...
...
Next Story

Ala Bolelo song: రజనీకాంత్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ట్రోలింగ్ మొదలు పెట్టిన నెటిజన్లు.. ఇదీ కారణం

Jailer 2 First Single Ala Bolelo song: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అల బొలెలో రిలీజైంది. అయితే ఈ పాట రిలీజైన కొద్ది సేపట్లోనే నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీనికి కారణమేంటో చూడండి.

Published on: Aug 21, 2026, 19:41:02 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jailer 2 First Single Ala Bolelo song: సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి ఫస్ట్ సింగిల్ 'అల బొలేలో' (Ala Bolelo) ఎట్టకేలకు రిలీజ్ అయింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ డ్యాన్స్ నెంబర్‌లో రజనీకాంత్‌తో పాటు నటి షామ్నా కాసిమ్ (పూర్ణ) కనిపించి అలరించారు. ఓనం పండుగ సందర్భంగా కేరళ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఓనం స్పెషల్ ట్రాక్.. కలర్‌ఫుల్ విజువల్స్

Ala Bolelo song: రజనీకాంత్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ట్రోలింగ్ మొదలు పెట్టిన నెటిజన్లు.. ఇదీ కారణం
Ala Bolelo song: రజనీకాంత్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ట్రోలింగ్ మొదలు పెట్టిన నెటిజన్లు.. ఇదీ కారణం

నాలుగు నిమిషాల నిడివితో వచ్చిన జైలర్ 2 మూవీ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో షామ్నా కాసిమ్ పద్ధతైన కేరళ సంప్రదాయ కసావు చీర కట్టుకుని మాస్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో మెప్పించింది. ఆమె వేసిన స్టెప్పులకు తోడుగా బ్యాక్‌గ్రౌండ్‌లో రజనీకాంత్ తనదైన వింటేజ్ స్వాగ్, స్టైలిష్ లుక్స్‌తో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ పాటను అనిరుధ్ రవిచందర్ స్వయంగా ఆలపించగా, అరుణ్‌రాజా కామరాజ్ లిరిక్స్ అందించారు. నిరంజన రామన్, అపర్ణ హరికుమార్, దీప్తి సురేష్ అడిషనల్ ఒకల్స్ పాటలోని వైబ్‌ను మరింత పెంచాయి.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ రచ్చ.. ఆ తప్పుల వల్లే..

పాట విడుదలైన కొన్ని గంటలకే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఊహించని విమర్శలు మొదలయ్యాయి. ఓనం కాన్సెప్ట్‌తో మలయాళ ఫ్లేవర్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అనిరుధ్ పాడిన మలయాళ పదాల ఉచ్ఛారణ సరిగ్గా లేదని కేరళ ఆడియెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళం లిరిక్స్ రాయడానికి కేరళకు చెందిన రైటర్‌ను, సింగర్‌ను ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ అనిరుధ్‌ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా లిరికల్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు వేర్వేరు దిశల్లో డ్యాన్స్ చేయడం కూడా ట్రోలింగ్‌కు గురైంది.

'జైలర్ 2' సినిమాపై మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పెక్టేషన్స్

టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజనీకాంత్, ఆయన భార్యగా రమ్యకృష్ణ మళ్లీ సీక్వెల్‌లో అలరించబోతున్నారు. యోగి బాబు, మిర్నా, రిత్విక్ తమ క్యారెక్టర్లను రీప్రైజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన పాయింట్ నుంచే సెకండ్ పార్ట్ స్టోరీ నడుస్తుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్

ఫస్ట్ పార్ట్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ మెరుపు కామియోలు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. రెండో భాగంలోనూ వారు కనిపిస్తారని సమాచారం. వీరితో పాటు ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, జతిన్ సర్నా లాంటి పాన్-ఇండియా స్టార్స్ కొత్తగా కాస్ట్‌లో చేరారు.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్టోబర్ 15న ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe