావడం, వయోసహజ అనారోగ్య కారణాలతో ఆమె బెంగళూరులోని అమ్మన మడిలు ట్రస్ట్‌లో కన్నుమూశారు.
Q2: లలితమ్మకు ఏ సినిమా ద్వారా అత్యధిక గుర్తింపు లభించింది?
A2: దర్శన్ కథానాయకుడిగా వచ్చిన 'సుంతర గాళి' సినిమాలో 'సారాయి శారద' అనే ప్రతినాయకి (లేడీ విలన్) పాత్ర ద్వారా ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది.
Q3: లలితమ్మ నటించిన ప్రముఖ టీవీ సీరియళ్లు ఏవి?
A3: ఆమె 'రంగోలి', 'మాంగళ్య', 'మహామాయి' వంటి ప్రజాదరణ పొందిన కన్నడ సీరియళ్లలో నటించారు.
Q4: లలితమ్మ నాటకరంగంలో ఎంతకాలం కొనసాగారు?
A4: ఆమె దాదాపు 35 ఏళ్ల పాటు నాటకరంగంలో సేవలు అందించారు. ఆ అనుభవంతోనే టీవీ, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


