...
...
Next Story

Janhvi Kapoor Birthday: జాన్వీ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన ఖుషీ.. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?

Janhvi Kapoor Birthday: జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ షేర్ చేసిన అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ చిన్ననాటి అరుదైన ఫొటోల్లో ఆమె చాలా క్యూట్ గా ఉంది.

Published on: Mar 6, 2026, 21:07:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ తన పుట్టినరోజును (మార్చి 6) తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంది. ఏటా తన పుట్టినరోజున వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ.. ఈసారి తన మొక్కును తీర్చుకునేందుకు అలిపిరి మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకుంది. ఈ సందర్భంగా జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

Janhvi Kapoor Birthday: జాన్వీ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన ఖుషీ.. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?
Janhvi Kapoor Birthday: జాన్వీ చిన్ననాటి ఫొటోలు షేర్ చేసిన ఖుషీ.. ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?

జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. జాన్వీ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా తన ప్రియురాలు జాన్వీతో ఉన్న ఒక క్యూట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. హార్ట్ ఎమోజీతో "హ్యాపీ బర్త్ డే" అని పోస్ట్ చేశాడు.

జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ అయితే తన అక్క జాన్వీకి అత్యంత ఎమోషనల్ బర్త్ డే విషెస్ చెప్పింది. అమ్మ శ్రీదేవితో కలిసి ఉన్న పాత ఫోటోలను షేర్ చేస్తూ.. "నా సోదరి, నా బెస్ట్ ఫ్రెండ్, నా టీచర్, నా పార్ట్నర్ ఇన్ క్రైమ్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. నీవు లేనిదే నేను ఏమీ లేను. ప్రతి జన్మలోనూ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చింది.

మొక్కు తీర్చుకున్న జాన్వీ.. 3,550 మెట్లు ఎక్కి..

తిరుమల శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో జాన్వీ కపూర్ అలిపిరి కాలినడక మార్గంలోని 3,550 మెట్లను ఎక్కి తిరుమలకు చేరుకుంది. తెల్లవారుజామునే కొండపైకి చేరుకున్న ఆమె.. సామాన్య భక్తులతో కలిసి ముచ్చటిస్తూ, సెల్ఫీలు ఇస్తూ వినమ్రంగా కనిపించింది.

వృత్తిపరంగా కూడా జాన్వీ కపూర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఆమె నటించిన తాజా మూవీ 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹98- ₹100 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆమె అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న తెలుగు చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ 30న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks