Jagapathi Babu: ఒక్కడినే.. ఎక్కడికి వెళ్తానో ఏమో.. దారే తెలియదు.. ఇంట్రెస్టింగ్ గా జగపతి బాబు పోస్ట్

Jagapathi Babu: ఒక్కడినే వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తానో ఏమిటో.. అంటూ జగపతి బాబు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు. ఇది వైరల్ గా మారింది. 

Published on: May 5, 2026, 10:29:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jagapathi Babu: విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ, విలక్షణమైన నటనతో జగపతి బాబు అదరగొడుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలా దూసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు విలన్ సహా ఇతర క్యారెక్టర్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. ఒక్కడు.. అంటూ ఆయన ఫొటో పంచుకున్నారు.

జగపతి బాబు (x/jaggu bhai)
జగపతి బాబు (x/jaggu bhai)

ఒక్కడు అంటూ జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచే జగ్గూ భాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏదో మెట్రో స్టేషన్ లో జగపతి ఆ ఫోటో తీసుకున్నట్లు ఉంది.

‘‘ఒక్కడు.. నేను ఒక్కడినే ట్రైన్ ఎక్కి హోటల్ కు వెళ్లిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానే ఏమిటో.. అసలే దారి తెలియదు’’ అని జగపతి బాబు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.

వైరల్ పోస్టు

జగపతి బాబు పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సరదాగా రియాక్టవుతున్నారు. ‘ట్రైన్ కి దారి తెలుసులేండీ’, ‘చిల్ అవడానికి వెళ్తున్నారు బాబాయ్’, ‘సర్, కొంచెం స్మైల్ ఇవ్వొచ్చు కదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెద్ది సినిమాలో

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘అప్పలసూరి’ అనే క్యారెక్టర్ కోసం గుర్తు పట్టలేనంతగా తన లుక్ ను ఆయన మార్చుకున్నారు. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఫ్యామిలీ హీరో నుంచి

‘సింహ స్వప్నం’ మూవీతో హీరోగా డెబ్యూ చేసిన జగపతి బాబు ఆ తర్వాత ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. 2013లో ఆపరేషన్ దుర్యోధన 2లో హీరోగా నటించారు. ఆ తర్వాత ఆయన కెరీర్ మలుపు తీసుకుంది.

సెకండ్ ఇన్నింగ్స్

2014లో వచ్చిన లెజెండ్ తో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో క్రూరమైన విలన్ గా జగపతి బాబు తన యాక్టింగ్ తో ఇరగదీశారు. ఫ్యామిలీ హీరోలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని ఆ మూవీలో జగ్గూ భాయ్ ను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి విలన్, కీలక క్యారెక్టర్లు చేస్తూ జగపతి బాబు దూసుకెళ్తున్నారు.

తాజాగా వదలా అనే థ్రిల్లర్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. లయ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజైంది. భార్యభర్తల మధ్య మూడో మనిషి వస్తే ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనే కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More