Jagapathi Babu: రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.236 కోట్లు వసూలు చేసి వరల్డ్ వైడ్‌గా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో పెద్ది పబ్లిక్ టాక్ మాత్రం హీరోయిన్ జాన్వీ కపూర్‌కు కొంత ప్రతికూలంగా ఉంది.

పెద్ది సినిమాలో ఆమె నటన, క్యారెక్టరైజేషన్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. పెద్ది హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే, ఒక నటిని ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ట్రోలింగ్‌పై సినిమాలో 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు స్పందించారు. జాన్వీ కపూర్‌ను ఎవరూ ట్రోల్ చేయొద్దని ఆయన ఆడియన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు పెద్ది సినిమాలో తన క్యారెక్టర్‌కు కూడా తగినంత గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జాన్వీ డైరెక్టర్ చెప్పిందే చేసింది.. ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు!
సాధారణంగా నెటిజన్లు ఒక క్యారెక్టర్ వర్కౌట్ కాకపోతే.. డైరెక్టర్ విజన్‌ను పక్కనపెట్టి ఆర్టిస్ట్‌ను తిడుతుంటారు. జాన్వీ కపూర్ విషయంలో కూడా ఇదే జరిగిందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు.
"సినిమా రిజల్ట్ గురించి ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి డైరెక్టర్ ఏం చెప్తే అదే చేసింది. ఒక్కోసారి డైరెక్టర్ విజన్ తెరపైకి వచ్చేసరికి మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీ కపూర్‌కు వంద శాతం సపోర్ట్ ఇస్తాను. ఆమెను పర్సనల్‌గా టార్గెట్ చేసి, సోషల్ మీడియాలో మెంటల్‌గా ఇబ్బంది పెట్టొద్దు" అని జగపతి బాబు కోరారు. ఒక యాక్టర్‌గా డైరెక్టర్ చేతిలో కీలుబొమ్మలా మారడం తప్ప హీరోయిన్ చేతిలో ఏమీ ఉండదనే వాస్తవాన్ని ఆయన గుర్తుచేశారు.
నా ప్రాణం పెట్టి చేశాను.. వాళ్లకైతే 20 సినిమాలు ఇచ్చేవారు
జగపతి బాబు 'పెద్ది' సినిమాలో తన క్యారెక్టర్ గురించి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టి పనిచేశానని, మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా పెద్ది రిలీజ్ కోసమే వెయిట్ చేశానని ఆయన చెప్పారు.
{{/usCountry}}జగపతి బాబు 'పెద్ది' సినిమాలో తన క్యారెక్టర్ గురించి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టి పనిచేశానని, మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా పెద్ది రిలీజ్ కోసమే వెయిట్ చేశానని ఆయన చెప్పారు.
{{/usCountry}}"సినిమా రిలీజ్ అయ్యాక ఒక పెద్ద డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. సినిమాలో నా పాత్ర అంత గొప్పగా ఉన్నా జనాలు ఎందుకు గుర్తించట్లేదు అని అడిగారు. అదే వేరే ఇండస్ట్రీకి చెందిన నటుడు ఈ క్యారెక్టర్ చేసి ఉంటే, వాళ్లను ఆకాశానికెత్తేసి వెంటనే 20 సినిమాలు ఆఫర్ చేసేవాళ్లు అని ఆయన నాతో అన్నారు" అని జగపతి బాబు అసహనం వ్యక్తం చేశారు.
టాలీవుడ్‌లో పరభాషా నటులకు ఇచ్చే గౌరవం మన వాళ్లకు ఇవ్వరనే పాయింట్‌ను ఆయన ఇన్‌డైరెక్ట్‌గా టచ్ చేశారు. తాను కన్నడలో నటించినప్పుడు అక్కడ చాలా గౌరవం దక్కుతుందన్నారు.
బుచ్చిబాబును అడిగే హక్కు నాకుంది..
షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు సెట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారని, కానీ ఇప్పుడు ఎవరూ తన గురించి మాట్లాడకపోవడం బాధగా ఉందని ఆయన చెప్పారు. ఇదే విషయంపై డైరెక్టర్ బుచ్చిబాబును కూడా ప్రశ్నించానని తెలిపారు.
"ఈ సినిమా కోసం నా వంద శాతం ఇచ్చాను కాబట్టే గుర్తింపు అడిగే హక్కు నాకు ఉంది. వేరే ఏ సినిమాకూ నేను ఇలా అడగలేదు. పెద్ది సినిమాకు ఇంకా ఆదరణ దక్కుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతారు" అని జగపతి బాబు ధీమా వ్యక్తం చేశారు. రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా, రూ.300 పెట్టి టికెట్ కొనే ఆడియన్స్ చేతుల్లోనే ఇండస్ట్రీ తలరాత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తానికి పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్న టైమ్‌లో.. ఇలాంటి వివాదాలు సినిమా చుట్టూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవైపు రికార్డ్ కలెక్షన్స్, మరోవైపు నటీనటులపై ట్రోల్స్... ఇవన్నీ పెద్ది సినిమాను ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంచుతున్నాయి.