Janhvi Kapoor Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రీకరణపై ప్రేక్షకులు, మహిళా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

క్యారెక్టర్ పరిచయం చేసే సమయంలో జాన్వీ శరీరాకృతిపైనే కెమెరా కోణాలు ఎక్కువగా కేంద్రీకరించడం, అలాగే ఆమె అనుమతి లేకుండా హీరో ముద్దుపెట్టుకునే సీన్ల వల్ల మహిళలను తక్కువ చేసి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ అత్యంత ఎమోషనల్ గా స్పందించారు.
"ఆ అవమానాన్ని జీవితాంతం మోస్తాను!" — జాన్వీ ఆవేదన
'పెద్ది' సినిమాలో తన పాత్రపై వచ్చిన వివాదాన్ని ఎలా స్వీకరించారని కరణ్ జోహార్ అడగ్గా.. జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. "ఆ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. కానీ అలాంటి ఒక సీన్ లేదా నెరేటివ్ మన సమాజంలో, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఆలోచిస్తే నా మనస్సాక్షి తీవ్రంగా వేదనకు గురవుతోంది. ఆ అవమానాన్ని నా జీవితాంతం నాలోనే మోస్తాను. ఒక నటిగా నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. 100 శాతం అది నా పొరపాటే. అది తీవ్రమైన ఆబ్జెక్టిఫికేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటిది మళ్లీ జరగదు" అని పేర్కొన్నారు.
నా తప్పే.. అలా చేయాల్సింది కాదు
తనపై తానే నిందలు వేసుకుంటూ చాలా రోజులు మానసికంగా నలిగిపోయానని జాన్వీ వెల్లడించారు. "తప్పును వేరొకరిపైకి నెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ దక్షిణాదిలో సాధారణంగా పక్కాగా రాసుకున్న బౌండ్ స్క్రిప్ట్‌లు లేదా కెమెరా యాంగిల్స్ ముందే నటులకు చూపించే సంస్కృతి తక్కువగా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్తే అది చేయడమే నటీనటుల బాధ్యత. అయితే నాకున్న స్టార్డమ్, అధికారాలను ఉపయోగించి ఆ సీన్లలో మార్పులు చేయించి ఉండాల్సింది. అది నాకో వింత అనుభవం. అయితే ఈ వివాదం వల్ల జరిగిన మంచి ఏంటంటే.. ఇకపై ఏ దర్శకుడైనా ఒక మహిళా పాత్రను ఆ రకంగా తెరపై చూపించే ముందు వందసార్లు ఆలోచిస్తారు" అని జాన్వీ స్పష్టం చేశారు.
దండం పెట్టి క్షమాపణలు కోరిన దర్శకుడు బుచ్చి బాబు సానా
{{/usCountry}}తనపై తానే నిందలు వేసుకుంటూ చాలా రోజులు మానసికంగా నలిగిపోయానని జాన్వీ వెల్లడించారు. "తప్పును వేరొకరిపైకి నెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ దక్షిణాదిలో సాధారణంగా పక్కాగా రాసుకున్న బౌండ్ స్క్రిప్ట్‌లు లేదా కెమెరా యాంగిల్స్ ముందే నటులకు చూపించే సంస్కృతి తక్కువగా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్తే అది చేయడమే నటీనటుల బాధ్యత. అయితే నాకున్న స్టార్డమ్, అధికారాలను ఉపయోగించి ఆ సీన్లలో మార్పులు చేయించి ఉండాల్సింది. అది నాకో వింత అనుభవం. అయితే ఈ వివాదం వల్ల జరిగిన మంచి ఏంటంటే.. ఇకపై ఏ దర్శకుడైనా ఒక మహిళా పాత్రను ఆ రకంగా తెరపై చూపించే ముందు వందసార్లు ఆలోచిస్తారు" అని జాన్వీ స్పష్టం చేశారు.
దండం పెట్టి క్షమాపణలు కోరిన దర్శకుడు బుచ్చి బాబు సానా
{{/usCountry}}'పెద్ది' విడుదలైన సమయంలో విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చి బాబు సానా సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. "నాకు తెరపైనా, బయటా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రనూ కించపరచడం మా ఉద్దేశం కాదు. ప్రేక్షకులు, విమర్శకుల భావోద్వేగాలను మేము గౌరవిస్తున్నాం. వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సినిమాలో వివాదాస్పదంగా అనిపించిన ఆ సీన్లను తొలగించి, మార్పులు చేస్తున్నాం" అని ఆయన ప్రకటన విడుదల చేసి ఆ సీన్లను సినిమా నుంచి కట్ చేశారు.
ఈ అనుభవంతో రాబోయే రోజుల్లో కంటెంట్ ఎంపికలోనూ, పాత్రల చిత్రీకరణ విషయంలోనూ తాను మరింత కఠినంగా ఉంటానని జాన్వీ కపూర్ వెల్లడించారు.