Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి కేవలం పది మందే కంటెస్టెంట్?.. ఆరోజు నుంచే రియాలిటీ షో ప్రారంభం!
Bigg Boss Telugu 10 TV Premiere Date: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ 'దశావతారం' పేరుతో అలరించేందుకు సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్టింగ్‌లో ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో కేవలం 10 మంది కంటెస్టెంట్లే ఉంటారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Bigg Boss Telugu 10 TV Premiere Date: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' పదో సీజన్‌కు వేళయైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 'బిగ్ బాస్ 10: దశావతారం' అనే వినూత్న ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సన్నద్ధమవుతోంది.

ఎలాంటి మార్పులు
ఈ సారి రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు, షో రూల్స్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
హోస్టుగా నాగార్జునే..
గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ 10వ సీజన్‌కు హోస్ట్ మారుతున్నారని, వేరొక స్టార్ హీరో బాధ్యతలు తీసుకోనున్నారనే ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఈ వార్తలకు నిర్వాహకులు తెరదించారు. మూడో సీజన్ నుంచి వరుసగా బిగ్ బాస్‌ను నడిపిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జునే ఈ పదో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రోమో షూట్!
ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జునతో కలిసి ప్రత్యేక ప్రోమో షూట్ కూడా పూర్తి చేశారు. 2017లో ప్రారంభమైన మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసి ఆకట్టుకోగా, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని నడిపించారు. ఆ తర్వాత నుంచి నాగార్జున తనదైన శైలిలో షోను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
"ప్రతి సీజన్‌లోనూ సరికొత్త అంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాం. పదో సీజన్ 'దశావతారం' కాన్సెప్ట్‌తో మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతోంది" అని బిగ్ బాస్ వర్గాలు పేర్కొన్నాయి.
'దశావతారం' ట్విస్ట్.. హౌస్‌లోకి 10 మందేనా?
అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 10కి 'దశావతారం' అనే పేరు ఖరారు చేయడంతో బిగ్ బాస్ టీమ్ కొత్త ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ప్రతి సీజన్‌లో 15 నుంచి 20 మంది వరకు కంటెస్టెంట్లు ఉంటారు. కానీ, ఈ సారి 'దశ' కాన్సెప్ట్‌కు తగ్గట్లుగా కేవలం 10 మంది సెలబ్రిటీలనే హౌస్‌లోకి పంపనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులు
అంతేకాకుండా, సామాన్యుల (Commoners) కోసం నిర్వహించిన 'అగ్నిపరీక్ష' ద్వారా ఎంపికైన వారు ఎంతమంది హౌస్‌లోకి అడుగుపెడతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఈ పది మందిలో సామాన్యులు కూడా ఉంటారా లేదా వారికోసం ప్రత్యేక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా అనేది త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్.. ప్రారంభం ఎప్పుడంటే?
బిగ్ బాస్ సీజన్ 10 కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ ఎత్తున హౌస్ సెట్ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ మొదటి వారంలో అది కూడా సెప్టెంబర్ 6 నుంచి ఈ గ్రాండ్ రియాలిటీ షో ప్రారంభం కానుందని సమాచారం.
పది రెట్లతో టాస్కులు
హౌస్ డిజైన్, లైటింగ్, కంటెస్టెంట్ల ఎంపిక విషయాల్లో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పది సీజన్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈసారి టాస్కులు, గొడవలు, ఎమోషన్స్ అన్నీ పది రెట్లు ఎక్కువగా ఉండేలా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


