...
...
Next Story

ఆస్కార్స్ రేసు నుంచి జాన్వీ కపూర్ మూవీ ఔట్.. ఫైనల్ నామినేషన్స్ లిస్టులో దక్కని చోటు

ఆస్కార్స్ నామినేషన్ల తుది జాబితా వచ్చేసింది. దురదృష్టవశాత్తు ఇండియా తరఫున అధికారికంగా వెళ్లిన జాన్వీ కపూర్ మూవీ 'హోమ్‌బౌండ్' సినిమాకు ఇందులో చోటు దక్కలేదు. తుది నామినేషన్ల లిస్టు గురువారం (జనవరి 22) రిలీజ్ చేశారు.

Published on: Jan 22, 2026, 19:40:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆస్కార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కోసం ఆశగా ఎదురు చూసిన ఇండియన్ మూవీ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గురువారం (జనవరి 22) అధికారిక నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండియా తరపున అధికారికంగా వెళ్లిన 'హోమ్‌బౌండ్' సినిమాకు చోటు దక్కలేదు.

ఆస్కార్ రేసులోని మూవీస్ ఇవే

ఆస్కార్స్ రేసు నుంచి జాన్వీ కపూర్ మూవీ ఔట్.. ఫైనల్ నామినేషన్స్ లిస్టులో దక్కని చోటు
ఆస్కార్స్ రేసు నుంచి జాన్వీ కపూర్ మూవీ ఔట్.. ఫైనల్ నామినేషన్స్ లిస్టులో దక్కని చోటు

ఇండియా నుంచి ఆస్కార్స్ వెళ్లిన హోమ్‌బౌండ్ మూవీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. అర్జెంటీనా నుంచి 'బెలెన్', బ్రెజిల్ నుంచి 'ది సీక్రెట్ ఏజెంట్', ఫ్రాన్స్ నుంచి 'ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జర్మనీ నుంచి 'సౌండ్ ఆఫ్ ఫాలింగ్', ఇరాక్ నుంచి 'ది ప్రెసిడెంట్స్ కేక్' సినిమాలు ఎంపికయ్యాయి.

అలాగే జపాన్ నుంచి 'కోకుహో', జోర్డాన్ నుంచి 'ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యూ', నార్వే నుంచి 'సెంటిమెంటల్ వాల్యూ', పాలస్తీనా నుంచి 'పాలస్తీనా 36', దక్షిణ కొరియా నుంచి 'నో అదర్ ఛాయిస్' మూవీస్ కూడా చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు స్పెయిన్ నుంచి 'సిరత్', స్విట్జర్లాండ్ నుంచి 'లేట్ షిఫ్ట్', తైవాన్ నుంచి 'లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్', ట్యూనీషియా నుంచి 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' వంటి సినిమాలు నామినేషన్ల జాబితాలో ఉన్నాయి.

'హోమ్‌బౌండ్' సినిమా కథ ఏంటంటే?

నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన 'హోమ్‌బౌండ్' మూవీ గతేడాది సెప్టెంబర్ 26న ఇండియాలో విడుదలైంది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలోని సగటు జీవులు పడిన కష్టాలను ఈ మూవీలో చూపించారు. దీనికి అంతర్జాతీయంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో మాత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేడు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆస్కార్ ప్రచారానికి చాలా ఖర్చు: కరణ్ జోహార్

"మేము హోమ్‌బౌండ్ సినిమా చేస్తున్నప్పుడు, ఆస్కార్ ప్రచారానికి చాలా డబ్బు ఖర్చవుతుందని నేను అదార్‌తో చెప్పాను. కొన్నిసార్లు అది ఎంత ఖర్చు పెట్టినా తరగని అగాధంలా ఉంటుంది. ఎందుకంటే ఫలితం ఏంటో మనకు తెలియదు. మనం కనీసం షార్ట్‌లిస్ట్ చేసిన 15 సినిమాల్లోకి లేదా చివరి 5 సినిమాల్లోకి వెళ్తామో లేదో కూడా తెలియదు. ఇది చాలా కష్టమైన పని" అని వివరించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks