Peddi: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగపతిబాబు.. పెద్దిలో అప్పలసూరిగా మేకోవర్ చూశారా? వీడియో వైరల్
Peddi: సినిమాల్లో విభిన్నమైన క్యారెక్టర్లూ ప్లే చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు. తాజాగా పెద్ది కోసం అతను అప్పలసూరిగా మారాడు. ఆ గెటప్ లో జగపతి బాబును గుర్తు పట్టడం కష్టమే. ఈ గెటప్ మేకోవర్ వీడియోను పెద్ది టీమ్ తాజాగా పంచుకుంది.
Peddi: పెద్ది మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పెద్ది ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అప్పలసూరిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

పెద్దిలో అప్పలసూరిగా
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో అప్పలసూరిగా జగపతి బాబు కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం తన లుక్ ను అతను పూర్తిగా మార్చుకున్నాడు. అసలు ఇది జగపతి బాబేనా అనే అనుమానం వచ్చేలా అతని అవతారం ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన అప్పలసూరి ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది.
వీడియో వైరల్
పెద్ది రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో మూవీ టీమ్ స్పీడప్ చేసింది. ఈ క్రమంలోనే అప్పలసూరి క్యారెక్టర్ కోసం జగపతి బాబు తనను తాను మార్చుకున్న మేకోవర్ విధానాన్ని చూపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
రామ్ చరణ్ తండ్రిగా
డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ సాగిపోతున్న జగపతి బాబు ఇప్పుడు పెద్ది మూవీలో రామ్ చరణ్ తండ్రిగా నటిస్తున్నాడని సమాచారం. ఓ సాధారణ పేదింటి తండ్రిగా అతను కనిపిస్తాడని అంటున్నారు. మరి మూవీలో రామ్ చరణ్, జగపతి బాబు మధ్య బంధం ఎలా ఉంటుందో చూడాలి.
పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కూడా నటించారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన డైరెక్టర్. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ట్రైలర్ కోసం వెయిటింగ్
పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మే 18న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ముంబయిలో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే పేర్కొంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం పెద్ది సినిమా టీమ్ చుట్టిరానుంది.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమాలో ఓ గ్రామీణ క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటించాడు. క్రికెట్ తో పాటు కుస్తీలోనూ అతను తలపడనున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


