...
...
Next Story

Jana Nayagan OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి దళపతి విజయ్ చివరి సినిమా.. ఈవారమే డిజిటల్ ప్రీమియర్

Jana Nayagan OTT Release Date: దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ డిజిటల్ ప్రీమియర్ ఈవారమే కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమాను ఆగస్ట్ 21 నుంచి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది.

Published on: Aug 17, 2026, 17:39:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jana Nayagan OTT Release Date: కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Jana Nayagan OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి దళపతి విజయ్ చివరి సినిమా.. ఈవారమే డిజిటల్ ప్రీమియర్
Jana Nayagan OTT Release Date: అఫీషియల్.. ఓటీటీలోకి దళపతి విజయ్ చివరి సినిమా.. ఈవారమే డిజిటల్ ప్రీమియర్

“బంగారం.. దళపతి జన నాయగన్ జీ5లో ఆగస్ట్ 21న మిమ్మల్ని కలవనున్నాడు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసిన ఆ ఓటీటీ.. తమిళనాడు సీఎం అంటూ విజయ్ ని ట్యాగ్ చేసింది.

నెగటివ్ టాక్ దాటుకుని బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డ్

డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన జన నాయగన్ సినిమా రిలీజ్ మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు, రిలీజ్ రోజే పైరసీ లీకులు తీవ్రంగా వేధించినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ ఏటి అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు విజయ్ నటించిన ఫేర్‌వెల్ మూవీ కావడంతో తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చారు. కంటెంట్ పరంగా యావరేజ్ అన్న కామెంట్స్ వచ్చినప్పటికీ, విజయ్ బాక్సాఫీస్ పవర్ ముందు ఎలాంటి నెగటివిటీ నిలవలేకపోయింది. తన మాస్ మేనియాతో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తనే నెంబర్ వన్ అని విజయ్ మరోసారి నిరూపించారు.

క్రేజీ కాస్టింగ్.. అనిరుధ్ కంపోజింగ్ మ్యాజిక్

ఆగస్టు 21న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్సయిన ఆడియన్స్ కోసం, దళపతి విజయ్ మాస్ పెర్ఫార్మెన్స్ మళ్లీ చూడాలనుకునే వారి కోసం జీ5 పర్ఫెక్ట్ వేదికగా మారబోతోంది.

'ఖైకీ', 'తునివు' లాంటి పవర్‌ఫుల్ సినిమాలు తీసిన హెచ్. వినోద్, ఈ చిత్రాన్ని విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టుగా సోషల్ మెసేజ్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో డిజైన్ చేశారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe