Sequels 2026: దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'సీక్వెల్ సంస్కృతి' ఎంతటి ఘనవిజయం సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప' వంటి బిగ్ ఫ్రాంచైజీలు అందించిన స్పూర్తితో.. ప్రేక్షకులకు తెలిసిన పాత్రలు, ఉత్కంఠభరితమైన కథలతో సీక్వెల్స్ ను తెరకెక్కించడం ఇండస్ట్రీలో సేఫ్, సక్సెస్ ఫార్ములాగా మారింది. 2026 సంవత్సరంలో విడుదలైన పలు సౌత్ ఇండియన్ సీక్వెల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.
కోలీవుడ్ బాక్సాఫీస్ డామినేషన్: 'జైలర్ 2', 'గట్ట కుస్తీ 2'

తమిళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సీక్వెల్స్ హవా స్పష్టంగా కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్ 2' అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
తొలి భాగం 2023లో రూ.348.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ఈ సీక్వెల్ విడుదలైన తొలి లాంగ్ వీకెండ్‌లోనే భారత్‌లో దాదాపు రూ.242.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.
మరోవైపు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన 'గట్ట కుస్తీ 2' కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ. 27 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లో రూ.41.58 కోట్ల నెట్ వసూలు చేసి, మొదటి భాగం (రూ.9.90 కోట్లు) కంటే నాలుగు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది.
మలయాళంలో కనకవర్షం: 'దృశ్యం 3', 'వాళ 2', 'ఆడు 3'
మలయాళ ఇండస్ట్రీ చిన్న బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంలో ముందుంది.
దృశ్యం 3 (Drishyam 3: The Past Never Stays Silent): మోహన్‌లాల్ - జీతూ జోసెఫ్ కాంబోలో మే 2026లో థియేటర్లలోకి వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, భారత్‌లోనే రూ.110.49 కోట్ల నెట్ వసూళ్లతో ఈ ఫ్రాంఛైజీ సత్తా చాటింది.
{{/usCountry}}దృశ్యం 3 (Drishyam 3: The Past Never Stays Silent): మోహన్‌లాల్ - జీతూ జోసెఫ్ కాంబోలో మే 2026లో థియేటర్లలోకి వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, భారత్‌లోనే రూ.110.49 కోట్ల నెట్ వసూళ్లతో ఈ ఫ్రాంఛైజీ సత్తా చాటింది.
{{/usCountry}}వాలా II (Vaazha II: Biopic of a Billion Bros): ఏప్రిల్ 2, 2026న విడుదలైన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ కేవలం రూ.12 కోట్ల చిన్న బడ్జెట్‌తో రూపొంది, ఏకంగా రూ.129.42 కోట్ల నెట్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఆడు 3 (Aadu 3): జయసూర్య ప్రధాన పాత్రలో మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో మార్చి 19న వచ్చిన ఈ మూవీ రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూ.51.12 కోట్ల నెట్ వసూలు సాధించి ప్రాంచైజీ విజయాన్ని ముందుకు తీసుకెళ్లింది.
కన్నడలో 'లవ్ మాక్‌టైల్ 3' మ్యాజిక్
శాండిల్‌వుడ్ నటుడు డార్లింగ్ కృష్ణ, మిలనా నాగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన రోమాంటిక్ డ్రామా 'లవ్ మాక్‌టైల్ 3' మార్చి 19, 2026న విడుదలై సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగించింది. కేవలం రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూడో భాగం రూ.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి, ప్రాంచైజీ బ్రాండ్ వాల్యూను మరింత పెంచింది.
మొత్తానికి 2026లో దక్షిణాది సినీ ప్రియులను అలరించడంలో సీక్వెల్స్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని బాక్సాఫీస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.