Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మూవీ 'పెద్ది' (Peddi). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా అచియమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై థియేట్రికల్ రన్ ముగించుకున్నప్పటికీ, అందులో కథానాయిక పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలు ఇంకా ఆగడం లేదు.

తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9)లో వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్.. 'పెద్ది' సినిమా వివాదంపై తొలిసారిగా నోరు విప్పారు. సౌత్ చిత్ర పరిశ్రమలో 'బౌండ్ స్క్రిప్ట్స్' ఉండవని, కెమెరా యాంగిల్స్ ముందే చూపించరని వ్యాఖ్యానించిన జాన్వీపై టాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
'విక్టిమ్ కార్డ్' వాడుతోందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ విమర్శలు
దర్శకుడు బుచ్చి బాబు సానా ఇప్పటికే వివాదాస్పద సీన్ల గురించి క్షమాపణలు చెప్పారని, షూటింగ్‌కు ముందే పూర్తి కథను జాన్వీకి వివరించారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత లేదా విమర్శలు వచ్చిన తర్వాత బాలీవుడ్ నటీనటులు సౌత్ పరిశ్రమపై నిందలు వేస్తూ 'విక్టిమ్ కార్డ్' (Victim Card) వాడటం అలవాటుగా మారిందని ధ్వజమెత్తుతున్నారు.
మరికొందరైతే జాన్వీ కపూర్ గతంలో నటించిన హిందీ సినిమాలలోని కొన్ని బోల్డ్ అండ్ గ్లామరస్ క్లిప్‌లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఆమె 'డబుల్ స్టాండర్డ్స్' ప్రదర్శిస్తోందంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద 'పెద్ది' సినిమా విడుదలైన నెలల తర్వాత కూడా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్లు టాలీవుడ్ వర్గాల్లో, బాలీవుడ్ కారిడార్లలో సరికొత్త చర్చకు తెరలేపాయి.
అసలు జాన్వీ కపూర్ ఏమన్నదంటే?
ఇంటర్వ్యూలో హోస్ట్ కరణ్ జోహార్ 'పెద్ది' సినిమాపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎంతో తీవ్రమైన పదజాలంతో స్పందించారు. "పెద్ది సినిమాలో నా పాత్రను చూపించిన విధానం చాలా వివాదాస్పదమైనది. అది అత్యంత దారుణమైన ఆబ్జెక్టిఫికేషన్ కు గురిచేసింది. నిజం చెప్పాలంటే, కథాపరంగా అది లైంగిక దాడిని ప్రోత్సహించేలా ఉందనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా వల్ల సమాజానికి ఎలాంటి ప్రతికూల సందేశం వెళ్లిందో తలుచుకుంటే నా మనస్సాక్షి నన్ను వేధిస్తోంది. ఆ సిగ్గును నేను జీవితాంతం మోయక తప్పదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}ఇంటర్వ్యూలో హోస్ట్ కరణ్ జోహార్ 'పెద్ది' సినిమాపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించగా.. జాన్వీ కపూర్ ఎంతో తీవ్రమైన పదజాలంతో స్పందించారు. "పెద్ది సినిమాలో నా పాత్రను చూపించిన విధానం చాలా వివాదాస్పదమైనది. అది అత్యంత దారుణమైన ఆబ్జెక్టిఫికేషన్ కు గురిచేసింది. నిజం చెప్పాలంటే, కథాపరంగా అది లైంగిక దాడిని ప్రోత్సహించేలా ఉందనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా వల్ల సమాజానికి ఎలాంటి ప్రతికూల సందేశం వెళ్లిందో తలుచుకుంటే నా మనస్సాక్షి నన్ను వేధిస్తోంది. ఆ సిగ్గును నేను జీవితాంతం మోయక తప్పదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}తన తప్పును కూడా అంగీకరిస్తూ.. "నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది. దర్శకుడిని ప్రశ్నించి, ఆ సీన్లను వద్దని చెప్పే అవకాశం నాకున్నప్పటికీ నేను ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో ఒక నటిగా నన్ను నేను కించపరుచుకున్నట్లే అనిపించింది" అని విచారం వ్యక్తం చేశారు.
సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు: "బౌండ్ స్క్రిప్ట్స్ ఉండవు!"
అయితే తప్పును ఒప్పుకుంటూనే సౌత్ చిత్ర పరిశ్రమ పనితీరుపై జాన్వీ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. "సౌత్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా మాత్రమే పూర్తిస్థాయి 'బౌండ్ స్క్రిప్ట్స్' (Bound Scripts) ఇస్తుంటారు. సెట్‌లోకి వెళ్లే వరకు ఏ కెమెరా యాంగిల్‌లో నిన్ను ఎలా షూట్ చేస్తున్నారో స్పష్టత ఉండదు" అని సౌత్ సినిమాలపై కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై తెలుగు సినీ అభిమానులు, సోషల్ మీడియా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'దేవర', 'పెద్ది' వంటి కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే నటించిన జాన్వీ కపూర్.. మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి అలా మాట్లాడటం సరైంది కాదని మండిపడుతున్నారు.