గ్రాండ్‌గా మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్- ఆకట్టుకునేలా క్యాప్షన్- హీరో తల్లాడ సాయికృష్ణపై కామెంట్స్

తల్లాడ సాయికృష్ణ హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా మ్యాజిక్ మూవ్‌మెంట్స్. దీనికి మీరు అనుకున్నది కాదు అనే ఆకట్టుకునే క్యాప్షన్ పెట్టారు. తాజాగా డిసెంబర్ 12న మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో తల్లాడ సాయికృష్ణపై టెక్నిషియన్స్ అందరూ కామెంట్స్ చేస్తూ ప్రశంసించారు.

Published on: Dec 13, 2025, 14:56:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) అనేది క్యాప్షన్. ఆకట్టుకునే క్యాప్షన్‌తో వస్తున్న మ్యాజిక్ మూవ్‌మెంట్స్ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

గ్రాండ్‌గా మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్- ఆకట్టుకునేలా క్యాప్షన్- హీరో తల్లాడ సాయికృష్ణపై కామెంట్స్
గ్రాండ్‌గా మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్- ఆకట్టుకునేలా క్యాప్షన్- హీరో తల్లాడ సాయికృష్ణపై కామెంట్స్

తుది దశలో చిత్రీకరణ

ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రీకరణ తుది దశలో ఉంది.

మ్యాజిక్ మూవ్‌మెంట్స్ టైటిల్ లాంచ్

ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం (డిసెంబర్ 12) హైదరాబాద్‌లో "మ్యాజిక్ మూవ్‌మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెక్నిషియన్స్, సినిమా టీమ్ అంతా హీరో తల్లాడ సాయికృష్ణపై కామెంట్స్ చేస్తూ ప్రశంసించారు.

ఎప్పుడూ సినిమా ఆలోచనే

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ.. "తల్లాడ సాయికృష్ణకు ఎప్పుడూ సినిమా ఆలోచనే. ఏదో ఒకటి స్క్రిప్ట్ చేస్తుంటాడు, దాన్ని పిక్చరైజ్ చేస్తుంటాడు. నాకు కొన్నేళ్లుగా సాయికృష్ణ తెలుసు" అని అన్నారు.

మంచి పేరు రావాలని

"అతని తపన చూసి మన వంతు సపోర్ట్ ఇవ్వాలని ఈ సినిమాకు నాకు వీలైనంత సహకారం అందించాను. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సాయికృష్ణకు మంచి పేరు రావాలని ఆశిస్తున్నా" అని డీవోపీ సతీష్ రెడ్డి కోరారు.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా

డాక్టర్ ఏఎంఆర్ మాట్లాడుతూ.. "ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా హీరోగా నిలదొక్కుకునేందుకు సాయికృష్ణ ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాలు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ చాలా బాగుంది. మీరంతా ఈ మూవీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ఇండస్ట్రీలో పడే కష్టం నాకు తెలుసు

"నేను యూఎస్‌లో ఉంటాను. నాకు సినిమాలంటే ఆసక్తి. సాయికృష్ణ ఇండస్ట్రీలో పడే కష్టం నాకు తెలుసు. అందుకే అతనికి సపోర్ట్‌గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేనూ ఈ చిత్రంలో ఒక మంచి రోల్ చేశాను" అని సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి తెలిపారు.

ఆర్థికంగా స్థిరపడాలని

"మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు) సినిమా హిట్ అయి సాయికృష్ణ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడంతో పాటు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటున్నా" అని కో ప్రొడ్యూసర్ వెంకట్ దుగ్గిరెడ్డి పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో స్థిరపడాలని

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. "తల్లాడ సాయికృష్ణకు మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు) సినిమాతో సక్సెస్ రావాలి. అతను మరో నాలుగు మూవీస్ చేసి ఇండస్ట్రీలో స్థిరపడాలని ఒక నిర్మాతగా కోరుకుంటున్నా" అని చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More