Serial Heroine: రొమాంటిక్ ఫొటోలతో సీక్రెట్ లవర్‌తో సీరియల్ నటి ఎంగేజ్‌మెంట్- మిరమిట్లు గొలిపే డైమండ్ రింగ్‌తో ప్రపోజ్!

Serial Actress Jiya Shankar Engagement Photos: బిగ్ బాస్ ఓటీటీ 2 ఫేమ్, సీరియల్ నటి జియా శంకర్ నిశ్చితార్థం చేసుకున్నారు. తన సీక్రెట్ లవర్ కరణ్‌తో దిగిన రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ, ఊహించని సమయంలో దేవుడు తనకు సరైన తోడును ఇచ్చాడంటూ భావోద్వేగంగా నోట్ రాసుకొచ్చారు. జియా శంకర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 6, 2026, 11:02:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actress Jiya Shankar Engagement Photos: రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ 2 ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ హీరోయిన్ జియా శంకర్ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా సీక్రెట్‌గా ఉంచిన తన ప్రేమకథను అధికారికంగా బయటపెట్టడమే కాకుండా, తనకు నిశ్చితార్థం కూడా పూర్తయిందని ప్రకటించారు.

రొమాంటిక్ ఫొటోలతో సీక్రెట్ లవర్‌తో సీరియల్ నటి ఎంగేజ్‌మెంట్- మిరమిట్లు గొలిపే డైమండ్ రింగ్‌తో ప్రపోజ్!
రొమాంటిక్ ఫొటోలతో సీక్రెట్ లవర్‌తో సీరియల్ నటి ఎంగేజ్‌మెంట్- మిరమిట్లు గొలిపే డైమండ్ రింగ్‌తో ప్రపోజ్!

రొమాంటిక్ ఫొటోలు

తన కాబోయే భర్త కరణ్‌తో సూర్యాస్తమయం వేళ తీయించుకున్న రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక భావోద్వేగ నోట్ రాసుకొచ్చారు. కరణ్‌ను పరిచయం చేస్తూ జియా శంకర్ రాసిన క్యాప్షన్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"నువ్వు నాతో ఉంటే సొంతింట్లో ఉన్నట్లే ఉంది"

"మనం అస్సలు ఊహించని సమయంలోనే నిజమైన ప్రేమ దొరుకుతుందనేది నిజమే కావచ్చు. దేవుడు నా ఓపికను చాలా రకాలుగా పరీక్షించాడు. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ, నా నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, నీతో మాట్లాడే ప్రతీ మాట నా సొంతింట్లో ఉన్నంత హాయిని ఇచ్చేది" అని జియా శంకర్ పేర్కొన్నారు.

అలాగే ఎయిర్‌పోర్ట్‌లో వీడ్కోలు చెప్పుకునేటప్పుడు, దూరంగా ఉంటున్నప్పటికీ ప్రతీ రోజూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డామో వివరిస్తూ తన ప్రేమలోని లోతును వెల్లడించారు. "ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా సరే.. నా ఇల్లు అనేది ఒక ప్రదేశం కాదు, అది కేవలం నువ్వే. నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రపంచం నువ్వే. నీతో నా జీవితం ఒక అందమైన రొమాంటిక్ కామేడీ సినిమాలా ఉంది" అని కరణ్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు జియా శంకర్.

ప్రకృతి ఒడిలో జంట, మిరుమిట్లు గొలిపే డైమండ్ రింగ్

సూర్యాస్తమయం వేళ ఓపెన్ ఎయిర్‌లో ప్రకృతి ఒడిలో కరణ్ ఆమెకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశారు. జియా షేర్ చేసిన పిక్చర్లలో డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక ఫొటోలో జియా ఆశ్చర్యంతో నోటిపై చేయి వేసుకుని ఎమోషనల్ అవగా, మరికొన్ని ఫొటోల్లో ఈ జంట ఒకరినొకరు హగ్ చేసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో రింగ్ ని కొంటెగా చూపించారు జియా.

ఎంగేజ్‌మెంట్ వేడుక కోసం జియా శంకర్ ప్యాస్టెల్ ఎల్లో కలర్ శాటిన్ గౌన్ ధరించగా, కరణఅ బీజ్ కలర్ షర్ట్, వైట్ ట్రౌజర్స్‌లో కనిపించారు. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ అభిషేక్ మల్హాన్‌తో జియా ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగాయి.

అసలు విషయం బయటపెట్టిన హీరోయిన్

అయితే అవన్నీ కేవలం పుకార్లేనని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఆమె పలుమార్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఒక కొత్త వ్యక్తి తన నుదుటిపై ముద్దుపెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ 'తప్పుడు ఊహాగానాలను వదిలేయండి' అని చెప్పినప్పటికీ, అతని ముఖాన్ని చూపించలేదు జియా.

ఇప్పుడు ఏకంగా ఎంగేజ్‌మెంట్ పిక్స్‌తో ఆ సీక్రెట్ లవర్‌ను పరిచయం చేయడంతో అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జియా శంకర్, కరణ్ రొమాంటిక్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జియా శంకర్ మేరి హానికారక్ బీవీ, పిశాచిని తదితర సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేశారు.

జియా శంకర్ సీరియల్స్

కాగా, జియా శంకర్ మేరి హానికారక్ బీవీ, పిశాచిని తదితర సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More