Jana Nayagan 1st Day Worldwide Box Office Collection: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ వచ్చిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan). సెన్సార్ అడ్డంకులతో దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి నిన్న (జూలై 23) వచ్చింది.
చివరి సినిమా కావడంతో

దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారే ముందు వచ్చిన చివరి సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రికార్డు కలెక్షన్లు సాధించలేకపోయింది.
తమిళనాడు వ్యాప్తంగా హౌస్‌ఫుల్ బోర్డులతో బోణీ కొట్టినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. భారత బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 41 కోట్ల నెట్ (రూ. 48 కోట్ల గ్రాస్) కలెక్షన్లను మాత్రమే రాబట్టింది జన నాయగన్ సినిమా. తెలుగు, హిందీ రాష్ట్రాల్లో డబ్బింగ్ వెర్షన్లకు ఆశించిన స్థాయి స్పందన రాలేదు.
జన నాయగన్ కలెక్షన్స్
ఈ రెండు భాషల్లో కలిపి కేవలం రూ. 3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది సినిమా మొత్తం భారతీయ వసూళ్లలో 10 శాతానికంటే తక్కువే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్‌కు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపం వల్ల ఇక్కడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మందగించాయి.
ఓవర్సీస్‌లో పర్వాలేదనిపించిన వసూళ్లు
స్వదేశంలో డల్ అయినప్పటికీ, విదేశాల్లో మాత్రం 'జన నాయగన్' పర్వాలేదనిపించింది. ఉత్తర అమెరికాలో ప్రిమియర్లతో కలిపి తొలిరోజే 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మరొక 1 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది.
దీంతో ఓవర్సీస్ వ్యాప్తంగా తొలిరోజు మొత్తం 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ అంటే, 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జన నాయగన్ చిత్రం తొలిరోజు రూ. 78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
వంద కోట్ల కలెక్షన్స్ మిస్.. పాత రికార్డులు భద్రం
{{/usCountry}}దీంతో ఓవర్సీస్ వ్యాప్తంగా తొలిరోజు మొత్తం 3.2 మిలియన్ డాలర్ల గ్రాస్ అంటే, 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జన నాయగన్ చిత్రం తొలిరోజు రూ. 78.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
వంద కోట్ల కలెక్షన్స్ మిస్.. పాత రికార్డులు భద్రం
{{/usCountry}}తొలిరోజే సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించినా, ఆ మార్కును అందుకోవడంలో 'జన నాయకుడు' విఫలమయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో టాప్ 25 ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో కూడా ఈ చిత్రం చోటు దక్కించుకోలేకపోయింది. విజయ్ గత చిత్రాలైన 'లియో' (రూ. 150 కోట్లు), 'గోట్' (రూ. 99 కోట్లు), 'బీస్ట్' (రూ. 83 కోట్లు) సాధించిన తొలిరోజు వసూళ్ల కంటే ఇది చాలా తక్కువ.
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' సాధించిన రూ. 152 కోట్ల వసూళ్లలో సగం మాత్రమే 'జన నాయగన్' దక్కించుకుంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న 'పెద్ది' (రూ. 117 కోట్లు), 'వార్ 2' (రూ. 79 కోట్లు) సినిమాల తొలిరోజు కలెక్షన్ల కంటే కూడా ఈ సినిమా వెనుకబడటం గమనార్హం.
సీఎం హోదాలో థియేటర్లలోకి విజయ్
హెచ్. వినోథ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నిజానికి జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. సీబీఎఫ్‌సీ (CBFC) నుంచి సర్టిఫికేట్ రావడంలో ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడింది. ఈ వ్యవధిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) విజయం సాధించడం, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి.
దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయ్ నటించిన ఆఖరి సినిమా విడుదల కావడం ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.