Jagapathi Babu: లెజెండ్ తో తన యాక్టింగ్ కెరీర్ ను సరికొత్తగా మొదలెట్టాడు జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న అతను.. ఇప్పుడు విలక్షణమైన నటనతో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నాడు. తాజాగా పెద్దిలో అప్పలసూరిగా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పెద్ది క్యారెక్టర్ కోసం

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ ఇంటర్వ్వూలో జగపతి బాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఫస్ట్ పెద్ది మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ గురించి జగపతి బాబు మాట్లాడాడు.
‘‘బుచ్చిబాబు డైరెక్ట్ గా నా దగ్గరకేం రాలేదు. నలుగురైదుగురు దగ్గరకు వెళ్లాడు. వాళ్లు నో అంటే ఓ ట్రయల్ వేద్దామని వచ్చి నన్ను కలిశాడు. నా టైమ్ బాగుండి వర్కౌట్ అయింది’’ అని జగపతి బాబు చెప్పాడు.
ఉప్పెనలో
ఈ క్రమంలోనే ఉప్పెనలో విజయ్ సేతుపతి పోషించిన రాయణం క్యారెక్టర్ కోసం ఫస్ట్ తననే బుచ్చిబాబు కలవాల్సిందని జగపతి బాబు వెల్లడించాడు. ‘‘ఉప్పెన గురించి మాట్లాడటానికి వస్తానన్నాడు. గేటు వరకూ వచ్చాడు. సరై పైకి రమ్మని చెప్పా. కానీ సార్, అర్జెంట్ గా ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. మ్యాటర్ ఏంటీ అంటే.. మనసు మార్చుకున్నాడు. విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు’’ అని జగపతి బాబు చెప్పాడు.
మార్కెట్ లేదని
‘‘బుచ్చిబాబు నాకు చాలా క్లోజ్. నాన్నకు ప్రేమతో అప్పటి నుంచి తెలుసు. సుకుమార్ కు అసిస్టెంట్ డైెరెక్టర్ గా చేశాడు కదా. అందుకే మొన్న అడిగా. నిజం చెప్పమన్నా. ‘అప్పుడు కమర్షియల్ గా అయితే విజయ్ సేతుపతి అంటే మార్కెట్ ఉంటుంది కదా’ అని బుచ్చిబాబు చెప్పాడు. సరే నిజమైతే చెప్పావని అన్నా. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అది మిస్ అయింది. ఇప్పుడు పెద్దిలో ఛాన్స్ దొరికింది’’ అని జగపతి బాబు వివరించాడు.
{{/usCountry}}‘‘బుచ్చిబాబు నాకు చాలా క్లోజ్. నాన్నకు ప్రేమతో అప్పటి నుంచి తెలుసు. సుకుమార్ కు అసిస్టెంట్ డైెరెక్టర్ గా చేశాడు కదా. అందుకే మొన్న అడిగా. నిజం చెప్పమన్నా. ‘అప్పుడు కమర్షియల్ గా అయితే విజయ్ సేతుపతి అంటే మార్కెట్ ఉంటుంది కదా’ అని బుచ్చిబాబు చెప్పాడు. సరే నిజమైతే చెప్పావని అన్నా. ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. అది మిస్ అయింది. ఇప్పుడు పెద్దిలో ఛాన్స్ దొరికింది’’ అని జగపతి బాబు వివరించాడు.
{{/usCountry}}సూపర్ హిట్
బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఉప్పెన. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరో. మూవీలో హీరోయిన్ తండ్రి రాయణం క్యారెక్టర్ ను విజయ్ సేతుపతి ప్లే చేశాడు. తన కూతురిని ప్రేమించే అబ్బాయికి అత్యంత క్రూరమైన శిక్ష వేసే కిరాతక తండ్రిగా విజయ్ సేతుపతి నటించాడు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి.